వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్ అడుగుపెట్టింది. శుక్రవారం నార్తాంప్టన్ వేదికగా జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌ను 86 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
ఈ సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప( 35 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ యువరాజ్ సింగ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 పరుగులు), యూసఫ్ పఠాన్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 పరుగులు), ఇర్ఫాన్ పఠాన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
ఆసీస్ బౌలర్లలో సిడిల్ 4 వికెట్లు పడగొట్టగా.. కౌల్టర్‌నైల్, దోహర్టీ తలా వికెట్ సాధించారు. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది.
ఆసీస్ బ్యాటర్లలో టిమ్ పైన్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో కులకర్ణి, పవన్ నేగి తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హార్భజన్, ఇర్ఫాన్, శుక్లా తలా వికెట్ సాధించారు. ఇక శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment