![Irfan Pathan Enjoys Special Feast At Adnan Samis Residence](/styles/webp/s3/article_images/2024/08/12/Food1.jpg.webp?itok=S-EG7zj1)
ప్రముఖ సంగీత విద్యాంసుడు, గాయకుడు అద్నాని ఇంట మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, అతని భార్య సఫా మీర్జాకి భారీగా విందు ఇచ్చారు. ఆ విందులోని వంటకాల జాబితా వింటే వామ్మో అనాల్సిందే!. అంతలా విందు ఏర్పాటు చేశారు గాయకుడు అద్నాని, ఆయన భార్య రోయా సమీఖాన్. ఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆ విందులో డజనుకు పైగా రకరకాల రెసిపీలు ఉన్నాయంటూ వాటి వివరాలను కూడా వెల్లడించాడు.
పాయా నుంచి మసాలాలు, క్రీము కొల్లాజెన్‌తో తయారు చేసిన మటన్ సూప్, సీక్ కబాబ్‌లు తోపాటు తమ కుటుంబ మూలాలను ప్రతిబింబించే మాంసాహారాలకు రెసిపీలు ఆ కూడా ఉన్నాయి. అలాగే ఉత్తర భారతీయ వంటకాలకు సంబంధించిన నాన్‌లు, కడాయి మటన్, బటర్ చికెన్, చనా, లసూని పాలక్‌లు తదితర రెసీపీలు కూడా ఉన్నాయి. తాను ఇలాంటి భారీ విందు కోసం అని ముందు రోజు ఏమి తినకుండా ఉంటానని చెబుతున్నాడు ఇర్ఫాన్. ఈ చక్కటి డిన్నర్‌లో మనసుకి హత్తుకునే సంభాషణలు, నోటికి రుచికరమైన ఆహారంతో చక్కగా సాగిపోతుంది కాలం అంటూ ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో రాసుకొచ్చాడు ఇర్ఫాన్.
గతంలో అద్నాన్ సమీ కూడా తనకు వండటం అంటే ఎంతో ఇష్టం చెప్పారు. ముఖ్యంగా పాయా, బిర్యానీ, పపఉలు వంటి వంటకాలు చేయడం ఇష్టమని చెప్పారు కూడా. ఈ ఇద్దరు స్నేహితులు వీడియోలో ఈ రుచికరమైన వంటకాలు ఎలా చేతితో తయారు చేశారో వివరిస్తూ జోక్‌లు వేసుకుంటూ కనిపించారుడ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: అక్షయ్ కుమార్ పేరెంటింగ్ స్టైల్!..తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి..!)
Comments
Please login to add a commentAdd a comment