ఆ ఫొటోల్లో ఆమె ఎందుకు లేదంటే..? | why irfan pathan's bride was missing from his wedding reception photos | Sakshi
Sakshi News home page

ఆ ఫొటోల్లో ఆమె ఎందుకు లేదంటే..?

Published Tue, Mar 15 2016 5:23 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

రిసెప్షన్ లో ఇర్ఫాన్, యూసఫ్‌ పఠాన్

రిసెప్షన్ లో ఇర్ఫాన్, యూసఫ్‌ పఠాన్

న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు, బరోడా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పెళ్లి రిసెప్షన్ ఫొటోలు చూసి అభిమానులు నోరెళ్లబెట్టారు. ఈ ఫొటోల్లో పెళ్లికూతురు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. రిసెప్షన్ కు మీడియా ఫొటోగ్రాఫర్లను అనుమతించలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పెళ్లికూతురిని చూసేందుకు పురుష అతిథులను కూడా అనుమతించలేదని వెల్లడించాయి. ఫొటోలు మీడియాకు ఇవ్వలేదని తెలిపాయి.

ఈ విషయంపై ఇర్ఫాన్ పఠాన్ ను సంప్రదించగా.. తమ సొంతం ఫొటోగ్రాఫర్లతో రిసెప్షన్ వేదిక వద్ద తాము ఫొటోలు తీయించుకున్నామని చెప్పాడు. తన వ్యక్తిగత ఫొటోలు బయటకు వెల్లడి చేయడానికి తాను ఇష్టపడనని వెల్లడించాడు. స్వవిషయాల్లో ప్రచారానికి దూరంగా ఉంటానని అన్నాడు. అందుకే తన కుటుంబానికి సంబంధిచిన ఫొటోలు సోషల్ మీడియాలో కనబడవని చెప్పాడు.

పెళ్లితో తన జీవితంలో కొత్తా అధ్యాయం ప్రారంభమైందన్నాడు. పరస్పరం ప్రేమాభిమానాలు పంచుకుంటే వివాహం ఆనందమయం అవుతుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. మోడల్ సాఫా బేగ్ ను గత నెలలో మక్కాలో ఇర్ఫాన్ పఠాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement