Smart India
-
డిక్సన్ చేతికి ఇస్మార్టు ఇండియా
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్స్ కాంట్రాక్ట్ తయారీ దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్ ఎల్రక్టానిక్స్, మొబైల్స్ తయారీ కంపెనీ ఇస్మార్టు ఇండియాను సొంతం చేసుకోనుంది. తొలి దశలో భాగంగా నగదు రూపేణా 50.1 శాతం వాటా కొనుగోలుకి షేరు కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు డిక్సన్ టెక్ వెల్లడించింది. ఇందుకు ఇస్మార్టు సింగపూర్, ట్రాన్సిషన్ టెక్నాలజీ, 5ఏ అడ్వయి జర్స్ ఎల్ఎల్పీతో ఎస్‌పీఏపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. 90 రోజుల్లోగా సొంతం చేసుకోనున్న ఈ వాటా కోసం రూ. 238 కోట్లకుపైగా వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. తదుపరి రెండో దశలో భాగంగా 2026–27కల్లా 1.6–5.9 శాతం మధ్య అదనపు వాటాను కొనుగోలు చేసేందుకు హక్కులను పొందనున్నట్లు వెల్లడించింది. వెరసి ఇస్మార్టు ఇండియాలో ఇస్మార్టు సింగపూర్ 42.75–47.05 శాతం మధ్య వాటాను మిగిల్చుకోనుంది. కాగా.. ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి పొందవలసి ఉంది. -
మీ శక్తిని ఎప్పటికీ విశ్వసిస్తాను: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : గత శతాబ్దాలలో భారతదేశం ఒక్కటే ఎక్కువ మంది ఉత్తమ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, సాంకేతిక వ్యవస్థాపకులను ప్రపంచానికి పరిచయం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయులు సేవలందిస్తున్నందుకు దేశ ప్రజానీకమంతా గర్వపడాలని వ్యాఖ్యానించారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో దేశం తన ప్రభావవంతమైన పాత్రను పోషించడానికి 21వ శతాబ్దం మరింత వేగంగా మారాలని అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనతో దేశంలో ఆవిష్కరణ, పరిశోధన, రూపకల్పన, అభివృద్ధి, వ్యవస్థాపకత కోసం అవసరమైన పర్యావరణ వ్యవస్థ వేగంగా తయారవుతోందని వ్యాఖ్యానించారు. (ఎన్ఈపీ 2020: చైనీస్ భాషపై సందిగ్దత!) 130 కోట్ల భారతీయుల ఆకాంక్షల ప్రతిబింభం స్మార్ట్ ఇండియా హ్యాకథన్ 2020 యొక్క గ్రాండ్ ఫినాలేలో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఆన్లైన్ విద్య కోసం కొత్త వనరులను సృష్టించడం లేదా స్మార్ట్ ఇండియా హాకథాన్ వంటి ప్రచారాలు, భారతదేశ విద్య మరింత ఆధునికంగా, ఆధునికంగా మారాలని ప్రయత్నం, ఇక్కడ ప్రతిభకు పూర్తి అవకాశం లభిస్తుంది. దేశానికి కొత్త విద్యా విధానం కొద్ది రోజుల క్రితం ప్రకటించబడింది. 21వ శతాబ్దపు యువత ఆలోచన, అవసరాలు మరియు ఆశలు మరియు ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానం రూపొందించబడింది. ఇది కేవలం విధాన పత్రం మాత్రమే కాదు, 130 కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షల ప్రతిబింభం. తల్లిదండ్రులు బంధువులు మరియు స్నేహితుల నుండి ఒత్తిడి వచ్చినప్పుడు, వారు ఇతరులు ఎంచుకున్న విషయాలను చదవడం ప్రారంభిస్తారు. దేశానికి చాలా పెద్ద జనాభా ఉంది. ఇందులో బాగా చదువుకున్నవారు ఉన్నారు, కాని వారు చదివిన వాటిలో చాలా వరకు అది వారికి నిజజీవితంలో పనిచేయదు. డిగ్రీల డిగ్రీ తర్వాత చేసికూడా తనలో సామర్ధ్యం కొరవడడం కారణంగా అసంపూర్ణత గల విద్యార్ధి అవుతాడు. కొత్త విద్యా విధానం ద్వారా ఈ విధానాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మునుపటి లోపాలను తొలగిస్తున్నారు. భారతదేశ విద్యా వ్యవస్థలో ఒక క్రమబద్ధమైన సంస్కరణ, విద్య యొక్క ఉద్దేశ్యం మరియు కంటెంట్ రెండింటినీ మార్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పులు, భారతదేశ భాషలు మరింత పురోగమిస్తాయి, మరింత అభివృద్ధి చెందుతాయి. ఇది భారతదేశ జ్ఞానాన్ని పెంచడమే కాక, భారతదేశ ఐక్యతను కూడా పెంచుతుంది. భారతదేశంలోని గొప్ప భాషలకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. విద్యార్థులు తమ ప్రారంభ సంవత్సరాల్లో వారి స్వంత భాషలో నేర్చుకోవడం చాలా పెద్ద ప్రయోజనం. జీడీపీ ఆధారంగా ప్రపంచంలోని టాప్ 20 దేశాల జాబితాను పరిశీలిస్తే, చాలా దేశాలు తమ మాతృభాషలో విద్యను అందిస్తాయి. ఈ దేశాలు తమ దేశంలోని యువత ఆలోచన మరియు అవగాహనను అభివృద్ధి చేస్తాయి. ప్రపంచంతో కమ్యూనికేట్ చేయడానికి ఇతర భాషలకు కూడా ప్రాధాన్యత ఇస్తాయి. యువత శక్తిని నేను ఎప్పుడూ విశ్వస్తాను స్థానిక జానపద కళలు మరియు విభాగాలకు, శాస్త్రీయ కళ మరియు జ్ఞానానికి సహజమైన స్థలాన్ని ఇవ్వడం గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు టాప్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భారతదేశంలో క్యాంపస్ తెరవడానికి ఆహ్వానించబడ్డాయి. దేశ యువత శక్తిని నేను ఎప్పుడూ విశ్వస్తాను. ఈ నమ్మకాన్ని ఈ దేశంలోని యువత మళ్లీ మళ్లీ నిరూపించబడింది. ఇటీవల కరోనాను రక్షించడానికి ఫేస్ షీల్డ్స్ కోసం డిమాండ్ పెరిగింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో దేశ యువత ఈ డిమాండ్‌ను తీర్చడానికి ముందుకు వచ్చింది. దేశంలోని పేదలకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి ఈజీ ఆఫ్ లివింగ్ అనే మా లక్ష్యాన్ని సాధించడంలో మీ అందరి పాత్ర చాలా ముఖ్యమైనది. స్మార్ట్ ఇండియా హాకథాన్ ద్వారా గత సంవత్సరాల్లో దేశానికి అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చాయి. ఈ హాకథాన్ తరువాత కూడా దేశ అవసరాలను అర్థం చేసుకుని, దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి కొత్త పరిష్కారాలపై కృషి చేస్తూనే ఉంటారని యువతపై నమ్మకం ఉంది.’ అని మోదీ పేర్కొన్నారు. -
ప్రారంభమైన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఫైనల్ పోటీలు
సాక్షి, వరంగ్ అర్బన్: జిల్లాలోని కాజీపేలోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నీట్)లో ప్రారంభమైన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫైనల్ పోటీలు. ఈ పోటీలను శనివారం ఉదయం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీలు 48 కేంద్రాల్లో 36 గంటల పాటు జరుగనున్నాయి. ఈ పోటీల్లో సుమారు పదివేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ సంస్థలు, పరిశ్రమల నుంచి వచ్చే సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఆవిష్కరణలు చేయనున్న విద్యార్థులు. స్మార్ట్ కమ్యూనికేషన్, వ్యవసాయం, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వివిధ అంశాలపై సాగనున్న పోటీలు. -
ఏసీలు, ఫ్రిజ్‌లూ మేకిన్ ఇండియా!
ముంబై: మోదీ సర్కారు మేకిన్ ఇండియా నినాదం స్మార్ట్ఫోన్లు... టీవీల తయారీ రంగంలో బాగానే పనిచేస్తోంది. ఈ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసేందుకు విదేశీ కంపెనీలన్నీ పెట్టుబడులకు ముం దుకొచ్చాయి. మరి ఇప్పుడు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు వంటి వైట్ గూడ్స్ ఉత్పత్తి కంపెనీలు కూడా మేకిన్ ఇండియాను తలకెత్తుకోవడానికి సిద్ధమయ్యాయి. ఒకపక్క, ఆయా ఉత్పత్తులు, సంబంధిత విడిభాగాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీగా దిగుమతి సుంకాలను వడ్డించడంతో పాటు ఇటీవల కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణించ డం కూడా విదేశీ వైట్ గూడ్స్ కంపెనీల మేకిన్ ఇండి యా రాగానికి బాటలు వేసింది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీలు ఏకంగా రూ.6,500 కోట్ల పెట్టుబడులను దేశీయంగా కుమ్మరించనుండటం దీనికి నిదర్శనం. సుంకాల మోత... మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లో తయారీని ప్రోత్సహించి... తద్వారా ఇక్కడ మరింతగా ఉద్యోగాలను సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పం. అయితే, ఇప్పటివరకూ ఈ జాబితాలో స్మార్ట్ఫోన్లు, టీవీలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం టీవీలు, స్మార్ట్‌ఫోన్ దిగుమతులపై దిగుమతి సుంకాలను 20 శాతానికి పెంచింది. వీటికి సంబంధించిన విడిభాగాలపై కూడా ఈ ఏడాది సుంకాన్ని పెంచడంతో తప్పనిసరిగా ఆయా కంపెనీలు మేకిన్ ఇండియాకు ఓకే చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే పరిస్థితి వైట్ గూడ్స్ రంగంలోనూ పునరావృతం అవుతోంది. రూపాయి ఘోరంగా పతనం కావడంతో కొన్ని అత్యవసరం కాని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచడం తెలిసిందే. ఇందులో వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లపై సుంకాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెట్టింపు చేసి 20 శాతానికి చేర్చారు. అదేవిధంగా ఏసీలు, ఫ్రిజ్‌ల కంప్రెషర్లపైనా దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. దీంతో దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలు 10% ఎగబాకాయి. దేశీయంగా వైట్‌గూడ్స్ పరిశ్రమ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30,000 కోట్లుగా అంచనా. ఇది ఏటా 7–8% వృద్ధి చెందుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ దిగ్గజాల క్యూ.. వైట్ గూడ్స్‌కు సంబంధించి జర్మనీకి చెందిన బాష్, సీమెన్స్, టర్కీ కంపెనీ ఆర్సెలిక్, చైనా సంస్థ మైడియా, హేయర్, టీసీఎల్, జపాన్ కంపెనీ పానాసోనిక్ వంటివి భారత్‌లో కొత్తగా తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు, ఉన్నవాటిని విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. వీటికి తోడు దేశీయ సంస్థలైన గోద్రెజ్, బీపీఎల్ కూడా పెట్టుబడి ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. షాంగై హిటాచీ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ కంపెనీ... గుజరాత్లో కంప్రెషర్ యూనిట్‌ను విస్తరిస్తోంది. జపాన్ సంస్థ హిటాచీ, చైనా కంపెనీ షాంగై హైలీ గ్రూప్‌ల జాయింట్ వెంచర్ కంపెనీ ఇది. చైనాకు చెందిన గ్వాంగ్డాంగ్ మీజి కంప్రెషర్ కంపెనీ కూడా కొత్త ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. కూలింగ్ యూనిట్లలో ఉపయోగించే పరికరాలను ఇది తయారు చేయనుంది. కాగా, కంపెనీలు ప్రారంభ, మధ్య స్థాయి వైట్ గూడ్స్ ఉత్పత్తులను మాత్రమే దేశీయంగా తయారు చేస్తున్నాయి. ప్రీమియం మోడళ్లతోపాటు సంక్లిష్లమైన విడిభాగాల(హీట్ ఎక్సే్ఛంజ్ కాయిల్స్, కంప్రెషర్స్ వంటివి) విషయంలో మాత్రం దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఎయిర్ కండిషర్లలో అయితే, ఏకంగా 50% విడిభాగాలు దిగుమతి చేసుకున్నవే ఉంటున్నాయి. కాగా, రానున్న కాలంలో మరింతగా దిగుమతి సుంకాలు పెరగవచ్చని.. దీంతో ఇక్కడే ప్లాంట్లను ఏర్పాటు చేయడం ఉత్తమం అని కంపెనీలు భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నారు. ‘అంతేకాకుండా భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదాని కంటే స్థానికంగా తయారు చేస్తేనే ఉత్పాదక వ్యయం తగ్గుతుందని చాలా కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ తక్కువ వేతనాలకే కార్మికులు లభిస్తారు. దిగుమతులకు భారీగా రవాణా చార్జీలు చెల్లించక్కర్లేదు కూడా. డాలరుతో రూపాయి విలువ పతనం కూడా దిగుమతులకు భారంగా పరిణమిస్తోంది’ అని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది వ్యాఖ్యానించారు. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీదారుల సంఘం (సీమా) ప్రెసిడెంట్ కూడా ఆయన. జోరుగా పెట్టుబడులు... ‘తాజాగా కేంద్రం సుంకాలను పెంచడంతో మేం స్థానికంగా తయారీపై పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే కష్టమే’ అని బీఎస్‌హెచ్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్ ఎండీ గుంజన్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ సంస్థ భారత్‌లో బాష్, సీమెన్స్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. చెన్నైకి సమీపంలోని ఫ్యాక్టరీలో బీఎస్‌హెచ్ ఇటీవలే వాషింగ్ మెషీన్ల తయారీని ప్రారంభించింది. ఇక్కడే రూ.800 కోట్ల పెట్టుబడితో ఫ్రిజ్‌ల ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. ∙చైనాకు చెందిన మైడియా గ్రూప్ ఇటీవలే రూ.1,350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో సగం కంప్రెషర్ల తయారీ కోసం వెచ్చించనుంది. చైనా వెలుపల తమకు ఇదే అతిపెద్ద పెట్టుబడి అని కంపెనీ ఇండియా ఎండీ క్రిషన్ సచ్దేవ్ తెలిపారు. ∙చైనాలో అతిపెద్ద అప్లయెన్సెస్ తయారీ సంస్థ హేయర్ కూడా నోయిడాలో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు రూ.3,000 కోట్ల పెట్టుబడులను ఖరారు చేసింది. పుణేలో ఈ సంస్థ యూనిట్‌తో పోలిస్తే ఈ పెట్టుబడి మూడింతలు ఎక్కువ కావడం విశేషం. నోయిడా ప్లాంట్‌లో విడిభాగాలతో పాటు ప్రీమియం మోడళ్లను ఉత్ప త్తి చేస్తామని హేయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా పేర్కొన్నారు. ∙తాము స్థానికంగా ఏసీ కంప్రెషర్లు ఇతరత్రా విడిభాగాల తయారీ కోసం సప్లయర్లతో చర్చలు జరుపుతున్నట్లు జపాన్ దిగ్గజం పానాసోనిక్ ఇండియా సీఈఓ మనీష్ శర్మ వెల్లడించారు. ∙ఇక మరో చైనా ఎలక్ట్రానిక్స్ అగ్రగామి టీసీఎల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద నెలకొల్పుతున్న రూ.2,000 కోట్ల ప్లాంట్‌లో వైట్ గూడ్స్, విడిభాగాల తయారీని వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇక్కడ టీవీలను కూడా తయారు చేస్తామని కంపెనీ ఇండియా హెడ్ మైక్ చెన్ చెప్పారు. ∙టర్కీ కంపెనీ ఆర్సెలిక్ టాటా కంపెనీ వోల్టాస్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. గుజరాత్లో తయారీ ప్లాంట్ కోసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. -
ఇది యువ ఆవిష్కర్తల యుగం
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం - యువతలో అసాధారణ శక్తి, సామర్థ్యాలున్నాయి - సమస్యల పరిష్కారంలో సాంకేతిక వినియోగం పెరగాలి - అపజయాలకు తలొగ్గకుండా యువత ముందుకు సాగాలి - యువతలోని ఉత్సాహం, కఠోర శ్రమ నవభారతానికి బలం వినూత్న అంశాల్ని అర్థం చేసుకునేటప్పుడు నాణ్యత ముఖ్యమని తెలుసుకోవాలి. మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తులు ఎంతో మంది జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయి. దేశ సమస్యలకు పరిష్కారం చూపాలని భారతీయ యువత ఆశిస్తోంది. – ప్రధాని మోదీ న్యూఢిల్లీ: సమాజం ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల పరిష్కారానికి సాంకేతికతను విరివిగా వినియోగించాలని, అందుకోసం యువ ఆవిష్కర్తలు అత్యుత్తమ పరిష్కారాలతో ముందుకు రావాలని ప్రధాని మోదీ కోరారు. భారతీయ యువతలో అసాధారణ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, అవి దేశానికి అత్యుత్తమ ఫలితాల్ని అందిస్తాయని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’లో భాగంగా శనివారం రాత్రి 10 వేల మంది విద్యార్థుల్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. కలిసికట్టుగా సమస్యల్ని ఎదుర్కోవాలి.. ‘ప్రస్తుతం సాంకేతిక యుగంలో నివసిస్తున్నాం. సాంకేతికతను మరింత ఎక్కువగా, వినూత్నంగా ఉపయోగించుకోవాలి. దేశాన్ని ప్రభావితం చేస్తున్న సమస్యల్ని కలిసికట్టుగా పరిష్కరించవచ్చు. ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్య సారాంశం. యువత పరిష్కరించాల్సిన అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి. అవి సవాలుతో కూడినవైనా.. దాన్ని ఒక అవకాశంగా భావించాలి. సమస్య పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో నా యువ స్నేహితులు చేస్తున్న ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇస్తాయని నేను నమ్మకంతో ఉన్నాను. నాణ్యత ముఖ్యం యువత కొత్త ఆవిష్కరణలు చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎదురైనా ధైర్యం, స్ఫూర్తి తగ్గకుండా చూసుకోవాలని ప్రధాని సూచించారు. ‘వినూత్న అంశాల్ని అర్థం చేసుకునేటప్పుడు నాణ్యత ముఖ్యమని తెలుసుకోవాలి. మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తులు ఎంతో మంది జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయి. దేశ సమస్యలకు పరిష్కారం చూపాలని భారతీయ యువత ఆశిస్తోంది. నేటి యువత తరచూ అనేక ప్రశ్నలు అడుగుతుందని ప్రజలు చెపుతుంటారు. యువతలో జిజ్ఞాస ప్రశంసించదగ్గ విషయం’ అని అన్నారు. నవభారతం కోసం శ్రమించాలి యువతలోని కఠోర శ్రమ, ఉత్సాహం, నవభారతానికి బలాన్నిస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రోద్యమ సమరం కోసం ఏదోఒకటి చేయాలని అప్పటి ప్రజలు తరచూ ఆలోచించేవారని, ప్రజలు నవభారతం కోసం కలలు కనాలని, ఆ దిశగా శ్రమించాలని ఆకాంక్షించారు. యువత తమ శక్తిని పరిపాలన రంగంపై కేంద్రీకరిస్తే, అనేక సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. ఆలోచనల్ని ప్రధానితో పంచుకున్న విద్యార్థులు వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు విద్యార్థులు తమ ఆలోచనలు, పరిష్కారాల్ని మోదీతో పంచుకున్నారు. ఆటోమొబైల్స్ బరువుతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని రాయ్‌పూర్‌కు చెందిన విద్యార్థి ప్రస్తావించగా.. జాతీయ రహదారులపై అంబులెన్స్ సేవల కోసం ఓలా, ఉబర్ తరహాలో యాప్ రూపొందించవచ్చని మరో విద్యారి అన్నా డు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చు/ఉచిత శానిటరీ చేతి గుడ్డలను ఇవ్వాలని ఓ విద్యార్థిని సూచించింది. ఇం జనీరింగ్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేసేలా విధానాన్ని రూపొందిస్తే బాగుంటుందని మరొకరన్నారు. హ్యాకథాన్ ప్రారంభం యువతలోని ప్రతిభను వెలికితీసి, వారు రూపొందించిన ఆవిష్కరణల్ని సామాజిక సమస్యల పరిష్కారానికి వినియోగించే లక్ష్యంతో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నోయిడాలో శనివారం ప్రారంభమైంది. హ్యకథాన్ ఫైనల్లో 10 వేల మంది పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా 26 ప్రదేశాల్లో ఫైనల్‌ను నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన హ్యాకథాన్ ఆదివారం రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. నాస్కాం, ఇతరసంస్థలసాయంతో మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోని ఏఐసీటీఈ దీన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కోసం 29 మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు మొత్తం 598 సమస్యల్ని గుర్తించారు. ఫైనల్ కోసం 28 రాష్ట్రాల నుంచి మొత్తం 1266 బృందాలకు చెందిన 10 వేల మందిని ఎంపిక చేశారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2017 ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. సాంకేతికతకు ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతుందనేందుకు హ్యాకథాన్‌లో పాల్గొంటున్న వారి సంఖ్యే నిదర్శనమన్నారు. విద్యార్థుల విజ్ఞానాన్ని నిజ జీవితానికి ఎలా అన్వయించాలో తెలియచేసేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.