Irfan Pathan & His Wife Safa Blessed With Second Baby Boy - Sakshi
Sakshi News home page

Irfan Pathan: రెండోసారి తండ్రైన ఇర్ఫాన్‌ పఠాన్‌.. మా కుమారుడి పేరేమిటంటే!

Published Tue, Dec 28 2021 3:47 PM | Last Updated on Tue, Dec 28 2021 5:06 PM

Irfan Pathan His Wife Blessed With Baby Boy Shares Photo Reveal Name - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ శుభవార్త పంచుకున్నాడు. రెండోసారి తండ్రైనట్లు వెల్లడించాడు. తన భార్య సఫా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. చిన్న కుమారుడికి సులేమాన్‌ ఖాన్‌ అని నామకరణం చేసినట్లు పేర్కొన్నాడు.  ఈ మేరకు ట్విటర్‌ వేదికగా... ‘‘సఫా, నేను.. మా కుమారుడు సులేమాన్‌ ఖాన్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. తల్లీబిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. ఈ సందర్భంగా కుమారుడిని చేతుల్లోకి తీసుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్‌ చేశాడు.

కాగా హైదరాబాద్‌కు చెందిన మోడల్‌ సఫా బేగ్‌ను ఇర్ఫాన్‌ పఠాన్‌ 2016లో పెళ్లాడిన విషయం తెలిసిందే. అదే ఏడాది ఈ జంటకు కుమారుడు ఇమ్రాన్‌ ఖాన్‌ పఠాన్‌ జన్మించాడు. ఇప్పుడు మరో చిన్నారి రాక వారి జీవితాల్లో ఆనందాలు నింపింది. ఇక కెరీర్‌ విషయానికొస్తే.. 2003లో జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న ఇర్ఫాన్‌ పఠాన్‌.. అదే ఏడాది డిసెంబరులో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు.

2004లో వన్డేల్లోనూ ప్రవేశించి సత్తా చాటాడు. టీమిండియా తరఫున మొత్తం 120 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 306 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 173, టెస్టుల్లో 100 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా 2821(వన్డేలు 1544, టెస్టులు 1105, టీ20 172 పరుగులు) పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ఇక గతేడాది అతడు ఆటకు వీడ్కోలు పలికాడు.

చదవండి: IND vs SA: 24 ఏళ్ల క్రితం సొంతగడ్డపై.. 18 ఏళ్ల క్రితం విదేశీ గడ్డపై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement