ఒక్క బిడ్డను కంటే రూ.61 లక్షలు! | South Korea incentive for birth rate | Sakshi
Sakshi News home page

ఒక్క బిడ్డను కంటే రూ.61 లక్షలు!

Published Thu, Apr 25 2024 4:24 PM | Last Updated on Thu, Apr 25 2024 4:24 PM

South Korea incentive for birth rate - Sakshi

జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా దేశంలో జనన రేటును పెంచేందుకు వినూత్న చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు (దాదాపు రూ.61 లక్షలు) ఇచ్చే అంశాన్ని ఆ దేశ ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక, పౌర హక్కుల కమిషన్‌ ఓ పబ్లిక్‌ సర్వేను చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఏప్రిల్‌ 17న ప్రారంభమైంది. పిల్లల్ని కనేవారికి అందించే ప్రోత్సాహాల కోసం ఏటా 12.9 బిలియన్‌ పౌండ్లు ( సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) ఖర్చు చేయనుంది. ఇది ఆ దేశ బడ్జెట్‌లో దాదాపు సగం.

దక్షిణ కొరియా దేశంలో జననాల రేటు భారీగా తగ్గిపోతోంది. 2023లో ఇది 0.72కు పడిపోయింది. 2023లో నమోదైన జాతీయ జనన రేటు ఆ దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టం. దేశంలో జనాభా సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత.. వెరసి దంపతులు వివాహ బంధానికి, పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement