Maruti price hike
-
సంక్రాంతి వేళ మారుతి షాక్! పెరిగిన కార్ల ధరలు
ముంబై: దేశీయ మారుతీ సుజుకీ కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్‌నిచ్చింది. వివిధ మోడళ్లపై 4.3 శాతం ధరల్ని పెంచినట్లు తెలిపింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, నిర్వహణ వ్యయం, ఇన్పుట్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. తాజా నిర్ణయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నాలుగోసారి వాహనాల ధరలను పెంచినట్లైంది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యేవి మారుతి కార్లే. గతేడాది ఎక్కువగా అమ్ముడైన కార్లలో మారుతి వ్యాగన్ ఆర్ మొదటి స్థానంలో నిలిచింది. స్విఫ్ట్, ఆల్టో మోడళ్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. తాజాగా పెంచిన ధరలతో మారుతి కారు కొనాలనుకునే వారు మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. చదవండి: ఆకర్షణీయమైన లుక్స్‌తో సరికొత్తగా రానున్న మారుతి సుజుకీ బాలెనో..! -
మారుతి ధరలకు రెక్కలు
గువహటి: మారుతి సుజుకి కంపెనీ అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ.3,000 నుంచి రూ.10,000 వరకూ పెంచుతోంది. ఈ పెరిగిన ధరలు వచ్చే నెల మొదటి వారం నుంచి అమల్లోకి వస్తాయని మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) సీఓఓ(మార్కెటింగ్ అండ్ సేల్స్) మయంక్ పరీక్ చెప్పారు. రూపాయి పతనం కారణంగా ధరలు పెంచుతున్నామని పేర్కొన్నారు. ధరలు ఎప్పుడో పెంచాల్సిందని, కానీ భరించగలిగే స్థాయి వరకూ భరించగలిగామని, ఇక భరించలేని స్థాయికి చేరడంతో ధరలు పెంచక తప్పడం లేదని వివరించారు. మారుతి కంపెనీ రూ. 2.35 లక్షల నుంచి రూ.10.21 లక్షల రేంజ్లో ఉన్న వాహనాలను విక్రయిస్తోంది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ఈ ఏడాది జనవరిలోనే ఈ కంపెనీ ధరలను రూ.20,000 వరకూ పెంచింది. ఒక్క మారుతీ కంపెనీయే కాకుండా పలు వాహన కంపెనీలు కూడా రూపాయి పతనం కారణంగా ధరలను పెంచాయి. హ్యుందాయ్, టయోటా, జనరల్ మోటార్స్ తదితర కంపెనీలు ధరలను పెంచాయి. టాటా మోటార్స్ కంపెనీ కూడా ధరలను పెంచాలని యోచిస్తోంది.