పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వసూలు చేస్తున్న ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తూ అధికారికంగా ఉత్వరులు జారీ చేసింది.
భారత్‌లో ఆయా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు స్థానికంగా ఫోన్‌లను తయారు చేయాలంటే.. అందుకు అవసరమయ్యే విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అలా దిగుమతి చేసుకున్నందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి 15 శాతం ఇంపోర్ట్ డ్యూటీని చెల్లించాలి. అయితే, తాజాగా ఈ ఇంపోర్ట్ డ్యూటీని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఇంకా, ఎల్‌సీడీ ప్యానెల్‌ల డిస్‌ప్లే, అసెంబ్లీ భాగాలపై దిగుమతి సుంకాలు 10శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.
దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఎగుమతులు పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా స్మార్ట్‌ఫోన్ తయారీ మార్కెట్‌లో కీలక పాత్రపోషిస్తున్న చైనా, వియాత్నాం వంటి దేశాలతో భారత్ పోటీపడేందుకు అవకాశంగా మారుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక దిగుమతి సుంకం తగ్గింపుతో భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మొబైల్ విడి భాగాలపై
మొబైల్ తయారీ పరిశ్రమలో భారత్‌ను అగ్రగామిగా నిలిచేందుకు కేంద్రం మొబైల్ ఫోన్ విడి భాగాలపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించింది. సిమ్ సాకెట్, బ్యాటరీ కవర్, మెయిన్ కవర్, స్క్రూలు, జీఎస్‌ఎం, యాంటెన్నా వంటి మెకానికల్, ప్లాస్టిక్ ఇన్‌పుట్ భాగాలతో పాటు ఇతర మొబైల్ ఫోన్ విడి భాగాలపై దిగుమతి సుంకం తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment