50.1% వాటా కొనుగోలుకి డీల్
ఐటెల్, ఇన్‌ఫినిక్స్, టెక్నో బ్రాండ్లు సొంతం
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్స్ కాంట్రాక్ట్ తయారీ దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్ ఎల్రక్టానిక్స్, మొబైల్స్ తయారీ కంపెనీ ఇస్మార్టు ఇండియాను సొంతం చేసుకోనుంది. తొలి దశలో భాగంగా నగదు రూపేణా 50.1 శాతం వాటా కొనుగోలుకి షేరు కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీఏ) కుదుర్చుకున్నట్లు డిక్సన్ టెక్ వెల్లడించింది. ఇందుకు ఇస్మార్టు సింగపూర్, ట్రాన్సిషన్ టెక్నాలజీ, 5ఏ అడ్వయి జర్స్ ఎల్‌ఎల్‌పీతో ఎస్‌పీఏపై సంతకాలు చేసినట్లు పేర్కొంది.
90 రోజుల్లోగా సొంతం చేసుకోనున్న ఈ వాటా కోసం రూ. 238 కోట్లకుపైగా వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. తదుపరి రెండో దశలో భాగంగా 2026–27కల్లా 1.6–5.9 శాతం మధ్య అదనపు వాటాను కొనుగోలు చేసేందుకు హక్కులను పొందనున్నట్లు వెల్లడించింది. వెరసి ఇస్మార్టు ఇండియాలో ఇస్మార్టు సింగపూర్ 42.75–47.05 శాతం మధ్య వాటాను మిగిల్చుకోనుంది. కాగా.. ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి పొందవలసి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment