Safa
-
రెండోసారి తండ్రైన ఇర్ఫాన్ పఠాన్.. మా కుమారుడి పేరేమిటంటే!
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ శుభవార్త పంచుకున్నాడు. రెండోసారి తండ్రైనట్లు వెల్లడించాడు. తన భార్య సఫా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. చిన్న కుమారుడికి సులేమాన్ ఖాన్ అని నామకరణం చేసినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా... ‘‘సఫా, నేను.. మా కుమారుడు సులేమాన్ ఖాన్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. తల్లీబిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఈ సందర్భంగా కుమారుడిని చేతుల్లోకి తీసుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశాడు. కాగా హైదరాబాద్‌కు చెందిన మోడల్ సఫా బేగ్‌ను ఇర్ఫాన్ పఠాన్ 2016లో పెళ్లాడిన విషయం తెలిసిందే. అదే ఏడాది ఈ జంటకు కుమారుడు ఇమ్రాన్ ఖాన్ పఠాన్ జన్మించాడు. ఇప్పుడు మరో చిన్నారి రాక వారి జీవితాల్లో ఆనందాలు నింపింది. ఇక కెరీర్ విషయానికొస్తే.. 2003లో జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న ఇర్ఫాన్ పఠాన్.. అదే ఏడాది డిసెంబరులో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. 2004లో వన్డేల్లోనూ ప్రవేశించి సత్తా చాటాడు. టీమిండియా తరఫున మొత్తం 120 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 306 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 173, టెస్టుల్లో 100 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా 2821(వన్డేలు 1544, టెస్టులు 1105, టీ20 172 పరుగులు) పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ఇక గతేడాది అతడు ఆటకు వీడ్కోలు పలికాడు. చదవండి: IND vs SA: 24 ఏళ్ల క్రితం సొంతగడ్డపై.. 18 ఏళ్ల క్రితం విదేశీ గడ్డపై Safa and me welcome our baby boy SULEIMAN KHAN. Both baby and mother are fine and healthy. #Blessings pic.twitter.com/yCVoqCAggW — Irfan Pathan (@IrfanPathan) December 28, 2021 -
'నాకు 30 సెకన్లు పట్టింది.. మరి మీకు'
-
'నాకు 30 సెకన్లు పట్టింది.. మరి మీకు'
జైపూర్ : రాజస్తాన్ డిప్యుటీ సీఎం, కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా రాజస్తాన్ సంప్రదాయమైన తలపాగాను కేవలం 30 సెకన్లలోనే చుట్టుకొని ఆశ్చర్యపరిచారు. నిజానికి తలపాగా చుట్టుకోవడమనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనం ఒకదిక్కు పెడుతుంటే మరోవైపు ఊడిపోతుంది. అనుభవం ఉన్నవాళ్లు మాత్రం పంగడీ(తలపాగా)ని వేగంగానే ధరిస్తారు. కాగా సచిన్ తలపాగా చుట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేగాక ' నా చాలెంజ్ పూర్తయింది.. మరి మీరు ఎంతసేపట్లో పూర్తి చేస్తారంటూ' ప్రశ్నించారు.