వేరబుల్స్‌ రంగానికీ పీఎల్ఐ స్కీమ్.. కేంద్రానికి ఎంఏఐటీ విజ్ఞప్తి | Mait Urged Pli Scheme For Wearables And Components | Sakshi
Sakshi News home page

వేరబుల్స్‌ రంగానికీ పీఎల్ఐ స్కీమ్.. కేంద్రానికి ఎంఏఐటీ విజ్ఞప్తి

Published Wed, May 22 2024 9:43 AM | Last Updated on Wed, May 22 2024 9:43 AM

Mait Urged Pli Scheme For Wearables And Components

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, వేరబుల్స్ తయారీకి సంబంధించి మరో రెండు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ( పీఎల్‌ఐ ) పథకాలను రూపొందించాలని ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ అసోసియేషన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఏఐటి) ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు ఎన్నికల తర్వాత ట్యాక్స్‌ల్లో మార్పులు, చైనా పౌరుల వీసా సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఎంఏఐటీ విజ్ఞప్తిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

ఎంఏఐటీ విభాగం కేంద్ర ప్రభుత్వం తరుపున దేశంలో ప్రైవేట్‌ ఐటీ హార్డ్‌ వేర్‌ రంగాన్ని ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరిస్తుంది. ఆయా కంపెనీల కార్యకలాపాలను  ప్రోత్సహిస్తుంది. వాటి వృద్ది కోసం పాటు పడుతుంది.

ఆ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్న డిక్సాన్‌ టెక్నాలజీస్‌, డెల్‌, హెచ్‌పీ,గూగుల్‌ కార్యకలాపాలు, నిబంధనలకు మేరకు పనిచేస్తున్నాయా? వంటి అంశాలపై రివ్యూ  నిర్వహించనుంది.

ఈ తరుణంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ,వేరబుల్స్ విభాగంలో సైతం పీఎల్‌ఐ స్కీంను రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. తద్వారా దేశంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వేరబుల్స్‌ తయారీ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఎగుమతులు, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ​​కొత్త పెట్టుబడులకు అవకాశాలను ఆకర్షించడం, దేశీయంగా ఆ రంగాల్సి ప్రోత్సహించడంతో పాటు అపారమైన అవకాశాల్ని సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement