లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఇండియా మహారాజాస్ ఇంటిముఖం పట్టింది. ఒమెన్ వేదికగా గురువారం వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ ఐదు పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో వరల్డ్ జెయింట్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరగబోయే ఫైనల్లో ఆసియా లయన్స్‌తో జెయింట్స్ తలపడనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాజాస్.. ఆదిలోనే వసీం జాఫర్, సుబ్రమణ్యం బద్రీనాథ్ వికెట్‌లను కోల్పోయింది. అనంతరం నమన్ ఓజా (95), యూసుఫ్ పఠాన్ (45) రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించడంతో మహారాజాస్ విజయం లాంఛనమే అంతా భావించారు. యూసుఫ్ పఠాన్ వికెట్ కోల్పోవడంతో మహారాజాస్ వికెట్ల పతనం మొదలైంది.
కాగా చివరలో ఇర్ఫాన్ పఠాన్ సిక్సర్ల వర్షం కురిపించడంతో మహారాజాస్ విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే అఖరి ఓవర్‌లో 7 పరుగుల కావల్సిన నేపథ్యంలో పఠాన్ ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 20 ఓవర్ వేసిన బ్రెట్‌లీ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి జెయింట్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఇండియా మహారాజాస్ 7 వికెట్లు కోల్పోయి 223 పరుగుల మాత్రమే చేయగల్గింది. ఇర్ఫాన్ పఠాన్ కేవలంలో 21 బంతుల్లోనే 56 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వరల్డ్ జెయింట్స్ బ్యాటర్లలో గిబ్స్(89), మస్టర్డ్ (57) పరుగులతో రాణించారు.
చదవండి: IPL 2022 Mega Auction: చెన్నై చేరుకున్న ధోని.. టార్గెట్ అదేనా!
Comments
Please login to add a commentAdd a comment