
సాక్షి, వరంగ్ అర్బన్: జిల్లాలోని కాజీపేలోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నీట్)లో ప్రారంభమైన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫైనల్ పోటీలు. ఈ పోటీలను శనివారం ఉదయం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీలు 48 కేంద్రాల్లో 36 గంటల పాటు జరుగనున్నాయి. ఈ పోటీల్లో సుమారు పదివేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ సంస్థలు, పరిశ్రమల నుంచి వచ్చే సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఆవిష్కరణలు చేయనున్న విద్యార్థులు. స్మార్ట్ కమ్యూనికేషన్, వ్యవసాయం, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వివిధ అంశాలపై సాగనున్న పోటీలు.
Comments
Please login to add a commentAdd a comment