Irfan Pathan Picks His India XI For T20 World Cup 2022, Check Names List Here - Sakshi
Sakshi News home page

Irfan Pathan T20 World Cup Team: భారత తుది జట్టు.. వికెట్‌ కీపర్‌గా దినేష్ కార్తీక్‌.. పంత్‌కు నో ఛాన్స్‌..!

Published Mon, Jun 20 2022 1:22 PM | Last Updated on Mon, Jun 20 2022 2:25 PM

Irfan Pathan picks his India XI for T20 World Cup - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా జరుగన్న టీ20 ప్రపంచకప్‌-2022కు ఇంకా సమయం ఉన్నప్పటికీ మాజీలు, క్రికెట్‌ నిపుణులు తమ తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌ బరిలో దిగే భారత తుది జట్టును టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్ పఠాన్ అంచనా వేశాడు. ఈ జట్టులో వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ స్ధానంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్‌ను పఠాన్ ఎంపిక చేశాడు.

గత కొన్ని మ్యాచ్‌ల నుంచి పంత్‌ పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు సారథ్యం వహించిన పంత్‌.. కెప్టెన్‌గా కాస్త పర్వాలేదనపించనప్పటికీ, బ్యాటర్‌గా మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడి ఆటతీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరో వైపు మూడేళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్‌ అదరగొడుతున్నాడు.

దీంతో ప్రపంచకప్‌కు పంత్‌ స్థానంలో కార్తీక్‌ను ఎంపిక చేయాలని మాజీలు సూచిస్తున్నారు. ఇక పఠాన్ ఎంచుకున్న జట్టు విషయానికి వస్తే.. ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలను ఎంపిక చేశాడు. మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌లకు అవకాశమిచ్చాడు. ఇక ఐదో స్థానంలో హార్ధిక్‌ పాండ్యా, ఫినిషర్‌గా దినేష్‌ కార్తీక్‌కు చోటిచ్చాడు.

ఇక తన జట్టలో ఫుల్‌టైమ్‌ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేయగా.. స్పెషెలిస్ట్‌ స్పిన్నర్‌ కోటాలో కేవలం చహల్‌కు మాత్రమే చోటు పఠాన్ చోటు ఇచ్చాడు. ఇక తన ఎంచుకున్న జట్టులో ప్రధాన పేసర్లుగా బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌,హర్షల్‌ పటేల్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు. ఇక ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రకటించిన జట్టులో రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మహ్మద్‌ షమీకి చోటు దక్క లేదు.

టీ20 ప్రపంచకప్‌కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచకున్న జట్టు:  కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా,హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: Trolls On Ruturaj Gaikwad: అసలేంటి రుతురాజ్‌ నువ్వు? నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు.. మరీ ఇలా చేస్తావా? పాపం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement