incentive
-
‘పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయాలి’
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(PLI) పథకం కింద తమకు రావాల్సిన, పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను విడుదల చేయాలని ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు ఫాక్స్‌కాన్(Foxconn), డిక్సన్ టెక్నాలజీస్ ప్రభుత్వాన్ని కోరాయి. ఈ రెండు కంపెనీలు మొత్తం రూ.700 కోట్ల సబ్సిడీలను కోరుతుండగా, ఫాక్స్‌కాన్ రూ.600 కోట్లు, డిక్సన్‌కు రూ.100 కోట్లు రావాల్సి ఉంది.భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పీఎల్ఐ పథకం సబ్సిడీలో భాగంగా ప్రభుత్వం రూ.41,000 కోట్లు (4.8 బిలియన్ డాలర్లు) కేటాయించింది. అయితే, కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోకపోవడంతో ఈ మొత్తంలో కొంత భాగం చెల్లించలేదు. ఫాక్స్‌కాన్, డిక్సన్(Dixon) తమ ఉత్పత్తి పరిమితులను అధిగమించాయని, అందువల్ల కేటాయించని నిధుల్లో తాము వాటా పొందేందుకు అర్హులమని చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఎల్ఐసీ బీమా సఖి.. 30 రోజుల్లో 50,000 రిజిస్ట్రేషన్లుదేశంలో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తూ కంపెనీకి ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.30,000 కోట్ల విలువైన ఐఫోన్లను ఉత్పత్తి చేసింది. ఇది దాని రూ.20,000 కోట్ల ఉత్పత్తుల తయారీ పరిమితిని అధిగమించింది. అదేవిధంగా, డిక్సన్ టెక్నాలజీస్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.8,000 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేసింది. ఈ రెండు కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వ పోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇరు కంపెనీల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వం ప్రస్తుతం సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రోత్సాహకాలు రెండు సంస్థలకు కీలకంగా మారనున్నాయి. ఈ నిధులు ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, వాటి తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. రూ.8 లక్షల బోనస్!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయిస్ ట్రాన్స్ఫర్ పాలసీ కింద ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ ప్రకటించింది. ముంబై-కర్ణాటక ప్రాంతంలోని టైర్-2 నగరమైన హుబ్బల్లిలో తన ఉనికిని పెంచుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.హుబ్బల్లిలోని క్యాంపస్‌కు కంపెనీ స్థానిక ఉద్యోగులను రప్పించడానికి ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ తమ ఉద్యోగులకు ఒక మెయిల్ కూడా పంపింది. అందులో ''భవిష్యత్తును నిర్మించడానికి మీలాంటి ప్రతిభ ఉన్నవారి కోసం వేచి ఉందని'' పేర్కొంది.ఇక ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ విషయానికి వస్తే.. లెవెల్ 3 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో రూ. 25,000 అందిస్తారు. ఆ తరువాత రెండు సంవత్సరాలలో.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ. 25000 అందిస్తారు. ఇలా మొత్తం 24 నెలల్లో రూ.1.25 లక్షలు లభిస్తాయి.లెవెల్ 4 ఉద్యోగులకు కంపెనీ ప్రారంభంలో రూ. 5000 అందిస్తుంది. ఆ తరువాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ. 50000 జమచేస్తుంది. ఇలా రెండు సంవత్సరాల్లో ఈ కేటగిరి ఉద్యోగులు మొత్తం రూ. 2.5 లక్షల బోనస్ పొందవచ్చు. ఉన్నత స్థాయి ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో రూ. 1.5 లక్షలు అందిస్తారు. వీరికి రెండు సంవత్సరాల్లో మొత్తం రూ. 8 లక్షలు అందిస్తారు.ఇన్ఫోసిస్ ఇప్పుడు ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ తీసుకురావడానికి ప్రధాన కారణం.. కర్ణాటక ప్రభుత్వంతో ఏర్పడిన కొన్ని విభేదాలే అని తెలుస్తోంది. కర్ణాటకలోని కొన్ని రాజకీయ పార్టీలు నుంచి సంస్థ మీద ఒత్తిడి పెరగటం మాత్రమే కాకుండా.. ఇన్ఫోసిస్ స్థానికులకు ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. కంపెనీకి ఉపాధి కల్పన కింద కేటాయించిన 58 ఎకరాల భూమిని కూడా వెన్నక్కి తీసుకోవడానికి ప్రయతిస్తున్నారు. ఈ కారణంగా ముంబై కర్ణాటక ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులను కంపెనీ హుబ్బళ్ళికి తరలించడానికి ఈ ఆఫర్ తీసుకువచ్చింది. -
ఒక్క బిడ్డను కంటే రూ.61 లక్షలు!
జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా దేశంలో జనన రేటును పెంచేందుకు వినూత్న చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు (దాదాపు రూ.61 లక్షలు) ఇచ్చే అంశాన్ని ఆ దేశ ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక, పౌర హక్కుల కమిషన్ ఓ పబ్లిక్ సర్వేను చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఏప్రిల్ 17న ప్రారంభమైంది. పిల్లల్ని కనేవారికి అందించే ప్రోత్సాహాల కోసం ఏటా 12.9 బిలియన్ పౌండ్లు ( సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) ఖర్చు చేయనుంది. ఇది ఆ దేశ బడ్జెట్లో దాదాపు సగం.దక్షిణ కొరియా దేశంలో జననాల రేటు భారీగా తగ్గిపోతోంది. 2023లో ఇది 0.72కు పడిపోయింది. 2023లో నమోదైన జాతీయ జనన రేటు ఆ దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టం. దేశంలో జనాభా సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత.. వెరసి దంపతులు వివాహ బంధానికి, పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నారు. -
పాత వాహనాలను ఈ వీలుగా మార్చేందుకు ప్రోత్సాహకాలు
-
బంపరాఫర్..! ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రూ. 3 లక్షల ప్రోత్సాహకాలు..!
బంపరాఫర్..! ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రముఖ దేశీయ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తమ ఉద్యోగుల కోసం సరికొత్త పాలసీను ప్రకటించింది. సంప్రాదాయ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ఆయా దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం కొత్త పాలసీలతో ముందుకువస్తున్నాయి. తాజాగా ప్రముఖ దేశీయ దిగ్గజ కంపెనీ జేఎస్డబ్య్లూ గ్రూప్ గ్రీన్ ఇనిషియేటివ్‌లో భాగంగా తమ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీని ప్రారంభించింది. 3 లక్షలకు వరకు ప్రోత్సాహకాలు..! 2022 జనవరి 1 నుంచి ఈ కొత్త ఈవీ పాలసీ అమల్లోకి రానుంది. తమ ఉద్యోగులను ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కంపెనీ పెట్టుకుంది. కొత్త ఈవీ పాలసీతో నాలుగు చక్రాల వాహనాలు, అలాగే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడానికి రూ. 3 లక్షల వరకు జేఎస్‌డబ్ల్యూ ప్రోత్సాహకాలను అందించనుంది. వీటితో పాటుగా ఉద్యోగుల కోసం అన్ని జేఎస్‌డబ్ల్యూ కార్యాలయాలు , ప్లాంట్లల్లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఉచిత ఛార్జింగ్ స్టేషన్లను, గ్రీన్ జోన్ పార్కింగ్ స్లాట్లను కూడా ఏర్పాటుచేయనుంది. ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ... 2070 వరకు కర్భన ఉద్గారాలను సున్నాకు తెచ్చేవిధంగా కాప్-26లో భారత్ చేసిన వాగ్దానానికి మా కంపెనీ నిబద్ధతతో ఉందని అన్నారు. చదవండి: 2022లో పెరగనున్న కార్లు, బైక్స్ కంపెనీల జాబితా ఇదే..! -
వేదాంతా లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెప్టెంబర్)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 4,615 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 838 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 21,758 కోట్ల నుంచి రూ. 31,074 కోట్లకు జంప్ చేసింది. అధిక కమోడిటీ ధరలు, బలపడిన మార్జిన్లు, వివిధ విభాగాల అమ్మకాల్లో వృద్ధి కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదం చేశాయి. క్యూ2లో రూ. 7,232 కోట్లమేర నికర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు వేదాంతా సీఈవో సునీల్ దుగ్గల్ వెల్లడించారు. వాటాదారులకు షేరుకి రూ. 18.5 చొప్పున బోర్డు మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 304 వద్ద ముగిసింది. -
సింగరేణిలో అత్యధిక ఇన్సెంటివ్ అతడిదే
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఇటీవల ప్రకటించిన 28 శాతం లాభాల వాటాలో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన టింబర్‌యార్డు వర్క్‌మెన్ మందాల ఓదేలు అత్యధికంగా రూ.1.80 లక్షల ఇన్సెంటివ్ సాధించాడు. ఏరియాల వారీగా అత్యధిక ఇన్సెంటివ్‌లు సాధించిన వారి వివరాలను యాజమాన్యం సోమవారం విడుదల చేసింది. ఓదేలు అత్యధిక ఇన్సెంటివ్ సాధించి మొదటి స్థానంలో నిలువగా, రూ.1.76 లక్షలతో మందమర్రి ఏరియాకు చెందిన జనరల్ మజ్దూర్ కుమ్మరి జెస్సీరాజ్ ద్వితీయ, రూ.1.67 లక్షలతో కొత్తగూడెం ఏరియా ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ రాంజీవన్ పాసి తృతీయ స్థానంలో నిలిచారు. బెల్లంపల్లి ఏరియాకు చెందిన జూనియర్ అసిస్టెంట్ రూ.1.38 లక్షలు, కార్పొరేట్ ఏరియాకు చెందిన జూనియర్ అసిస్టెంట్ బొజ్జ రవీందర్ రూ.1.34 లక్షలు, ఇల్లెందు ఏరియాకు చెందిన జూనియర్ కెమిస్ట్ మనోజ్ కుమార్ రూ.1.51లక్షలు, భూపాలపల్లి ఏరియాకు చెందిన ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ చిలుకల రాయలింగు రూ.1.42 లక్షలు, రామగుండం–1 ఏరియాకు చెందిన ఫోర్‌మెన్ కె.ముత్తయ్య రూ.1.55 లక్షలు, రామగుండం–2 ఏరియాకు చెందిన ఓవర్‌మెన్ గోపు రమేష్‌కుమార్ రూ.1.58 లక్షలు, రామగుండం–3 ఏరియాకు చెందిన జనరల్ మజ్దూర్ నల్లని రాంబాబు రూ.1.52 లక్షలు, మణుగూరు ఏరియాకు చెందిన ఫిట్టర్ ముప్పారపు శ్రీనివాసరావు రూ.1.38 లక్షలు స్పెషల్ ఇన్సెంటివ్ సాధించారు. -
గుజరాత్ టీమ్ కు భారీ నజరానా!
వడోదర: తొలిసారిగా రంజీ ట్రోఫీ సాధించిన తమ రాష్ట్ర క్రికెట్ జట్టుకు గుజరాత్ క్రికెట్ సంఘం(జీసీఏ) భారీ నజరానా ప్రకటించింది. పార్థివ్ పటేల్ నాయకత్వంలోని రంజీ జట్టుకు రూ. 3 కోట్ల నగదు ప్రోత్సాహ బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది. బీసీసీఐ రూ. 2 కోట్లకు ఇది అదనమని జీసీఏ ఉపాధ్యక్షుడు పరిమళ్ నాథ్వానీ తెలిపారు. ‘పార్థివ్ పటేల్ నేతృత్వంలోని గుజరాత్ జట్టు చారిత్రక విజయం సాధించి 66 ఏళ్ల తొలిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకుంద’ని ఆయన వ్యాఖ్యానించారు. ఇండోర్ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టును 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి గుజరాత్ రంజీ ట్రోఫీని తొలిసారిగా దక్కించుకుంది. పార్థివ్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 143 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. 42వ సారి ఈ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలనుకున్న ముంబై ఆశల మీద నీళ్లు చల్లాడు. జీసీఏ అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. గుజరాత్ క్రికెట్ టీమ్ కు అభినందనలు తెలిపారు. -
వివాహ ప్రోత్సాహకం రూ.లక్షకు పెంపు
మాకవరపాలెం : వికలాంగులను వివాహాలు చేసుకునేవారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రూ.లక్షకు పెంచినట్టు వికలాంగశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. మాకవరపాలెం వచ్చిన ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ఈ ప్రోత్సాహకంగా ఇప్పటవరకు రూ.50వేలు ఇచ్చేవాళ్లమన్నారు. ప్రభుత్వం ఇటీవల దీనిని రూ.లక్షకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. జిల్లాలో ఈ ఏడాది 300 మందికి ఈ ప్రోత్సాహకాలు అందించడమే లక్ష్యంకాగా ఈ ఏడాది ఇప్పటివరకు 71 మందిని ఎంపిక చేశామన్నారు. వికలాంగు లను వివాహం చేసుకున్న వారు ఈ ప్రోత్సాహకానికి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అలాగే జిల్లాలో వెయ్యి వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నామన్నారు. పెందుర్తి, విశాఖలో వికలాంగులకు వసతి గహాలు నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రస్తుతం ఖాళీలు ఉన్నాయన్నారు. ఎవరైనా చేరాలనుకుంటే దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఎండాడ వద్ద అంధ బాలికలకు రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహిస్తున్నామని, దీనిని కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాకొక వృద్ధాశ్రమం పబ్లిక్ ప్రై వేట్ పాట్నర్‌షిప్ పద్ధతిలో ప్రభుత్వం జిల్లాకొక వృద్ధాశ్రమం ఏర్పాటుకు నిర్ణయించిందని ఏడీ తెలిపారు. దీనిలో భాగంగా మొదటగా గుంటూరు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఆశ్రమాలను ఏర్పాటు చేయనుందన్నారు. ఇందులో 100 మందికి ఆశ్రయం కల్పించడం లక్ష్యమన్నారు. ఈ ఆశ్రమం నిర్వహణకు వసతి, మౌలిక సదుపాయాలంతా స్వచ్ఛంధ సంస్థలే చూసుకోవాల్సింటుందన్నారు. ఈ ఆశ్రమంలో వంటలు చేసేవారు, వాచ్‌మన్, సూపర్వైజింగ్ చేసేందుకు అవసరమైన సిబ్బందికి వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. వంద మందితో నిర్వహించే ఆశ్రమానికి ఏడాదికి రూ.46లక్షలు కర్చవుతుందన్నారు. మూడేళ్లకొకసారి వంటపాత్రలు, తదితర సామాగ్రి కొనుగోలుకు ప్రభుత్వం రూ.5.5 లక్షలు విడుదల చేస్తుందన్నారు. ఇక్కడున్న వారికి కాస్మొటిక్స్, మందులు, భోజనాలకు సంబందించి ఏడాదికి రూ.23లక్షలు అవుతాయన్నారు. ఈ నిధులు సంస్థలే చూసుకోవాలని, ఈ అవకాశం ఉన్న సంస్థలపై పరిశీలన చేస్తున్నామని, అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఆయన వెంట జూనియర్ అసిస్టెంట్ జగదీష్ ఉన్నారు.