
IND VS PAK T20 World Cup: త్వరలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం మాజీలు, విశ్లేషకులు తమతమ ఫేవరెట్ జట్లను ప్రకటిస్తున్న వేళ.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం మెగా టోర్నీలో పాక్‌తో తలపడాల్సిన (అక్టోబర్ 23న) భారత తుది జట్టును ఎంపిక చేశాడు. తన ఫేవరెట్ టీమ్ ఎంపికలో ఆచితూచి అడుగులు వేసిన పఠాన్... ఎటువంటి సంచలన ఎంపికలకు తావివ్వకుండా అన్ని విభాగల్లో పటిష్టమైన భారత జట్టును సెలెక్ట్ చేశాడు. అయితే పాక్‌తో ఆడబోయే పఠాన్ డ్రీమ్ ఎలెవెన్‌లో యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు చోటు దక్కకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కల్పించి. ఎప్పుడు పంత్‌కు మద్దతుగా నిలబడే అతనే పంత్‌కు తన తుది జట్టులో ఛాన్స్ ఇవ్వకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తన డ్రీమ్ ఎలెవెన్‌లో రోహిత్, కేఎల్ రాహుల్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేసిన పఠాన్.. మూడో స్థానంలో విరాట్ కోహ్లి, నాలుగో ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో దీపక్ హుడా, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఏడో స్థానంలో దినేష్ కార్తీక్, ఎనిమిదో స్థానంలో చహల్, తొమ్మిది, పది, పదకొండు స్థానాల్లో బుమ్రా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్‌లను ఎంచుకున్నాడు. పఠాన్ టీమిండియా వికెట్‌కీపర్ స్థానం కోసం పంత్‌ను కాదని డీకేకే ఓటు వేశాడు. అలాగే స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో అశ్విన్ కంటే చహల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఇర్ఫాన్ తన ఫేవరెట్ వరల్డ్ కప్ జట్టును (పాక్‌తో మ్యాచ్‌కు) ప్రకటించాడు.
కాగా, ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాక్‌తో తలపడనుంది. ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల బందానికి రోహిత్ శర్మ నాయకుడిగా, కేఎల్ రాహుల్ ఉప నాయకుడిగా వ్వవహరించనున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2022లో పాల్గొనే భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్
Comments
Please login to add a commentAdd a comment