(ఛోటా భీమ్.. చుట్కీని ఒంటరిదాన్ని చేశాడా?) కాగా ఈ వీడియోనూ ఆయన తన ట్విటర్లో షేర్ చేశారు.' పంగడీకి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. తలపాగా అనేది రాజస్తాన్ సంప్రదాయాన్ని గుర్తుచేస్తుంది. అంతేకాదు ఇది వీరులను గుర్తు చేస్తుంది' అంటూ క్యాప్షన్ జత చేశారు. కాగా సచిన్ పైలట్ లండన్‌కు వెళ్లినప్పుడు నెహ్రూ సెంటర్ వాళ్లు ఈ వీడియా తీశారు. తాజాగా సచిన్ పైలట్ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోనూ చాలా మంది తిలకించగా, వేలకొద్ది లైకులు, రీట్వీట్లు వస్తున్నాయి.' సచిన్ పైలట్.. మీరు రాజకీయాల్లోనే కాదు.. తలపాగా చుట్టుకోవడంలోనే మంచి నైపుణ్యతను ప్రదర్శిస్తారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. (మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన మీరాచోప్రా) -
త్వరలోనే ఐసీఏఐ.. ఏసీఎంఏఐగా మార్పు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)గా ఉన్న చార్టెర్డ్ అకౌంటింగ్స్ బాడీ.. త్వరలోనే ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ)గా మారనుంది. దీనికి సంబంధించి కేంద్రం ప్రత్యేక పార్లమెంటరీ చట్టాన్ని రూపొందిస్తోందని సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఎస్‌ఏఎఫ్‌ఏ) ప్రెసిడెంట్ డాక్టర్ పీవీఎస్ జగన్మోహన్ రావు తెలిపారు. 1949లో చార్టెర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ కింద ఐసీఏఐను చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 80 వేలకు పైగా సభ్యులున్నారు. గురువారమిక్కడ ఎస్‌ఏఎఫ్‌ఏ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీల అకౌంటింగ్, ఆడిటింగ్, ఎథిక్స్ విభాగాల్లో ఎస్‌ఏఎఫ్‌ఏ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఎనిమిది సార్క్ దేశాల్లో అకౌంటింగ్, కాస్ట్ మేనేజ్మెంట్ ప్రొఫిషనల్స్ తయారీ, నిర్వహణ వంటి వాటిల్లో ఎస్‌ఏఎఫ్‌ఏ పనిచేస్తుందని.. నేపాల్, ఆప్ఘనిస్తాన్, భూటాన్, మాల్దీవుల్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ బాడీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ఎస్‌ఏఎఫ్‌ఏలో 3.50 లక్షల మంది సభ్యులున్నారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫౌండేషన్ డేను నిర్వహిస్తామని, ఫౌండేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి దేశంలో ఈ కార్యక్రమం జరుగుతుందని’’ వివరించారు. ఈ కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ నేపాల్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ ఆచార్య, సార్క్ దేశాల నుంచి 150 మంది సీఏలు, సీఎంఏలు పాల్గొన్నారు. -
ఆ ఫొటోల్లో ఆమె ఎందుకు లేదంటే..?
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు, బరోడా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పెళ్లి రిసెప్షన్ ఫొటోలు చూసి అభిమానులు నోరెళ్లబెట్టారు. ఈ ఫొటోల్లో పెళ్లికూతురు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. రిసెప్షన్ కు మీడియా ఫొటోగ్రాఫర్లను అనుమతించలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పెళ్లికూతురిని చూసేందుకు పురుష అతిథులను కూడా అనుమతించలేదని వెల్లడించాయి. ఫొటోలు మీడియాకు ఇవ్వలేదని తెలిపాయి. ఈ విషయంపై ఇర్ఫాన్ పఠాన్ ను సంప్రదించగా.. తమ సొంతం ఫొటోగ్రాఫర్లతో రిసెప్షన్ వేదిక వద్ద తాము ఫొటోలు తీయించుకున్నామని చెప్పాడు. తన వ్యక్తిగత ఫొటోలు బయటకు వెల్లడి చేయడానికి తాను ఇష్టపడనని వెల్లడించాడు. స్వవిషయాల్లో ప్రచారానికి దూరంగా ఉంటానని అన్నాడు. అందుకే తన కుటుంబానికి సంబంధిచిన ఫొటోలు సోషల్ మీడియాలో కనబడవని చెప్పాడు. పెళ్లితో తన జీవితంలో కొత్తా అధ్యాయం ప్రారంభమైందన్నాడు. పరస్పరం ప్రేమాభిమానాలు పంచుకుంటే వివాహం ఆనందమయం అవుతుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. మోడల్ సాఫా బేగ్ ను గత నెలలో మక్కాలో ఇర్ఫాన్ పఠాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
పేద మహిళల కోసంస్నేహ హస్తం
సఫా... అంటే స్వచ్ఛత, స్నేహం అని అర్థం. రుబీనా విజయానికి కారణాలు కూడా ఆ రెండే. ఓ సైనికుడి కడుపున పుట్టినందుకు తండ్రిలో ఉన్న సేవకుణ్ణి చూసి తోటివారికి సాయపడాలన్న ఆలోచన పుట్టిందామెకు. ఆ సేవ స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంది. అందుకే ‘సఫా’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వందలమంది పేద మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఏ వ్యాపారైమైనా విజయవంతంగా ముందుకు సాగడానికి స్వచ్ఛత ఉంటే చాలని ‘సఫా’లోని సభ్యులంతా నిరూపించారు. ఈ విజయం వెనక రుబినాతో పాటు బలమైన ఆశయాలు, పట్టుదలతో కూడిన లక్ష్యాలు ఉన్నాయి. సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖలో ట్రావెల్ ఆపరేటర్‌గా తొమ్మిదేళ్లు పనిచేసిన రుబీనా నఫీస్ ఫాతిమా చిన్నతనం నుంచే సేవాకార్యక్రమాలంటే ఇష్టపడేది. హైదరాబాద్‌కి చెందిన మిలటరీ అధికారి సులేమాన్ అలాఖాన్ రెండవ సంతానం రుబీనా. తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని అన్ని ప్రాంతాలను చూసిన రుబీనా తన జీవితంలో పేద మహిళల కోసం ఏదో ఒకటి చేయాలని చదువుకున్నరోజుల్లోనే ప్రణాళికలు తయారుచేసుకుంది. ‘‘సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చాక ఇక్కడ వాడలన్నీ తిరిగి చూశాను. నిరుపేద కుటుంబాల్లో మహిళ దుఃస్థితి నా మనసును కలిచివేసింది. ముఖ్యంగా ముస్లిం వాడల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చదువు లేకపోవడం ఒక్కటే కారణం కాదు, పేదరికం, గృహహింసలకు బలైపోతున్న మహిళలు, వారికి వారసులుగా పిల్లలు. ఇలాంటివారిని ముందు ఆర్థికంగా నిలబెట్టడం ఒక్కటే పరిష్కారమనుకున్నాను. బంధువులు, స్నేహితులతో ఆలోచించి ‘సఫా’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాను. ‘సఫా’ అనేది ఉర్దూ పదం. స్వచ్ఛత, స్నేహం అని అర్థం. ఈ రెండు పదాలనే పెట్టుబడిగా పెట్టి గత ఎనిమిదేళ్లుగా మా ప్రయాణం కొనసాగుతోంది’’ అని చెప్పారు రుబీనా. శిక్షణ...: హైదరాబాద్‌లోని ఖాజానగర్, సయ్యద్‌నగర్, బోలానగర్, అహమద్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి పేదమహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి రకరకాల పనులకు సంబంధించి ఉచిత శిక్షణ ఇప్పించారు రుబీనా. బంజార్‌హిల్స్‌లోని బోలానగర్ సఫా సంస్థలో వీరికి శిక్షణకు కావాల్సిన ఏర్పాటు చేశారు. మెహెందీ, స్క్రీన్ ప్రింటింగ్, జ్యూట్ బ్యాగ్ మేకింగ్, ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు, కొవ్వొత్తుల... ఇలా చాలా రకాల పనులు చేస్తున్నారక్కడ. ‘‘మొదట్లో నేనొక్కదాన్నే ఇళ్లకు తిరిగి నేను చేయబోయే పని గురించి చెప్పాను. చాలామంది నమ్మలేదు. ఓ ఇద్దరు ముగ్గురు మా సంస్థలో పని నేర్చుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నారని తెలిసాక ఒక్కొక్కరూ బయటికి రావడం మొదలుపెట్టారు. పైగా ఇంటి దగ్గరే పనిచేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చనే మాట చాలామంది ముస్లిం మహిళల్ని ‘సఫా’వైపు అడుగులు వేయించింది’’ అని చెప్పారు రుబీనా. వీరిలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలు కూడా ఉన్నారు. ఆర్థికంగా నిలబడి, పిల్లల్ని చదివించుకోవాలనే ధ్యేయంతో గడపదాటిన వీరికి ‘సఫా’ చక్కని మార్గంగా నిలిచింది. మార్కెటింగ్...: తమను ఆశ్రయించిన మహిళలకు ఏ పనంటే ఇష్టమో కనుక్కొని దానిపై శిక్షణ ఇప్పించి చేతినిండా పని ఉండేలా ప్లాన్ చేయడంలో విజయం సాధించడం వెనక రుబీనా శ్రమ చాలా ఉంది. వస్తువు తయారుచేయడం ఒకెత్తయితే, దాన్ని మార్కెట్ చేయడం మరొకెత్తు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో దీన్ని మించిన సవాలు మరొకటి లేదు. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా తయారుచేస్తున్న సఫాలోని ప్రతి వస్తువూ ఓ పేదమహిళ కడుపు నింపుతుందని తెలిస్తే మనసున్న ప్రతి ఒక్కరూ వాటిని కొనడానికి ముందుకొస్తారని చెప్పింది అక్కడ ఉపాధి పొందుతున్న హైమది బేగం. పేద పిల్లల కోసం...: కొందరు అనాథ పిల్లలనూ తండ్రి లేక ఆసరా కోల్పోయిన పిల్లలు కొందరినీ రుబీనా ఉచితంగా చదివిస్తున్నారు. ‘‘బోలానగర్లోని 140 మంది పేద పిల్లల్ని స్కూల్లో చేర్పించాం. వారి బాగోగులు ‘సఫా’నే చూసుకుంటుంది. నేను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఉపాధి పొందడానికి వచ్చిన పేదమహిళలు కూడా పని సాయం చేసి పెడుతున్నారు. స్నేహితులు, బంధువులు చేతిసాయం చేస్తున్నారు. చాలావరకూ మా సంస్థలో తయారయిన సరుకు మార్కెటింగ్‌లో వచ్చిన లాభాలే మమ్మల్ని ముందుకు పంపుతున్నాయి. భవిష్యత్తులో మరింతమంది మహిళలకు శిక్షణలు ఇచ్చి, పెద్దఎత్తున వస్తువులను తయారు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం’’ అని చెప్పారు రుబీనా. ‘‘వేడుకలకు వెళ్లకపోయినా ఫరవాలేదు, ఎవరికైనా ఆపదొచ్చినప్పుడు వెంటనే పరుగులు పెట్టకపోతే మనం మనుషుల లెక్కల్లో లేనట్టే తల్లీ’’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకుని తాతయ్య చెప్పిన మాటల్ని ఈరోజుకూ గుర్తుచేసుకుంటూ ఉంటారు రుబీనా. ఆమెనూ, ఆమె ఆశయాన్నీ ముందుకు నడిపిస్తున్నది అదే! - భువనేశ్వరి, ఫొటోలు: మోహన్ ‘‘సౌదీ నుంచి హైదరాబాద్‌కి రాగానే ఇక్కడ ట్రావెల్ అండ్ టూరిజమ్ ట్రైనింగ్ సెంటర్‌ని స్థాపించాను. చాలా రకాల కార్పొరేట్ సంస్థలతో నాకు పరిచయాలు ఏర్పాడ్డాయి. సఫాలో తయారుచేసిన జ్యూట్ బ్యాగులు, లాప్‌ట్యాప్ కవర్లు, హాండ్ బ్యాగులు, సెల్ పౌచ్‌లు, ట్రావెల్ బ్యాగులు, పెన్ స్టాండ్లను ఆ కంపెనీల్లో అమ్మేలా మార్కెటింగ్ చేసుకున్నాను. దీనికోసం ఆన్లైన్ సహకారం కూడా తీసుకుంటున్నాను. www.safaindia.org ద్వారా మా ‘సఫా’ ఉత్పత్తుల్ని చాలామంది కొనుగోలు చేస్తున్నారు’’ అని వివరించారు రుబీనా.