టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఈ పొట్టి ప్రపంచకప్‍లో ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి. 20 జట్లు ఐదు గ్రూప్‍లుగా విడిపోయి.. లీగ్ మ్యాచ్‍లు ఆడనున్నాయి. మొత్తంగా 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. అనంతరం జూన్ 9 చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో బీజీబీజీగా ఉన్నారు. ఈ పొట్టి ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి వారంలో ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.
కాగా ఈవెంట్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సెలక్టర్లు కంటే ముందే భారత జట్టును ఎంపిక చేశాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇర్ఫాన్ ఎంపిక చేశాడు. ఈ జట్టులో అనూహ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్‌ను పఠాన్ చోటిచ్చాడు. ఇర్ఫాన్ తన ఎంపిక చేసిన జట్టులో స్పెషలిస్టు బ్యాటర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లకు అవకాశమిచ్చాడు.
అదే విధంగా వికెట్ కీపర్ల కోటాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మలను పఠాన్ ఎంపిక చేశాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు చోటు దక్కింది.
స్పెషలిష్ట్ స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను ఇర్ఫాన్ ఎంచుకున్నాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్, బుమ్రాను ఎంపిక చేసిన ఇర్ఫాన్.. మూడో సీమర్‌గా మొహ్సిన్ ఖాన్‌ను తన జట్టులోకి తీసుకున్నాడు.
పఠాన్ ఎంపిక చేసిన జట్టు ఇదే: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, సిరాజ్, బుమ్రా, మొహ్సిన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment