Dixon Technologies
-
డిక్సన్ చేతికి ఇస్మార్టు ఇండియా
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్స్ కాంట్రాక్ట్ తయారీ దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్ ఎల్రక్టానిక్స్, మొబైల్స్ తయారీ కంపెనీ ఇస్మార్టు ఇండియాను సొంతం చేసుకోనుంది. తొలి దశలో భాగంగా నగదు రూపేణా 50.1 శాతం వాటా కొనుగోలుకి షేరు కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు డిక్సన్ టెక్ వెల్లడించింది. ఇందుకు ఇస్మార్టు సింగపూర్, ట్రాన్సిషన్ టెక్నాలజీ, 5ఏ అడ్వయి జర్స్ ఎల్ఎల్పీతో ఎస్‌పీఏపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. 90 రోజుల్లోగా సొంతం చేసుకోనున్న ఈ వాటా కోసం రూ. 238 కోట్లకుపైగా వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. తదుపరి రెండో దశలో భాగంగా 2026–27కల్లా 1.6–5.9 శాతం మధ్య అదనపు వాటాను కొనుగోలు చేసేందుకు హక్కులను పొందనున్నట్లు వెల్లడించింది. వెరసి ఇస్మార్టు ఇండియాలో ఇస్మార్టు సింగపూర్ 42.75–47.05 శాతం మధ్య వాటాను మిగిల్చుకోనుంది. కాగా.. ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి పొందవలసి ఉంది. -
Andhra Pradesh: ‘పారిశ్రామిక’ పరుగులు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప సమీపంలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ కేంద్రంగా పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అలాగే, సీఎం సమక్షంలో టెక్నోడోమ్ (టీవీ యూనిట్), వర్చువల్ మేజ్, సంస్థలకు సీఎం శంకుస్థాపన చేయగా.. టెక్నోడోమ్ (వాషింగ్ మెషీన్ యూనిట్), ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు.అంతకుముందు.. కడప గడపలో రూ.5.61 కోట్లతో ఆధునికీకరించిన రాజీవ్‌మార్గ్, రూ.1.37 కోట్లతో ఏర్పాటుచేసిన రాజీవ్ పార్కునూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొప్పర్తిలో పారిశ్రామికరంగం ఊపందుకుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రఘురావిురెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ సుధా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి నగర మేయర్ సురేష్‌బాబు, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు, జేసీ గణేష్‌కుమార్, ఎస్పీ అన్బురాజన్, ట్రెయినీ కలెక్టర్ రాహుల్ మీనా, జెడ్పీటీసీ నరేన్ రామాంజనేయరెడ్డి, అల్ డిక్సన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముగిసిన మూడ్రోజుల పర్యటన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 8న వైఎస్సార్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జమ్మలమడుగు, పులివెందుల, కడపలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు.. సోమవారం మధ్యాహ్నం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు జగన్‌కు ఆత్మీయ వీడ్కోలు పలికారు. 2.05 గంటలకు కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి బయల్దేరి వెళ్లారు. సంస్థల వివరాలు.. – అల్ డిక్సన్ టెక్నాలజీస్.. అల్ డిక్సన్ కంపెనీలో సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తారు. ఐదేళ్ల కాలవ్యవధిలో రూ.127 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ సంస్థలో 1,800 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అలాగే, ఉత్పత్తి సామర్థ్యం పెంపులో భాగంగా మరో రూ.80 కోట్ల పెట్టుబడితో ‘ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, సెక్యూరిటీ కెమెరాలు మొదలైన పరికరాలు తయారుచేస్తారు. తద్వారా మరో 1,100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే, రూ.125.26 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే మరో యూనిట్ ద్వారా 630 మందికి ఉద్యోగావకాశాలు అందించే లక్ష్యంతో అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకు సాగుతోంది. మొదటి దశలో ఉత్పత్తులు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు కంపెనీ 860 మందికి ఉపాధి కల్పిస్తోంది. వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్.. 2007 నుంచి వర్చువల్ మ్యాప్ ఆధారిత సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్న ‘వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఉత్పత్తులు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే బ్యాటరీలు, జీపీఎస్ ట్రాకర్, స్మార్ట్ పీసీబీ వంటి అధునాతన డివైస్‌లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. రూ.71 కోట్ల పెట్టుబడితో పర్యావరణ హితమైన యూనిట్ ఏర్పాటుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా సుమారు 1,350 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. టెక్నోడోమ్ సంస్థ.. అరబ్ దేశాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలిస్టా కంపెనీకి అనుబంధంగా ‘టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ‘కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ రూ.52 కోట్లతో ఏర్పాటవుతోంది. దుబాయ్‌లో వీరి ప్రధాన కార్యాలయం ఉండగా, నోయిడాలో భారత్ ప్రధాన కార్యాలయం ఉంది. ట్రేడింగ్ కంపెనీగా ఈ సంస్థ గుర్తింపు పొందుతోంది. బ్రాండెడ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ప్రముఖ ఐటీ ఉత్పత్తుల సరఫరాదారులలో ఒకటిగా మారిన ఈ సంస్థ.. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వామ్యమైంది. గృహోపకరణాలు, గృహ వినోదం, వంటగది ఉపకరణాలు, ఐటీ వస్తువులు, కార్ ఆడియో, గేమింగ్ ఉత్పత్తులు, స్మార్ట్ వాచీలను ఉత్పత్తి చేయనుంది. ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. రూ.100 కోట్ల పెట్టుబడితో ఆడియో సిస్టం భాగాలను ఉత్పత్తి చేయనున్న ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కన్సల్టింగ్, రీసెర్చ్ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఎగ్జిక్యూషన్లో నైపుణ్యం కలిగి 8,000 పైగా ప్రాజెక్టు సిబ్బందితో మంచి వార్షిక ఆదాయంతో పెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. ఇక్కడ 2,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్ సేల్స్ ఫోర్స్ ఔట్సోర్సింగ్, విజువల్ మర్చండైజింగ్, లాయల్టీ ప్రోగ్రాంలు వున్నాయి. అలాగే, వీరి ముఖ్య ఉత్పత్తులు సౌండ్బార్లు, వూఫర్లు, మల్టీమీడియా స్పీకర్లు, పార్టీ స్పీకర్లు, టవర్లు వంటివి తయారుచేస్తారు. -
కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ ఉత్పత్తి షురూ!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)లో ఏఐఎల్ డిక్సన్ కంపెనీ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవుతోంది. ఈ సంస్థ రూ.127 కోట్లతో భద్రత కోసం వినియోగించే సీసీటీవీ, ఐపీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. గత నెల రోజుల నుంచి ప్రయోగాత్మకంగా ఉత్పత్తిని ప్రారంభించిన ఏఐఎల్ డిక్సన్ త్వరలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి రంగం సిద్ధం చేసుకుంటోంది. రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏఐఎల్ డిక్సన్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సీపీ ప్లస్ బ్రాండ్ పేరున్న సీసీ కెమెరాలను ఉత్పత్తి చేయనుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటెలిజెంట్ నెట్వర్క్ సొల్యూషన్స్ వెర్టికల్ సరై్వవ్లెన్స్ కెమెరాలను తయారుచేస్తుంది. ఆదిత్య ఇన్ఫోటెక్‌తో కలిసి డిక్సన్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. ఈ నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ యూనిట్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఎల్రక్టానిక్ ఐటీ ఏజెన్సీ(అపిటా) గ్రూప్ సీఈవో ఎస్.కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మరో రెండు తయారీ యూనిట్లు.. దుబాయ్‌కి చెందిన ప్రముఖ ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ.. ఎలిస్టా కొప్పర్తిలో టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎల్ఈడీ టీవీలు, ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. సుమారు 2.95 ఎకరాల విస్తీర్ణంలో రూ.52 కోట్ల వ్యయంతో దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులను మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, కామన్వెల్త్ దేశాలకు ఎగుమతి చేస్తుంది. అలాగే వర్చువల్ మేజ్ సాఫ్ట్‌సిస్ ప్రైవేట్ లిమిటెడ్.. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల తయారీ, జీపీఎస్ ట్రాకర్, స్మార్ట్ పీసీబీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 7.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.71.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ ద్వారా 1,350 మందికి ఉపాధి లభించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులకు కూడా సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణ పనులు మొదలైన 24 నెలల్లోగా ఉత్పత్తిని ప్రారంభించే విధంగా కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. రూ.749 కోట్లతో వైఎస్సార్ ఈఎంసీ అభివృద్ధి ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీ కోసం వైఎస్సార్ ఈఎంసీని 801 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలిదశలో 540 ఎకరాలు, రెండో దశలో 261 ఎకరాలు అభివృద్ధి చేయనున్నాం. తొలిదశలో రూ.749 కోట్లతో వైఎస్సార్ ఈఎంసీని అభివృద్ధి చేశాం. సుమారు రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా సుమారు 28,250 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే ఆరు యూనిట్లకు సుమారు 30 ఎకరాల వరకు కేటాయించాం. రానున్న కాలంలో ఎల్రక్టానిక్ తయారీ హబ్‌గా కొప్పర్తి కొత్తరూపు సంతరించుకోనుంది. – కోన శశిధర్, ఐటీ శాఖ కార్యదర్శి -
తక్కువ ధరలో ఎల్ఈడీ టీవీలు:గూగుల్‌తో డిక్సన్ జోడీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న డిక్సన్ టెక్నాలజీస్ తాజాగా అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్థానికంగా ఆండ్రాయిడ్, గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్స్‌పై ఎల్ఈడీ టీవీలను డిక్సన్ తయారు చేయనుంది. స్మార్ట్ టీవీల కోసం ఆన్‌డ్రాయిడ్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను గూగుల్ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. తక్కువ ఖర్చుతో కూడిన స్మార్ట్ టీవీని అందించడంతోపాటు, ఎల్ఈడీ టీవీ విభాగంలో దాని మార్కెట్ లీడర్షిప్ను మరింత బలోపేతం చేసుకోవాడనాఇకి ఇది సహాయ పడుతుందని డిక్సన్ టెక్నాలజీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్, గూగుల్ టీవీలకై భారత్‌లో సబ్ లైసెన్సింగ్ హక్కులను పొందిన తొలి ఒప్పంద తయారీ కంపెనీ తామేనని డిక్సన్ ప్రకటించింది. ఎల్ఈడీ టీవీల తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన డిక్సన్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 60 లక్షల యూనిట్లు. ఈ భాగస్వామ్యం కారణంగా ఎల్ఈడీల ఉత్పత్తిలో కంపెనీ సామర్థ్యం మరింత బలపడుతుందని సంస్థ వివరించింది. వాషింగ్ మెషీన్లు, ఎల్ఈడీ బల్బులు, ఎల్ఈడీ బ్యాటెన్స్, మొబైల్ ఫోన్స్, సీసీటీవీల వంటి ఉత్పత్తులను సైతం ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. -
డిక్సన్ టెక్- ఐడీఎఫ్సీ ఫస్ట్.. భల్లేభల్లే
ముంబై, సాక్షి: బుధవారం 10 రోజుల ర్యాలీకి బ్రేక్ పడినప్పటికీ తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా వైట్ గూడ్స్ కాంట్రాక్ట్ తయారీ దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్, ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. డిక్సన్ టెక్నాలజీస్ బోట్ బ్రాండ్ కంపెనీ ఇమేజిన్ మార్కెటింగ్ ప్రయివేట్ లిమిటెడ్‌తో ట్విన్ వైర్లెస్ స్పీకర్ల తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డిక్సన్ టెక్నాలజీస్ పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంటులో వీటిని తయారు చేయనున్నట్లు వెల్లడించింది. మరోవైపు సొంత అనుబంధ సంస్థ ప్యాడ్గెట్ ఎలక్ట్రానిక్స్ ద్వారా మోటరోలాతోనూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా మోటరోలా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను రూపొందించనున్నట్లు పేర్కొంది. ప్యాడ్గెట్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వ పీఎల్ పథకానికి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో డిక్సన్ టెక్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 6.2 శాతం జంప్‌చేసి రూ. 15,345కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.4 శాతం లాభపడి రూ. 15,220 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 75 శాతం ర్యాలీ చేయడం విశేషం! చదవండి: (ఆన్లైన్ బ్రాండ్ బోట్‌కు భారీ నిధులు) ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) మూడో త్రైమాసికంలో రిటైల్ రుణాలలో 24 శాతం వృద్ధితో రూ. 66,635 కోట్లకు చేరినట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్ వెల్లడించింది. వెరసి క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో ఫండెడ్ ఆస్తులు(రుణాలు) 0.7 శాతం పెరిగి రూ. 1.1 ట్రిలియన్లను తాకినట్లు తెలియజేసింది. పీఎస్ఎల్ కొనుగోళ్లతో కలిపి రిటైల్ ఫండెడ్ అసెట్స్ వాటా 64 శాతానికి చేరినట్లు వెల్లడించింది. మొత్తం డిపాజిట్లు 41 శాతం పెరిగి రూ. 77,289 కోట్లకు చేరగా.. వీటిలో రిటైల్ విభాగం 100 శాతం జంప్‌చేసి రూ. 58,435 కోట్లను తాకినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 44.35 వద్ద ట్రేడవుతోంది. తద్వారా గత జనవరి 20న సాధించిన ఏడాది గరిష్టం రూ. 45.5కు చేరువైంది. చదవండి: (టాటా క్లిక్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు) -
ఇన్ఫో ఎడ్జ్- డిక్సన్ టెక్నాలజీస్ భలే జోరు
హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 250 పాయింట్లు జంప్‌చేసి 38,667ను అధిగమించగా.. నిఫ్టీ 58 పాయింట్లు ఎగసి 11,413 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాలు ప్రకటించడంతో ఇన్ఫో ఎడ్జ్ ఇండియా కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఇటీవల కొద్ది రోజులుగా జోరు చూపుతున్న డిక్సన్ టెక్నాలజీస్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరర్ డిక్సన్ టెక్నాలజీస్ షేరు సరికొత్త గరిష్టాన్ని తాకితే.. నౌకరీ.కామ్, జీవన్సాథీ, 99 ఏకర్స్.కామ్ ద్వారా సేవలందించే ఇన్ఫో ఎడ్జ్ ఇండియా రికార్డ్ గరిష్టానికి చేరువైంది. ఇతర వివరాలు చూద్దాం.. ఇన్ఫో ఎడ్జ్ ఇండియా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఇన్ఫో ఎడ్జ్ ఇండియా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 94 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 191 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే నికర అమ్మకాలు మాత్రం 11 శాతం క్షీణించి రూ. 285 కోట్లను తాకాయి. ప్రస్తుతం రూ. 123 కోట్ల పన్నుకు ముందు లాభం సాధించగా.. గతంలో రూ. 150 కోట్ల నష్టం నమోదైంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 3,425ను తాకింది. ప్రస్తుతం 2.3 శాతం లాభంతో రూ. 3,369 వద్ద ట్రేడవుతోంది. గత నెల 10న సాధించిన రికార్డ్ గరిష్టం రూ. 3,584కు ఇంట్రాడేలో చేరువకావడం గమనార్హం! డిక్సన్ టెక్నాలజీస్ వరుసగా ఆరో రోజు డిక్సన్ టెక్నాలజీస్ కౌంటర్ దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 9,546 వద్ద ట్రేడవుతోంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత ఆరు రోజుల్లో 17 శాతం బలపడింది. ఈ ఏడాది మార్చి 24న రూ. 2,900 వద్ద కనిష్టాన్ని చవిచూసిన డిక్సన్ టెక్నాలజీస్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతోంది. వెరసి కనిష్టం నుంచి ఏకంగా 215 శాతం ర్యాలీ చేసింది. దేశీ ఎలక్ట్రానిక్ మార్కెట్లో పలు విభాగాల్లో కంపెనీ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులను అందిస్తోంది. ఎంఎన్‌సీలు తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను తయారు చేస్తోంది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, మొబైల్ ఫోన్లు, లెడ్ లైటింగ్ తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ ఏడాది క్యూ1లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ.. ఇకపై పనితీరు మెరుగుపడగలదన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
డిక్సన్ టెక్- వీఎస్టీ టిల్లర్స్.. దూకుడు
ఆటుపోట్ల మధ్య కదులుతున్న మార్కెట్లలో సానుకూల వార్తల కారణంగా అటు డిక్సన్ టెక్నాలజీస్, ఇటు వీఎస్టీ టిల్లర్స్ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వెరసి ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరర్ డిక్సన్ టెక్నాలజీస్ షేరు సరికొత్త గరిష్టాన్ని తాకితే.. వ్యవసాయ రంగ పరికరాలు, ట్రాక్టర్ల కంపెనీ వీఎస్టీ టిల్లర్స్ తాజాగా 52 వారాల గరిష్టానికి గరిష్టానికి చేరింది. ఇకపై ఈ రెండు కంపెనీలూ మెరుగైన పనితీరు చూపగలవన్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. డిక్సన్ టెక్నాలజీస్ ఈ ఏడాది మార్చి 24న రూ. 2,900 వద్ద కనిష్టాన్ని చవిచూసిన డిక్సన్ టెక్నాలజీస్ ర్యాలీ బాటలో సాగుతోంది. తాజాగా ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 8,850 వద్ద ట్రేడవుతోంది. తొలుత 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 8,940ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఇటీవలి కనిష్టం నుంచి ఏకంగా 208 శాతం ర్యాలీ చేసింది. దేశీ ఎలక్ట్రానిక్ మార్కెట్లో పలు విభాగాల్లో కంపెనీ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులను అందిస్తోంది. ఎంఎన్‌సీలు తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను తయారు చేస్తోంది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, మొబైల్ ఫోన్లు, లెడ్ లైటింగ్ తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ గత ఐదు రోజుల్లో 18 శాతం బలపడిన వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ మరోసారి పుంజుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 2.5 శాతం పెరిగి రూ. 1860 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1924 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఆగస్ట్ నెలలో ట్రాక్టర్లు, టిల్లర్ల విక్రయాలు ఊపందుకోవడంతో ఇటీవల ఈ కౌంటర్ జోరు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత నెలలో ప్రధానంగా టిల్లర్ల అమ్మకాలు దాదాపు 84 శాతం జంప్‌చేసి 2,638 యూనిట్లకు చేరడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పై దృష్టి సారించినట్లు తెలియజేశారు. ట్రాక్టర్ల విక్రయాలు సైతం 813 యూనిట్ల నుంచి 897 యూనిట్లకు పెరగడం గమనార్హం! -
ఈ షేర్ల రికార్డుల ర్యాలీ చూడతరమా!
మార్కెట్లు జోరుమీదున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించింది. 321 పాయింట్లు జంప్‌చేసి 36,650కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 85 పాయింట్లు ఎగసి 10,791 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న పలు మిడ్ క్యాప్ కౌంటర్లు సరికొత్త గరిష్టాల రికార్డులను సృష్టిస్తున్నాయి. జాబితాలో తాజాగా స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఆల్కిల్ అమైన్స్, కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్, ట్రాక్టర్ల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్, ఐటీ సేవల కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్ చోటు సాధించాయి. కొద్ది రోజులుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ఈ కౌంటర్లన్నీ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాలను అందుకోవడం విశేషం! వివరాలు చూద్దాం.. ఆల్కిల్ అమైన్స్ కెమికల్స్ గత మూడు నెలల్లో 69 శాతం ర్యాలీ చేసిన ఆల్కిల్ అమైన్స్ కెమికల్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 2.6 శాతం ఎగసి రూ. 2360 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2375ను తాకింది. మార్చి త్రైమాసికంలో ఆల్కిల్ అమైన్స్ పన్నుకు ముందు లాభం(ఇబిట్) 93 శాతం జంప్‌చేసి రూ. 61 కోట్లను అధిగమించింది. ఇందుకు ముడివ్యయాలు తగ్గడం సహకరించింది. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ గత ఆరు రోజుల్లో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ షేరు 14 శాతం బలపడింది. తాజాగా ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 437ను అధిగమించింది. ప్రస్తుతం రూ. 435 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల విదేశీ రీసెర్చ్ సంస్థ క్రెడిట్ స్వీస్ ఈ కౌంటర్‌కు ఔట్పెర్ఫార్మ్ రేటింగ్‌ను ప్రకటించడంతోపాటు ఏడాది కాలానికి రూ. 490 టార్గెట్ ధరను ప్రకటించింది. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గత ఆరు రోజుల్లో దాదాపు 8 శాతం పుంజుకున్న ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ తాజాగా ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 2079 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2098కు ఎగసింది. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్) నుంచి కంపెనీ మరింత జోరందుకునే వీలున్నట్లు సాఫ్ట్వేర్ పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్కార్ట్స్ లిమిటెడ్ ట్రాక్టర్ల తయారీ ఎస్కార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత రూ. 1126 సమీపానికి చేరింది. ఇది 3.5 శాతం అధికంకాగా.. ప్రస్తుతం రూ. 1115 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ ఆటో రంగ కౌంటర్ 63 శాతం దూసుకెళ్లడం గమనార్హం! సాధారణ వర్షపాత అంచనాలు, గ్రామీణ ఆదాయాలు పుంజుకోవడం, పంటల విస్తీర్ణం పెరగడం వంటి అంశాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డిక్సన్ టెక్నాలజీస్ ముందు రోజు 4 శాతం ఎగసిన డిక్సన్ టెక్నాలజీస్ తాజాగా మరో 4 శాతం జంప్‌చేసింది. ఎన్ఎస్ఈలో తొలుత రూ. 6,336ను తాకింది. ప్రస్తుతం రూ. 6212 వద్ద కదులుతోంది. కోవిడ్-19లోనూ జూన్ నెలలో కన్జూమర్ డ్యురబుల్స్ రంగం 100 శాతం రికవరీ సాధించిన వార్తలు ఈ కౌంటర్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
డిక్సన్ టెక్నాలజీస్.. హిట్
ముంబై: డిక్సన్ టెక్నాలజీస్ షేరు లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. సోమవారం లిస్టయిన కంపెనీ షేరు ఇష్యూ ధర రూ. 1,766తో పోలిస్తే 64 శాతం భారీలాభంతో ముగిసింది. బీఎస్ఈలో ఇష్యూ ధరకంటే 54 శాతం అధికంగా రూ. 2,725 వద్ద లిస్టయిన డిక్సన్..చివరకు రూ. 2,893 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఇది రూ. 3,020స్థాయిని సైతం తాకింది. ఎన్ఎస్ఈలో కూడా ఇదేబాటలో రూ. 2,992 వద్ద డిక్సన్ ముగిసింది. భారత్ రోడ్ నెట్వర్క్.. ప్చ్ ముంబై: శ్రేయీ ఇన్ఫ్రా గ్రూప్ కంపెనీ భారత్ రోడ్ నెట్వర్క్ షేర్లు సోమవారం ఫ్లాట్‌గా లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 205తో పోలిస్తే ఈ బీఎస్ఈలో రూ. 204.90 వద్ద లిస్ట్‌కాగా, చివరకు 1.53 శాతం స్వల్పలాభంతో రూ. 208.15 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ. 219–196 శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. ఎన్ఎస్ఈలో 1.68 శాతం లాభంతో రూ. 208.45 వద్ద ముగిసింది. త్వరలో న్యూఇండియా అష్యూరెన్స్ ఐపీఓ ముంబై: న్యూఇండియా అష్యూరెన్స్ ప్రతిపాదించిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దేశంలో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ అయిన న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ జారీచేసే ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం 9.6 కోట్ల షేర్లు విక్రయించనుండగా, మరో 2.4 కోట్ల షేర్లను కంపెనీ తాజాగా జారీచేస్తున్నది. మొత్తం 12 కోట్ల షేర్ల విక్రయం ద్వారా దాదాపు రూ. 6,400 కోట్లకుపైగా సమీకరించనున్నట్లు సమాచారం. ఐపీవోతో దారిలో ఎన్ఐసీ: కాగా, ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీ నేషనల్ ఇన్సూరెన్స్ (ఎన్ఐసీ) త్వరలో ఐపీవో ద్వారా రూ.4,000 – 5,000 కోట్ల నిధుల్ని సమీకరించనుంది. -
ఈ వారంలో రెండు ఐపీవోలు
రూ.1,200 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: ఈ వారంలో డిక్సన్ టెక్నాలజీస్, భారత్ రోడ్ నెట్వర్క్ ఐపీవోలు నిధుల సమీకరణకు ప్రజల ముందుకు రానున్నాయి. ఈ రెండు ఐపీవోలు 6వ తేదీ మొదలై 8వ తేదీతో ముగుస్తాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ అయిన డిక్సన్ టెక్నాలజీస్ ఒక్కో షేరుకు రూ.1,760–1,766 ధరల శ్రేణి నిర్ణయించింది. ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో 30,53,675 షేర్లతోపాటు రూ.60 కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఐపీవో ద్వారా రూ.600 కోట్లను సమీకరించనుంది. ఈ నిధులను తిరుపతిలో ఎల్ఈడీ తయారీ యూనిట్ ఏర్పాటుకు, ఎల్ఈడీ లైటింగ్ ఉత్పత్తులు, ఐటీ సామర్థ్యాల బలోపేతానికి, రుణాల చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఐడీఎఫ్సీ బ్యాంకు, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, యెస్ సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. రహదారుల నిర్మాణ సంస్థ అయిన భారత్ రోడ్ నెట్వర్క్ ఒక్కో షేరుకు రూ.195–205ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ఐపీవోలో మొత్తం 2.93 కోట్ల షేర్లను కంపెనీ విక్రయించనుంది. శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌కు ఇది అనుబంధ కంపెనీ. ఐపీవో ద్వారా రూ.600 కోట్ల వరకు నిధుల సమీకరణ చేయనుంది. ఇంగా క్యాపిటల్, ఇన్వెస్టెక్ క్యాపిటల్ సర్వీసెస్, శ్రేయి క్యాపిటల్ మార్కెట్స్ ఐపీవోకు మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అవుతాయి. -
శ్రీసిటీలో జియోనీ ఫోన్ల తయారీ
- ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపిన కంపెనీ - తయారీకి మూడేళ్లలో రూ.330 కోట్ల వ్యయం - జియోనీ ఇండియా ఎండీ అరవింద్ వోరా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న జియోనీ ‘మేక్ ఇన్ ఇండియా’ బాటపట్టింది. మొబైల్స్ తయారీ సంస్థలైన ఫాక్స్‌కాన్, డిక్సన్ టెక్నాలజీస్‌తో చేతులు కలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటుతోపాటు డిక్సన్‌కు చెందిన నోయిడా ప్లాంటులో ఫోన్లు తయారు కానున్నాయి. అక్టోబరులో మేక్ ఇన్ ఇండియా తొలి ఉత్పాదన మార్కెట్లోకి రానుంది. ఫాక్స్‌కాన్ శ్రీసిటీ ప్లాంటులో మూడు అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 5 లక్షల యూనిట్లు. డిక్సన్ నోయిడా ప్లాంటులో 9 అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 7 లక్షల యూనిట్లు. రెండు ప్లాంట్ల వద్ద జియోనీ ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. వచ్చే మూడేళ్లలో తయారీకి రూ.330 కోట్లు ఖర్చు చేస్తామని జియోనీ ఇండియా ఎండీ అరవింద్ రజనీష్ వోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్ నుంచి విదేశాలకు: చైనాలోని సొంత ప్లాంటులో తయారైన ఫోన్లను జియోనీ దిగుమతి చేస్తోంది. ఇక నుంచి జియోనీ ఎఫ్ సిరీస్, పీ సిరీస్ స్మార్ట్ఫోన్లను ఫాక్స్‌కాన్ శ్రీసిటీ ప్లాంటులో తయారు చేస్తుంది. ఇతర స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లను డిక్సన్ ఉత్పత్తి చేయనుంది. దేశీయంగా తయారీ చేపట్టడం ద్వారా త్వరితగతిన కొత్త మోడళ్లను ఆవిష్కరించేందుకు కంపెనీకి వీలవుతుంది. అలాగే దిగుమతి సుంకాలు ఆదా అవుతాయి. ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. చైనా వెలుపల తయారీ కేంద్రంగా భారత్‌ను నిలుపుతామని జియోనీ ప్రెసిడెంట్ విలియం లూ పేర్కొన్నారు. నెలకు ఒక మోడల్: భారత్ మార్కెట్లో నెలకు ఒక మోడల్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్టు అరవింద్ తెలిపారు.రూ.8,000 ఆపైన ధరలో వచ్చేవన్నీ 4జీ మోడళ్లని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఫోన్లను విక్రయిస్తామని వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌తోపాటు ఇతర ఇ-కామర్స్ కంపెనీలతో కంపెనీ చర్చలు జరుపుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్ల ఆదాయాన్ని జియోనీ ఇండియా ఆర్జించింది. ఈ ఏడాది రూ.6,000 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది.