Components
-
ఎల్రక్టానిక్ విడిభాగాలకు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు (డ్యాష్‌బోర్డ్, ఇంజిన్లు వంటివి) 2030 నాటికల్లా డిమాండ్ అయిదు రెట్లు పెరగవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక నివేదికలో తెలిపింది. అప్పటికల్లా ఇది 240 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. మదర్‌బోర్డులు, లిథియం అయాన్ బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపింది. ఈ పరిస్థితిని తొలగించేందుకు 35–40 శాతం శ్రేణిలో అధిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఎల్రక్టానిక్ విడిభాగాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని సవరిస్తే దేశీయంగా తయారీకి ఊతం లభించగలదని వివరించింది. ‘2023లో 102 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎల్రక్టానిక్స్ కోసం 45.5 బిలియన్ డాలర్ల విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు డిమాండ్ నెలకొంది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి కోసం 240 బిలియన్ డాలర్ల కాంపోనెంట్స్, సబ్ అసెంబ్లీలు అవసరమవుతాయి‘ అని తెలిపింది. నివేదికలోని మరిన్ని ప్రత్యేకాంశాలు.. → 2022లో మొత్తం విడిభాగాలకు నెలకొన్న డిమాండ్‌లో బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, పీసీబీలు మొదలైన అత్యంత ప్రాధాన్యమైన ఉత్పత్తుల వాటా 43 శాతంగా నమోదైంది. ఇది 2030 నాటికి గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఇవన్నీ దేశీయంగా నామమాత్రంగానే తయారవుతున్నాయి లేదా ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. → చైనా, వియత్నాం, మెక్సికో వంటి పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌లో తయారీ సంబంధ వ్యయాలు 10–20 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశీయంగా భారీ తయారీ కార్పొరేషన్లు లేవు. భారతీయ కంపెనీల కోసం డిజైన్ వ్యవస్థ, ముడి సరుకుల లభ్యత కోసం సరైన వ్యవస్థలాంటిది లేదు. ఇవన్నీ కూడా విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయి. → విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి ఊతమిచ్చేలా ప్రభుత్వం 6–8 ఏళ్ల పాటు ఆర్థిక తోడ్పాటును అందించే తగు స్కీమును రూపొందించాలి. → యూరోపియన్ యూనియన్, యూకే, జీసీసీ దేశాలు, ఆఫ్రికాలోని వర్ధమాన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడంపై మరింతగా కసరత్తు చేయాలి. → భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో మార్కెట్ సృష్టించడం ద్వారా ఎగుమతులు పెరగడంతో పాటు దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వం పాలసీపరమైన మద్దతునిస్తే 2026 నాటికి 2.8 లక్షల మేర ఉద్యోగాల కల్పన జరిగేందుకు సహాయకరంగా ఉంటుంది. దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుతుంది. -
వేరబుల్స్ రంగానికీ పీఎల్ఐ స్కీమ్.. కేంద్రానికి ఎంఏఐటీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, వేరబుల్స్ తయారీకి సంబంధించి మరో రెండు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ( పీఎల్ఐ ) పథకాలను రూపొందించాలని ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ అసోసియేషన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఏఐటి) ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు ఎన్నికల తర్వాత ట్యాక్స్‌ల్లో మార్పులు, చైనా పౌరుల వీసా సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఎంఏఐటీ విజ్ఞప్తిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.ఎంఏఐటీ విభాగం కేంద్ర ప్రభుత్వం తరుపున దేశంలో ప్రైవేట్ ఐటీ హార్డ్ వేర్ రంగాన్ని ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరిస్తుంది. ఆయా కంపెనీల కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. వాటి వృద్ది కోసం పాటు పడుతుంది.ఆ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్న డిక్సాన్ టెక్నాలజీస్, డెల్, హెచ్‌పీ,గూగుల్ కార్యకలాపాలు, నిబంధనలకు మేరకు పనిచేస్తున్నాయా? వంటి అంశాలపై రివ్యూ నిర్వహించనుంది.ఈ తరుణంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ,వేరబుల్స్ విభాగంలో సైతం పీఎల్ఐ స్కీంను రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. తద్వారా దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, వేరబుల్స్ తయారీ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఎగుమతులు, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు అవకాశాలను ఆకర్షించడం, దేశీయంగా ఆ రంగాల్సి ప్రోత్సహించడంతో పాటు అపారమైన అవకాశాల్ని సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది. -
కేంద్రం కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త!
పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వసూలు చేస్తున్న ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తూ అధికారికంగా ఉత్వరులు జారీ చేసింది. భారత్‌లో ఆయా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు స్థానికంగా ఫోన్లను తయారు చేయాలంటే.. అందుకు అవసరమయ్యే విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అలా దిగుమతి చేసుకున్నందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి 15 శాతం ఇంపోర్ట్ డ్యూటీని చెల్లించాలి. అయితే, తాజాగా ఈ ఇంపోర్ట్ డ్యూటీని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఇంకా, ఎల్సీడీ ప్యానెల్ల డిస్ప్లే, అసెంబ్లీ భాగాలపై దిగుమతి సుంకాలు 10శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఎగుమతులు పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా స్మార్ట్‌ఫోన్ తయారీ మార్కెట్లో కీలక పాత్రపోషిస్తున్న చైనా, వియాత్నాం వంటి దేశాలతో భారత్ పోటీపడేందుకు అవకాశంగా మారుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక దిగుమతి సుంకం తగ్గింపుతో భారత్‌లో స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొబైల్ విడి భాగాలపై మొబైల్ తయారీ పరిశ్రమలో భారత్‌ను అగ్రగామిగా నిలిచేందుకు కేంద్రం మొబైల్ ఫోన్ విడి భాగాలపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించింది. సిమ్ సాకెట్, బ్యాటరీ కవర్, మెయిన్ కవర్, స్క్రూలు, జీఎస్ఎం, యాంటెన్నా వంటి మెకానికల్, ప్లాస్టిక్ ఇన్పుట్ భాగాలతో పాటు ఇతర మొబైల్ ఫోన్ విడి భాగాలపై దిగుమతి సుంకం తగ్గనుంది. -
2024లో ఆటో విడిభాగాల జోరు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆటో విడిభాగాల పరిశ్రమ 10–15 శాతం స్థాయిలో వృద్ధి చెందే వీలున్నట్లు తాజాగా అంచనాలు వెలువడ్డాయి. ఇందుకు దేశ, విదేశీ మార్కెట్ల నుంచి ఊపందుకోనున్న డిమాండు దోహదపడనున్నట్లు ఆటోమోటివ్ విడిభాగాల తయారీ అసోసియేషన్(ఏసీఎంఏ) పేర్కొంది. యూఎస్, యూరప్ తదితర ప్రధాన మార్కెట్లలో ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న ఆందోళనలున్నప్పటికీ దేశీ ఆటో విడిభాగాలకు గిరాకీ కొనసాగనున్నట్లు అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆటో విడిభాగాల పరిశ్రమ 23 శాతం ఎగసింది. 56.5 బిలియన్ డాలర్ల టర్నోవర్‌ను సాధించింది. ఈ బాటలో మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ 15 శాతం పుంజుకోగలదని ఏసీఎంఏ అంచనా వేసింది. ఐసీఈ ఎఫెక్ట్ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్స్(ఐసీఈ) తయారీలో వినియోగించే ఆటో విడిభాగాల కోసం ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి. యూఎస్, యూరప్ తదితర పశ్చిమ దేశాల మార్కెట్లు ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లుతుండటం ప్రభావం చూపుతోంది. దీంతో దేశీ విడిభాగాల పరిశ్రమ లబ్ది పొందనుంది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(2022 మార్చి– డిసెంబర్) ఎగుమతులు, దిగుమతులు బ్యాలన్స్డ్గా 15.1 బిలియన్ డాలర్ల చొప్పున నమోదైనట్లు పారిశ్రామిక సమాఖ్య ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఏసీఎంఏ డైరెక్టర్ విన్నీ మెహతా వెల్లడించారు. పశ్చిమ దేశాలలో ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీ ఆటో విడిభాగాల ఎగుమతులు అంచనాలకు అనుగుణంగా పుంజుకోనున్నట్లు అంచనా వేశారు. ఎగుమతుల్లో ఎలాంటి మందగమన పరిస్థితులనూ గమనించలేదని తెలియజేశారు. దేశీ ఆటో మార్కెట్ అత్యంత పటిష్టంగా ఉన్న కారణంగా దిగుమతుల్లో సైతం వృద్ధి నమోదైనట్లు తెలియజేశారు. వృద్ధి కొనసాగుతుంది ఏడాది కాలంగా పలువురు ప్రస్తావిస్తున్నట్లు యూఎస్ తదితర ప్రధాన మార్కెట్లలో ఎలాంటి మాంద్య పరిస్థితుల సంకేతాలూ కనిపించలేదని ఏసీఎంఏ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ పేర్కొన్నా రు. నిజానికి ఆటో విడిభాగాల పరిశ్రమ వృద్ధి బాటలోనే పయనిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమ నుంచి లభించిన వివరాల ప్రకారం జనవరిలోనూ పటిష్ట అమ్మకాలు నమోదుకాగా.. ఇకపైన కూడా ఈ జోరు కొనసాగే వీలున్నదని అభిప్రాయపడ్డారు. వృద్ధిరీత్యా దేశీ మార్కెట్ అత్యంత సానుకూలంగా కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతు ల్లో బలహీనతలున్నప్పటికీ దేశీ డిమాండ్ ఆదుకోగలదని అంచనా వేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఈవీలవైపు ప్రయాణించడంలో స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ లబ్ది పొందనున్నట్లు వివరించారు. ఈవీల కారణంగా ఐసీఈ విభాగంలో డిజైన్, డెవలప్మెంట్ కార్యకలాపాలు నిలిచిపోతుండటంతో దేశీ విడిభాగాలకు గిరాకీ కొనసాగనున్నట్లు తెలియజేశారు. -
వాహన అమ్మకాల జోరు: టాప్ గేర్‌లో విడిభాగాల పరిశ్రమ
న్యూఢిల్లీ:వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరం కూడా రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి సాధించ వచ్చని అంచనా వేస్తోంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ ఈ విషయం తెలిపారు. ‘సంకేతాలన్నీ అదే దిశలో (రెండంకెల స్థాయి వృద్ధి) కనిపిస్తున్నాయి. డిమాండ్ బాగుంది. తయారీ కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయి. మహమ్మారి, లాకవుట్లు, అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడం వంటి మన చేతుల్లో లేని సవాళ్లు తలెత్తితే తప్ప సరైన దిశలోనే పరిశ్రమ సాగుతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఏసీఎంఏ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ టర్నోవరు 2020-21తో పోలిస్తే 23 శాతం పెరిగి రూ. 4.2 లక్షల కోట్లకు చేరింది. డిమాండ్ పుంజుకోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు కొంత తగ్గడం వంటి అంశాల కారణంగా ప్యాసింజర్ వాహనాల తయారీ 20 శాతం, వాణిజ్య వాహనాల ఉత్పత్తి 30 శాతం పెరిగాయి. ఆటో విడిభాగాల ఎగుమతులు 43 శాతం పెరిగి రూ. 1.41 లక్షల కోట్లకు, దిగుమతులు 33 శాతం పెరిగి రూ. 1.36 లక్షల కోట్లకు చేరాయి. ఏసీఎంఏలో 850 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. సంఘటిత పరిశ్రమ టర్నోవరులో వీటి వాటా 90 శాతం పైగా ఉంటుంది. కొత్త వాహనాల ఊతం.. కొత్తగా ప్రవేశపెడుతున్న వాహనాల మోడల్స్ .. ఈ పండుగ సీజన్లో అమ్మకాలకు ఊతంగా నిలవగలవని కపూర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఆశావహంగా ఉండటం ఈ ఆర్థిక సంవత్సరమూ కొనసాగవచ్చని, 2022–23లో పరిశ్రమ ఆరోగ్యకరమైన పనితీరు కనపర్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే, బీమా వ్యయాలు .. ఇంధనం ధరలు .. రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గడం వంటి అంశాలు పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం ఈ అంశాలపై సత్వరం దృష్టి సారించాలని కపూర్ కోరారు. అమ్మకాల పరిమాణం రీత్యా పరిశ్రమ కరోనా పూర్వ స్థాయికి తిరిగి చేరుకుందని చెప్పారు. కొత్త ప్లాట్‌ఫాంలు ఆవిష్కరణ, ద్విచక్ర వాహనాలు.. వాణిజ్య వాహనాల అమ్మకాలు పుంజుకుంటే తదుపరి దశ వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. స్థానికీకరణపై ఆటో పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతుండటం, ప్రభుత్వం ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల్లాంటివి భారత్‌ను హై–ఎండ్ ఆటో–విడిభాగాలకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ కేంద్రంగా మార్చగలవని కపూర్ తెలిపారు. ఎలక్ట్రిక్ దిశగా పరిశ్రమ టూవీలర్లు, త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పుంజుకుంటున్న కొద్దీ విడిభాగాల పరిశ్రమ కూడా గణనీయంగా మార్పులకు లోనవుతోందని కపూర్ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో దేశీయంగా విడిభాగాల తయారీ సంస్థలు వృద్ధి చెందడానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వాహనాల తయారీ సంస్థలకు (ఓఈఎం) ఎలక్ట్రిక్ విడిభాగాల సరఫరా చూస్తే.. మొత్తం దేశీయ మార్కెట్లో చేసిన విక్రయాల్లో కేవలం ఒక్క శాతంగానే (రూ. 3,520 కోట్లు) ఉన్నట్లు కపూర్ వివరించారు. ఈ విభాగంలో అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక పెట్టుబడులు పెట్టడం తిరిగి మొదలైతే.. ఈ రంగంలో నియామకాలు కూడా పెరుగుతాయని కపూర్ చెప్పారు. -
సంక్రాంతి వేళ మారుతి షాక్! పెరిగిన కార్ల ధరలు
ముంబై: దేశీయ మారుతీ సుజుకీ కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్‌నిచ్చింది. వివిధ మోడళ్లపై 4.3 శాతం ధరల్ని పెంచినట్లు తెలిపింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, నిర్వహణ వ్యయం, ఇన్పుట్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. తాజా నిర్ణయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నాలుగోసారి వాహనాల ధరలను పెంచినట్లైంది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యేవి మారుతి కార్లే. గతేడాది ఎక్కువగా అమ్ముడైన కార్లలో మారుతి వ్యాగన్ ఆర్ మొదటి స్థానంలో నిలిచింది. స్విఫ్ట్, ఆల్టో మోడళ్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. తాజాగా పెంచిన ధరలతో మారుతి కారు కొనాలనుకునే వారు మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. చదవండి: ఆకర్షణీయమైన లుక్స్‌తో సరికొత్తగా రానున్న మారుతి సుజుకీ బాలెనో..! -
అచ్చం నాన్నలా!
క్రైమ్ పేరెంటింగ్ నాన్నకు అమ్మంటే చాలా ఇష్టం. చాలా ప్రేమ కూడా. అందుకే తరచు అమ్మను విసుక్కుంటూ ఉంటాడు. ‘అమ్మ.. మన సొంతం కదా’ అన్నట్లు.. అమ్మను ఎంతమాటైనా అంటుంటాడు! అంటే దీనర్థం ఏమిటి? అమ్మని నాన్న గౌరవించకపోయినా చెల్లుతుందనా?! నాన్న అలా అనుకుంటే.. ఇంట్లో పిల్లలూ అలాగే అనుకునే ప్రమాదం ఉంది. ప్రేమ ఉంటే గౌరవం ఉండాలి. గౌరవం లేకుంటే.. పిల్లలు ఇంట చెడి, రచ్చా చెడుతారు! యథా నాన్న... తథా తనయులు అన్నట్లు.. తయారౌతారు! ఒసేవ్.. చెక్‌బుక్ కనపడట్లేదు.. ఎక్కడ పెట్టి చచ్చావే’’ బెడ్రూమ్లోంచి కోపం, విసుగు, అసహనం కలగలసిన భర్తగారి కేక. వంటింట్లో ఉన్న భార్య చేతిలోపని వదిలేసి కంగారుగా బెడ్రూమ్లోకి పరిగెత్తింది. నా వస్తువులు ఏవీ ముట్టుకోవద్దని చెప్పానా? అన్నీ ఎందుకు సర్దుతావ్? ఏమీ తెలీనప్పుడు తెలీనట్టే ఉండాలి’’ అన్నాడు.. వచ్చీరాగానే వార్డ్‌రోబ్‌లోని ఫస్ట్ షెల్ఫ్‌లో బట్టల మడతలున్న పేపర్ కింద వెదుకుతున్న భార్యను చూస్తూ చిరాగ్గా! నువ్వో పెద్ద మొద్దువి. ఏవి ఎంత ఇంపార్టెంటో తెలియదు. అర్థం చేసుకునే తెలివీ లేదు.. ఎందుకు అన్నిట్లో దూరతావ్.. ’’ అంటూ ఇంకా తిడుతూనే ఉన్నాడు భర్త. చెక్ బుక్ తీసి చేతిలో పెట్టింది భార్య.ఎక్కడ దొరికింది? ఇందాక అక్కడే కదా వెదికాను? నేను పెట్టిన వస్తువులు పెట్టిన చోటే ఉంచు. కలియబెట్టకు అన్నీ’’ తిట్టాడు తనకు దొరకలేదన్న కసితో. ‘‘మీరు పెట్టినచోటే ఉందండీ’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పరాభవం తట్టుకోవడం ఆ మొగుడివల్ల కాలేదు. టిఫిన్ దగ్గర తీశాడు. గుర్తుపెట్టుకోండి.. ఇదేంటి ఉప్మానా? లై యా? (పోస్టర్లు అతికించే మైదాపిండి)’’ నోట్లోది ఊస్తూ.. ప్లేట్‌ను తోస్తూ.. అన్నాడు భర్త.ఆయన స్వర తీవ్రతకు.. చేష్టకు బిక్కచచ్చిపోయింది భార్య. ‘‘ఉప్మా ఇలా ఉంటేనే మీకిష్టం కదాని ఎప్పుడూ చేసినట్టే మెత్తగా చేశాను’’ భయపడుతూ జవాబిచ్చింది ఆమె. ‘ఏడిచావ్! ఏమీ చేతకాదు. నీకసలు తిండి దండగ’ అంటూ లేచాడు చేయి కడుక్కోవడానికి.పెళ్లయిన పద్దెమినిదేళ్ల నుంచి ఈ మాట వినీవినీ వేసారిపోయి ఉందేమో ఆ ఇల్లాలు.. ‘‘నాకేం ఊరికినే కూర్చోబెట్టి తిండి పెట్టట్లేదు మీరు. ఇంటెడు చాకిరీ చేస్తున్నా.. మీకు, మీ పిల్లలకు. గుర్తుపెట్టుకోండి’’ అంది కాస్త కటువుగానే వాళ్లాయన ఉప్మాప్లేట్ను టేబుల్ మీద నుంచి తీస్తూ!నాకే ఎదురు చెప్తావా? ఏ పెళ్లాం చేయంది నువ్వు చేస్తున్నావా?’’ అంటూ ఆమె చెంప చెళ్లుమనిపించాడు. తమ గదిలో కాలేజ్‌కి రెడీ అవుతున్న అమ్మాయి, అబ్బాయి మొహమొహాలు చూసుకొని ‘‘మమ్మీ ఎప్పుడూ ఇంతే. డాడీకి అనవసరంగా కోపం తెప్పిస్తుంద’’ న్నట్టుగా తలలాడించారిద్దరూ. నేనూ ఇంట్లో టిఫిన్ తినను. కాలేజ్ క్యాంటీన్ జిందాబాద్’’ అన్నాడు అబ్బాయి. ‘‘నేను కూడా’’ అంది అమ్మాయి. భర్త వెళ్లిపోయాడు. అవమానంతోనే వంటింట్లోకి వెళ్లి పిల్లలకు లంచ్ సర్దసాగింది. టూ మచ్ మమ్మీ.. నాకు వంద, చెల్లికి వంద ఇవ్వూ’’ అంటూ హాల్లోకొచ్చి కేకేశాడు కుమారుడు. ‘‘డబ్బులా.. ఎందుకూ?’’ అంటూ బాక్స్‌లు తీసుకొని వచ్చింది తల్లి.ఆ ఉప్మా మేమూ తినలేం.. క్యాంటీన్లో తింటాం’’ అంటూ కుడి చేయిచాచి వేళ్లను తనవైపు కదిలించసాగాడు ‘ఇవ్వు’ అన్నట్టుగా. మీరూ అలాగే అంటారేంట్రా.. ఎప్పుడూ చేసినట్టే..’’ అని ఆమె సమాధానం చెప్పేలోపే.. ‘‘నీ సోది వినే ఓపికలేదుగానీ ముందు డబ్బులివ్ మమ్మీ’’ అన్నాడు చాలా నిర్లక్ష్యంగా ఏమాత్రం మర్యాద లేకుండా. కొడుకు ప్రవర్తనకు కోపం ముంచుకొచ్చింది అయినా తమాయించుకుంది. ‘‘నా దగ్గరెక్కడుంటాయ్.. మీ డాడీని అడగాల్సింది’’ అంది టిఫిన్ బాక్స్‌లు అందిస్తూ.మమ్మీ దిస్ ఈజ్ టూ మచ్.. ఈ లంచ్ మాత్రం ఎందుకూ? అక్కర్లేదు’’ అన్నాడు కొడుకు బాక్స్‌ను తిరస్కరిస్తూ. నీకూ అక్కర్లేదా?’’ అదే కోపంతో కూతురుని అడిగింది ఆమె.‘‘ప్చ్..’’ అంది తల అడ్డంగా ఊపుతూ. చివుక్కుమంది తల్లి మనసు. లోపలికి వెళ్లి వెదికి వెదికి నూటయాభై రూపాయలు తెచ్చిచ్చింది. చేతిలోంచి విసురుగా లాక్కుంటూ వెళ్లిపోయాడు కొడుకు. వెనకాలే కూతురు. కనీసం బై కూడా చెప్పకుండా. పనిమనిషిలా... నీరసంగా సోఫాలో కూలబడింది ఆ తల్లి. పెళ్లయినప్పటి నుంచీ భర్త పద్ధతి అంతే. కాని పిల్లల తీరే ఆమెకు బాధ కలిగిస్తోంది. ‘ఈ మధ్యయితే మరీ మితిమీరుతున్నారు. తనంటే బొత్తిగా గౌరవం లేకుండా పోతోంది. వాళ్ల మంచి కోసం ఏది చెప్పినా.. చెప్పాలనుకున్నా హీనంగా తీసిపడేస్తున్నారు. వాళ్ల విషయంలో ఏం మాట్లాడబోయినా ‘‘బాగా తెలుసని చెప్పొచ్చావా? వాళ్లు నా పిల్లలు. నేను చెప్పినట్టు వింటారు’’ అని పిల్లల ముందే ఆయన చులకన చేయడం, వాళ్లముందే చేయిచేసుకోవడంతో ఈ ఇంట్లో తన స్థానమేంటో వాళ్లకు అర్థమైపోయింది. కొడుకైతే అచ్చంగా నాన్నకు నకలుగా తయారయ్యాడు. పనిమనిషిలా చూస్తున్నాడు’అని అనుకునేసరికి దుఃఖం పొంగుకొచ్చింది ఆమెకు. ‘కట్టుకున్నవాడికెలాగూ గౌరవం లేదు. కనీసం కన్నపిల్లలైనా విలువిస్తారనుకుంటే తండ్రిని మించిపోయారు. ఛీ.. ఏం బతుకు నాది’ అంటూ ఏడ్చేసింది. అమ్మాయిని కొట్టాడు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు.. ప్రణీత్.. మీ అబ్బాయేనా?’’ అంటూ ఫోన్ వచ్చింది శేఖర్‌కి. అవునండీ.. మీరెవరు?’’ అన్నాడు ఆ తండ్రి.‘‘నేను మీ అబ్బాయి కాలేజ్ ఏరియా పోలీస్‌స్టేషన్ సీఐని.. మీరు అర్జెంట్‌గా రావాలి’’ అవతలి నుంచి ‘ఎందుకు.. ఏమైంది’ అని అడిగేలోపే ఫోన్ కట్ చేశారు సీఐ. ఉన్నపళంగా బయలుదేరాడు కంగారుపడుతూ! శేఖర్ వెళ్లేటప్పటికే అతని భార్యా స్టేషన్లో ఉంది. సీఐని విష్ చేసి ‘‘ఏమైంది’’ అని అడుగుతూ ఆమె పక్కన కూర్చున్నాడు. వాళ్లకు ఎదురుగా నుదుటికి బ్యాండెయిడ్ వేసుకొని కూర్చున్న అమ్మాయిని కళ్లతోనే చూపించింది ఆమె. ఇంకేదో అడిగేలోపే.. ‘‘మీ అబ్బాయి ఆ అమ్మాయిని కొట్టాడు’’ అన్నాడు సీఐ.. శేఖర్ సందేహాన్ని తీరుస్తున్నట్టుగా. తన భార్య పక్కనే ఉన్న కొడుకుని, సీఐని, తమకు ఎదురుగా ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ అయోమయంగా.. ‘‘అసలు ఏమైంది’’అని అడిగాడు. కొడుకు ఏదో చెప్పబోతుండగా.. ‘‘నువ్వేం చెప్తావ్గానీ ఉండబ్బాయ్’’ అని వారించి ‘‘మీ అబ్బాయి ఆడపిల్లల పట్ల చాలా దురుసుగా బిహేవ్ చేస్తున్నాడండీ.. చాలా అమర్యాదగా మాట్లాడ్తాడు. ఇదివరకే రెండు, మూడుసార్లు మాకే కాదు, ప్రిన్సిపల్ వరకూ కంప్లయింట్స్ వెళ్లాయ్ మీ అబ్బాయి మీద. ఏదో పిల్లలు.. కలిసి చదువుకుంటున్నప్పుడు అలాంటివి ఉంటాయ్.. ఫ్రెండ్లీగా తీసుకోవాలి’ అని అమ్మాయిలకు సర్దిచెప్పాం. ఒళ్లు దగ్గరపెట్టుకొని ఉండమని మీ అబ్బాయికీ వార్నింగ్ ఇచ్చాం. అయినా మార్పులేదు. ఈ రోజు ఏకంగా చెయ్యే చేసుకున్నాడు’’ అని చెప్పింది ఆ అమ్మాయితోపాటు వచ్చిన లెక్చరర్. ‘‘సర్.. ప్రణీత్ మా పట్ల కూడా చాలా మిస్‌బిహేవ్ చేశాడు ఎన్నోసార్లు. నోటికొచ్చినట్టు మాట్లాడ్తాడు. మేం తిరిగి ఏదైనా అంటే.. బూతులు తిడతాడు’’ అని చెప్పింది ప్రణీత్ క్లాస్మేట్ ఇంకో అమ్మాయి. ‘‘ఈ రోజు కూడా అంతే.. చిన్న విషయంలో తన పంతం నెగ్గించుకోవడానికి నాతో ఆర్గ్యూ చేసి.. ఓడిపోతున్నాడనే అక్కసుతో నన్ను తోశాడు సర్. బెంచీ ఎడ్జ్ మీద పడ్డాను. ఐబ్రో మీది చర్మం చిట్లి రక్తం వచ్చింది’’ జరిగింది వివరించింది ఆ అమ్మాయి. ‘‘ఏరా.. అంత మొనగాడివా నువ్వు?’’ అన్నాడు సీఐ.. ప్రణీత్‌ను ఉద్దేశించి. భార్యకు గౌరవం ఇవ్వండి... సర్.. అమ్మాయిలకు పంతమేంటి సర్? నేనేదో సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ‘తప్పు తప్పు’ అని నాకే వంక పెట్టారు. నేను చెప్పినదాన్నే తప్పు పట్టారు. మా ఇంట్లో మా చెల్లి అలా మాట్లాడినా కొడతాను. చివరకు మా అమ్మ ఎదురు చెప్పినా నాకు కోపం సర్. ఆడపిల్లలకు మగవాళ్లతో పోటీ ఏంటి? ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి గాని’’ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అన్నాడు ప్రణీత్. తండ్రితో సహా అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు వాడి మాటలకు. ప్రణీత్ మైండ్ సెట్ అర్థమైన సీఐ.. కేస్ పెట్టకుండా అమ్మాయికి, లెక్చరర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ప్రణీత్ మాటలతో వాడి కుటుంబ నేపథ్యాన్ని గ్రహించగలిగింది లెక్చరర్. లాస్ట్వార్నింగ్ ఇస్తూ వాడిని వదిలేస్తున్నట్టు చెప్పింది. ఆ పిల్లలను తీసుకొని వెళ్లబోతూ ‘‘ఇంట్లో మీ భార్యకు గౌరవం ఇవ్వడం నేర్చుకొండి. ఆడపిల్లలతో ఎలా మెలగాలో తెలుసుకుంటాడు మీ అబ్బాయి’’ అని సీరియస్‌గా సలహా ఇచ్చి బయటకు నడిచింది లెక్చరర్. ప్రణీత్ వాళ్లమ్మ భర్త వంక చూసింది. తలదించుకున్నాడతను. ప్రణీత్‌కు కౌన్సెలింగ్ స్టార్ట్ చేశాడు సీఐ. ఆ మాటలు ప్రణీత్ తండ్రి చెవినా పడుతున్నాయ్. నువ్వు గౌరవం ఇస్తేనే నీకు గౌరవం సాధారణంగా మన కుటుంబాల్లో భర్తకు భార్య టేకెన్ ఫర్ గ్రాంటెడ్. కుటుంబ సభ్యుల అందరిముందే ఆమెను విమర్శించడం, తిట్టడం వంటివి చేస్తుంటాడు. ఇది పిల్లల మీద ప్రభావం చూపుతుంది. అందుకే ముందు కుటుంబంలో అందరూ సమానం అనే భావన పిల్లల్లో కలిగించాలి. ఇంట్లో తల్లి, అక్క, చెల్లికి గౌరవం ఇస్తేనే బయట నువ్వు గౌరవం పొందుతావనే విషయాన్ని మగపిల్లలకు బోధించాలి. కుటుంబంలో ప్రేమానురాగాలు, గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాతావరణం ఉండాలి. – డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్, ల్యూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ - శరాది