ముంబై: దేశీయ మారుతీ సుజుకీ కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్‌నిచ్చింది. వివిధ మోడళ్లపై 4.3 శాతం ధరల్ని పెంచినట్లు తెలిపింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, నిర్వహణ వ్యయం, ఇన్‌పుట్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. తాజా నిర్ణయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నాలుగోసారి వాహనాల ధరలను పెంచినట్లైంది.
దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యేవి మారుతి కార్లే. గతేడాది ఎక్కువగా అమ్ముడైన కార్లలో మారుతి వ్యాగన్ ఆర్ మొదటి స్థానంలో నిలిచింది. స్విఫ్ట్, ఆల్టో మోడళ్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. తాజాగా పెంచిన ధరలతో మారుతి కారు కొనాలనుకునే వారు మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
చదవండి: ఆకర్షణీయమైన లుక్స్‌తో సరికొత్తగా రానున్న మారుతి సుజుకీ బాలెనో..!
Comments
Please login to add a commentAdd a comment