‘పెండింగ్‌ సబ్సిడీలను విడుదల చేయాలి’ | Foxconn and Dixon Urge Government To Release Pending Subsidies | Sakshi
Sakshi News home page

‘పెండింగ్‌ సబ్సిడీలను విడుదల చేయాలి’

Published Thu, Jan 9 2025 12:14 PM | Last Updated on Thu, Jan 9 2025 12:20 PM

Foxconn and Dixon Urge Government To Release Pending Subsidies

ప్రభుత్వాన్ని కోరిన ఫాక్స్‌కాన్‌, డిక్సన్ టెక్నాలజీస్‌

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(PLI) పథకం కింద తమకు రావాల్సిన, పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను విడుదల చేయాలని ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు ఫాక్స్‌కాన్‌(Foxconn), డిక్సన్ టెక్నాలజీస్ ప్రభుత్వాన్ని కోరాయి. ఈ రెండు కంపెనీలు మొత్తం రూ.700 కోట్ల సబ్సిడీలను కోరుతుండగా, ఫాక్స్‌కాన్‌ రూ.600 కోట్లు, డిక్సన్‌కు రూ.100 కోట్లు రావాల్సి ఉంది.

భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పీఎల్ఐ పథకం సబ్సిడీలో భాగంగా ప్రభుత్వం రూ.41,000 కోట్లు (4.8 బిలియన్ డాలర్లు) కేటాయించింది. అయితే, కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోకపోవడంతో ఈ మొత్తంలో కొంత భాగం చెల్లించలేదు. ఫాక్స్‌కాన్‌, డిక్సన్(Dixon) తమ ఉత్పత్తి పరిమితులను అధిగమించాయని, అందువల్ల కేటాయించని నిధుల్లో తాము వాటా పొందేందుకు అర్హులమని చెబుతున్నాయి.

ఇదీ చదవండి: ఎల్‌ఐసీ బీమా సఖి.. 30 రోజుల్లో 50,000 రిజిస్ట్రేషన్లు

దేశంలో యాపిల్‌ ఉత్పత్తులు తయారు చేస్తూ కంపెనీకి ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఫాక్స​్‌కాన్‌ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.30,000 కోట్ల విలువైన ఐఫోన్లను ఉత్పత్తి చేసింది. ఇది దాని రూ.20,000 కోట్ల ఉత్పత్తుల తయారీ పరిమితిని అధిగమించింది. అదేవిధంగా, డిక్సన్ టెక్నాలజీస్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.8,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను ఉత్పత్తి చేసింది. ఈ రెండు కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వ పోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇరు కంపెనీల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వం ప్రస్తుతం సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రోత్సాహకాలు రెండు సంస్థలకు కీలకంగా మారనున్నాయి. ఈ నిధులు ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, వాటి తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement