రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ జట్టుకు ఐపీఎల్‌లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినప్పటికీ అభిమానులు మాత్రం తమ ఆరాధ్య జట్టును ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఈ సారి కప్ మనదే అంటూ సందడి చేస్తూంటారు.
ఇప్పుడు ఐపీఎల్-2024కు సమయం ఆసన్నం కావడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా ఆర్సీబీ నిలుస్తుందని పఠాన్ జోస్యం చెప్పాడు. టైటిల్ గెలుచుకునే అన్ని రకాల అర్హతలు ఆర్సీబీకి ఉన్నాయని పఠాన్ తెలిపాడు.
"ఈ ఏడాది ఆర్సీబీ అద్భుతమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ పరంగా బెంగళూరు పటిష్టంగా ఉంది. జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నారు. బెంగళూరు జట్టు బ్యాటింగ్ లైనప్ ఆఖరివరకు బలంగా ఉంది. గత సీజన్లలో ఆర్సీబీ బ్యాటింగ్ ఎప్పుడూ అంత పటిష్టంగా లేదు. అయితే బౌలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఆర్సీబీని టైటిల్ ఫేవరేట్‌గా ఎంచుకోరు.
కానీ ఈసారి బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కన్పిస్తోంది. చిన్నస్వామి వంటి ప్లాట్ పిచ్‌లపై ఎక్స్‌ప్రెస్ పేస్‌తో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు ఆర్సీబీ జట్టులో ఉన్నారు. కాబట్టి ఈసారి ఆర్సీబీ టైటిల్ నెగ్గుతుందని భావిస్తున్నాని" స్టార్ స్పోర్ట్స్ గేమ్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment