శార్దూల్ ఠాకూర్ (Photo Credit: IPL/BCCI)
IPL 2022- KKR vs RCB: ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తొలి విజయం అందించిన ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ పేస్ ఆల్‌రౌండర్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేశాడంటూ కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా కొనియాడాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం శార్దూల్ నుంచి ఇలాంటి బ్యాటింగ్ ప్రదర్శన అస్సలు ఊహించలేదంటూ ఆకాశానికెత్తాడు.
కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ టాపార్డర్‌లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(57) మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు.
చుక్కలు చూపించిన శార్దూల్
ఈ క్రమంలో ఐదో స్థానంలో వచ్చిన రింకూ సింగ్(46), ఏడో స్థానంలో వచ్చిన శార్దూల్ ఠాకూర్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. శార్దూల్ 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 68 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేకేఆర్ 204 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 123 పరుగులకే చాపచుట్టేసింది. కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు పడగొట్టగా.. సునిల్ నరైన్ రెండు, సూయశ్ శర్మ మూడు వికెట్లతో మెరిశారు. బ్యాటింగ్‌లో అదరగొట్టి శార్దూల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
రసెల్ లాంటి వాళ్ల నుంచి ఇలాంటివి ఊహిస్తాం.. కానీ
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘కఠిన పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ ఆడిన ఇన్నింగ్స్ ప్రశంసనీయం. కేకేఆర్ టాపార్డర్, స్టార్ బ్యాటర్లు డగౌట్‌లో కూర్చున్న వేళ మైదానంలోకి దిగిన శార్దూల్ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ధీటుగా బదులిచ్చాడు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు.
ఊహించని రీతిలో శార్దూల్
నిజానికి ఆండ్రీ రసెల్, నితీశ్ రాణా, మన్‌దీప్ సింగ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఊహిస్తాం. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ శార్దూల్ చెలరేగిన తీరు అద్బుతం. శార్దూల్ 30-35 పరుగులు చేస్తే ఎక్కువని భావిస్తాం. అలాంటిది అతడు ఎవరూ ఊహించని రీతిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
నమ్మకం నిలబెట్టుకున్నాడు
టీ20లలో అతడికి ఇదే అత్యధిక స్కోరనుకుంటా. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వికెట్లు తీస్తాడని.. ఆరు.. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. తనను ఎంపిక చేసి వారు తప్పు చేయలేదని శార్దూల్ నిరూపించుకున్నాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్.. శార్దూల్ ఠాకూర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏప్రిల్ 9న తలపడనుంది.
చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే
గిల్, రాహుల్ కాదు.. అతడే టీమిండియా కెప్టెన్ అవుతాడు! జట్టులో ప్లేసే దిక్కు లేదు
Lord Shardul Thakur show.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023
Unbelievable hitting against RCB bowlers.pic.twitter.com/yY0qeQGhhC
Comments
Please login to add a commentAdd a comment