బంగారం,వెండి వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. పుత్తడి, వెండితో పాటు విలువైన లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.
ప్రస్తుతం దిగుమంతి సుంకం 10శాతం ఉండగా.. దాన్ని 15శాతానికి పెంచింది. పెంచిన దిగుమతి సుంకం నిన్నటి నుంచి అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.
ఇందులో పదిశాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ , మరో ఐదుశాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ ఉంటుంది. తాజాగా సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జి నుంచి మినహాయింపు ఇవ్వనున్నది. బంగారం, వెండిలో వినియోగించే హుక్, పిన్, స్క్రూ వంటి చిన్న భాగాలు ఈ సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జి కిందకు వస్తాయి. కాగా, కేంద్రం నిర్ణయంతో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment