Wearable
-
వేరబుల్స్ రంగానికీ పీఎల్ఐ స్కీమ్.. కేంద్రానికి ఎంఏఐటీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, వేరబుల్స్ తయారీకి సంబంధించి మరో రెండు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ( పీఎల్ఐ ) పథకాలను రూపొందించాలని ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ అసోసియేషన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఏఐటి) ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు ఎన్నికల తర్వాత ట్యాక్స్‌ల్లో మార్పులు, చైనా పౌరుల వీసా సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఎంఏఐటీ విజ్ఞప్తిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.ఎంఏఐటీ విభాగం కేంద్ర ప్రభుత్వం తరుపున దేశంలో ప్రైవేట్ ఐటీ హార్డ్ వేర్ రంగాన్ని ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరిస్తుంది. ఆయా కంపెనీల కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. వాటి వృద్ది కోసం పాటు పడుతుంది.ఆ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్న డిక్సాన్ టెక్నాలజీస్, డెల్, హెచ్‌పీ,గూగుల్ కార్యకలాపాలు, నిబంధనలకు మేరకు పనిచేస్తున్నాయా? వంటి అంశాలపై రివ్యూ నిర్వహించనుంది.ఈ తరుణంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ,వేరబుల్స్ విభాగంలో సైతం పీఎల్ఐ స్కీంను రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. తద్వారా దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, వేరబుల్స్ తయారీ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఎగుమతులు, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు అవకాశాలను ఆకర్షించడం, దేశీయంగా ఆ రంగాల్సి ప్రోత్సహించడంతో పాటు అపారమైన అవకాశాల్ని సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది. -
అదిరిపోయే ఫీచర్లతో.. 'బోట్' స్మార్ట్ వాచ్ విడుదల, ధర ఇంత తక్కువా!
తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో ప్రముఖ వేరబుల్ తయారీ సంస్థ 'బోట్ ఎక్స్టెండ్ టాక్' అనే స్మార్ట్ వాచ్‌ను విడుదల చేయనుంది. స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, అలెక్సా సపోర్ట్, ఐపీ 68తో పాటు ఫీచర్లు ఉన్నాయి. 2.5 డీ కర్వ్డ్ స్క్రీన్‌తో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.3వేల లోపు ఉండనుంది. ఫీచర్లు 300ఎంఏహెచ్ బ్యాటరీ, హెచ్డీ రెజెల్యూషన్‌తో 1.69 డిస్ప్లేతో డిజైన్ చేసింది. బోట్ స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్లు, పల్స్ రేట్ ఎలా ఉందో చెక్ చేసే ఆక్సో మీటర్ తరహాలో (ఎస్పీ ఓ2 మానిటర్), ఉదాహరణకు ట్రెడ్ మిల్ మీద మీరు నడిచే సమయంలో ఎంత గాలి పీలుస్తున్నారు. ఎంత గాలి వదులుతున్నారో గుర్తించండం (వీఓ2 మ్యాక్స్), ఎన్ని మెట్లు ఎక్కారో ట్రాక్ చేయడం, మీ శరీరంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి. స్పోర్ట్స్ మోడ్స్ విభాగంలో రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, యోగా, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ బ్యాడ్మింటన్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఎంత సేపు చేశారో ఆటో మెటిగ్గా గుర్తిస్తుంది. బ్యాటరీ లైఫ్ టైం ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ లైఫ్ టైం 10రోజులు ఉంటుందని బోట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కొన్ని సమయాల్లో మాత్రం బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్‌తో 2 రోజుల బ్యాటరీ లైఫ్ టైంను వినియోగించుకోవచ్చని తెలిపారు. ధర ఐపీ68 రేటింగ్‌తో వస్తున్న ఈ ఎక్సెటెండ్ టాక్ స్మార్ట్ వాచ్‌లో 150 వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. అంటే వాచ్ డిస్ప్లే ను మీరు 150 రకాల డిస్ప్లే స్టైల్స్‌ను మార్చుకోవచ్చు. ఇక ఈ వాచ్ ప్రారంభ ధర రూ.2,999గా ఉంది. అమెజాన్‌లో లభ్యమయ్యే ఈ స్మార్ట్ వాచ్ పిచ్ బ్లాక్, చెర్రీ బ్లూసోమ్, టీమ్ గ్రీన్ వేరియంట్లలో లభ్యం అవుతుంది. -
గాడ్జెట్స్ మార్కెట్ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వేరబుల్స్ (మన శరీరానికి నేరుగా కాంటాక్ట్‌తో ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్) మార్కెట్ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 1.12 కోట్ల యూనిట్ల స్మార్ట్‌వాచెస్, రిస్ట్ బ్యాండ్స్, ఇయర్‌వేర్ అమ్ముడయ్యాయి. ఇందులో ఇయర్‌వేర్ 92 లక్షలు, రిస్ట్ బ్యాండ్స్ 3.72 లక్షలు, స్మార్ట్‌వాచెస్ 16 లక్షల యూనిట్లు ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 118.2 శాతం వృద్ధి. దేశీయ కంపెనీలు పెద్ద ఎత్తున ఇయర్‌వేర్, వాచెస్ విక్రయం కారణంగా ఈ వృద్ధి సాధ్యపడిందని ఐడీసీ వెల్లడించింది. ‘2021 జనవరి–మార్చితో పోలిస్తే సెకండ్ వేవ్ మూలంగా జూన్ త్రైమాసికంలో విక్రయాలు 1.3 శాతం తగ్గాయి. గతేడాదితో పోలిస్తే మార్కెట్ ఈ ఏడాది త్వరితగతిన రికవరీ అయింది. పండుగల సీజన్లో డిమాండ్ విపరీతంగా ఉండనుంది. కంపెనీలు ఉత్పత్తుల ధరలను సవరించనున్నాయి. గతేడాదితో పోలిస్తే 2021 జూలై–డిసెంబరు కాలంలో 35 శాతం అధికంగా అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉంది. రిస్ట్‌వేర్ విభాగంలో వాచెస్ వాటా ఏకంగా 81.2 శాతం ఉంది. ఈ విభాగం మరింత పుంజుకోనుంది. రిస్ట్‌వేర్ విభాగం 35 శాతం వృద్ధి చెందింది. ఇయర్‌వేర్ రెండింతలైంది. యూనిట్ల పరంగా ఈ విభాగానిదే పైచేయి’ అని ఐడీసీ వివరించింది. -
వైర్ నుంచి వైర్లెస్కు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేతికి స్మార్ట్‌వాచ్, చెవిలో వైర్లెస్ డివైస్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే ట్రెండ్. స్మార్ట్‌ఫోన్స్‌తోపాటు వేరబుల్స్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. భారత్ విషయానికి వస్తే వేరబుల్స్ మార్కెట్ 2019తో పోలిస్తే 2020లో 144.3 శాతం వృద్ధి సాధించిందని పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్–20 మార్కెట్లలో మూడంకెల వృద్ధి నమోదు చేసి భారత్ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది దేశవ్యాప్తంగా 3.64 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయి. అంతర్జాతీయంగా అమ్మకాల పరంగా మూడవ స్థానాన్ని కొనసాగిస్తూ కంపెనీలను భారత్ ఊరిస్తోంది. అమ్మకాలు ఎందుకంటే... ఇయర్‌వేర్ డివైస్ వినియోగం పెరగడం, రిస్ట్ బ్యాండ్స్ నుంచి స్మార్ట్‌వాచ్‌ల వైపు కస్టమర్లు మళ్లడం ఈ స్థాయి విక్రయాలకు కారణం. ఈ రెండు విభాగాలు దేశంలో తొలిసారిగా 2020లో రికార్డు స్థాయి అమ్మకాలను సాధించాయి. అక్టోబరు–డిసెంబరు త్రైమాసికంలో ఇప్పటి వరకు అత్యధికంగా 1.52 కోట్ల యూనిట్ల వేరబుల్స్ సేల్స్ జరిగాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 198.2 శాతం అధికం. ఇక 2020లో స్పష్టమైన మార్పు ఏమంటే ఆడియో విభాగంలో వైర్డ్ నుంచి వైర్లెస్ వైపు మార్కెట్ దూసుకెళ్లడమే. 2021లో ఈ విభాగంలో మెరుగైన అనుభూతినిచ్చే అధునాతన పరికరాలు కస్టమర్ల ముందుకు రానున్నాయి. వేరబుల్స్ రంగంలో ఇయర్‌వేర్ వాటా అత్యధికంగా 83.6 శాతం ఉంది. రిస్ట్ బ్యాండ్స్ నుంచి.. గతేడాది దేశంలో 26 లక్షల యూనిట్ల స్మార్ట్‌వాచ్‌లు అమ్ముడయ్యాయి. 2019తో పోలిస్తే ఇది 139.3 శాతం అధికం. సగం విక్రయాలు అక్టోబరు–డిసెంబరు పీరియడ్‌లో నమోదు కావడం విశేషం. ఒక త్రైమాసికంలో 10 లక్షల యూనిట్లు దాటడం ఇదే తొలిసారి. తక్కువ ధరలోనూ స్మార్ట్‌వాచ్‌లు లభ్యం కావడంతో రిస్ట్ బ్యాండ్స్‌కు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. 2019లో రిస్ట్ బ్యాండ్స్ 33 లక్షల యూనిట్లు అమ్ముడైతే, గతేడాది 34.3 శాతం తగ్గాయి. తొలినాళ్లలో స్మార్ట్‌వాచ్‌ల ధర రూ.20,000 ఉండేది. ఇప్పుడు రూ.5 వేల లోపు ధరలోనే లభిస్తున్నాయని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. కొత్త ఫీచర్లు తోడవడం కూడా వీటికి ఆదరణ పెంచుతోందని చెప్పారు. తగ్గుతున్న ధరలు.. ఇయర్‌వేర్ అమ్మకాలు మూడింతలు పెరిగి గతేడాది 3.04 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. డిసెంబరు త్రైమాసికంలో 300 శాతం వృద్ధి చెంది 1.29 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. అందుబాటు ధరలో లభించడం, ఎంటర్టైన్మెంట్తోపాటు వర్చువల్ మీటింగ్స్, ఆన్లైన్ తరగతులు వెరశి ఈ విభాగం దూసుకెళ్తోందని బి–న్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. ట్రూలీ వైర్లెస్ స్టీరియో డివైసెస్ ఏకంగా పదింతలై 1.13 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. పోటీ తీవ్రం కావడంతో చాలా కంపెనీలు అందుబాటు ధరలో ప్రవేశపెడుతున్నాయి. వీటి సగటు ధర 2019లో రూ.8,000 ఉంటే, గతేడాది ఇది రూ.3,200లకు వచ్చి చేరింది. -
టచ్ చేయకుండా టైప్ చేయచ్చు
-
సూపర్ సూట్‌తో మీ పిల్లలు ఫిట్
న్యూఢిల్లీ: టీవీల్లో కార్టూన్ సీరియళ్లు, మొబైల్స్‌లో వీడియో గేమ్స్ అంటూ స్క్రీన్లకు అతుక్కుపోయే పిల్లలు శారీరకంగా ఎంతగా బలహీనంగా తయారవుతున్నారో తెలిసిందే. కారణం శరీరాన్ని ఉత్తేజంగా, శక్తిమంతంగా ఉంచే అవుట్డోర్ గేమ్స్‌కు వారు దూరం కావడమే. అయితే ఈ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉందంటోంది అమెరికాకు చెందిన ఓ గేమ్స్ డిజైన్ సంస్థ. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ సూపర్ సూట్‌ను తయారు చేశామని, ఇది పిల్లలకు అవుట్డోర్ గేమ్స్‌పై ఆసక్తి పెంచడమే కాకుండా ఫిట్నెస్గా తయారు చేస్తుందని చెబుతున్నారు. ఈ సూట్ ధరించిన పిల్లల ఫిట్నెస్ ఎంతో తల్లిదండ్రులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా తెలుసుకునేలా ఓ యాప్‌ను కూడా రూపొందించామని తయారీదారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనిని మార్కెట్లోకి విడుదల చేస్తామని, పిల్లలంతా అవుట్డోర్ గేమ్స్‌ను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తోంది. -
ఇక డయాలసిస్ కష్టాలు తీరినట్టేనా?
వాషింగ్టన్: కిడ్నీలు పూర్తిగా చెడిపోయి.. డయాలసిస్ చికిత్సపై ఆధారపడి జీవించే రోగులకు ఇక ఆ కష్టాలు తీరినట్టే. ఇలాంటి వారికోసం ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు పరిశోధకులు. తీవ్రమైన కిడ్నీవ్యాధితో బాధపడుతూ..రక్తశుద్ధి కోసం డయాలసిస్ చేయించుకునే పేషంట్ల బాధలు అన్నీ ఇన్నీ కావు. వీటికి తోడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేమీకాదు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఫూడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక కృత్రిమ కిడ్నీని రూపొందించింది. ప్రామాణిక డయాలసిస్ చికిత్సా పద్ధతికి స్వస్తి చెపుతూ నూతన సాంకేతిక పద్ధతితో ఆర్టిఫిషీయల్ కిడ్నీని తయారు చేశారు. కన్వెన్షనల్ డయాలసిస్ లో మిషీన్ నడుస్తున్నంత సేపు ..పేషెంట్ మంచానికి పరిమితమై ఉండాలి... రకాల రకాల ట్యూబులతో రోగి శరీరానికి అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రక్రియ మొత్తం ఒక రోజంతా నడుస్తుంది. కానీ ఈ ధరించడానికి వీలుగా రూపొందించిన ఈ కృత్రిమ కిడ్నీ మూలంగా....పేషెంట్ ఫ్రీగా తిరగొచ్చనీ, ట్యూబుల బాధ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. డయాలసిస్ సెషన్స్ ను తగ్గించవచ్చని, దీని ద్వారా అదనపు చికిత్స ప్రయోజనాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆహారం ఆంక్షలు లేకపోవడంతోపాటూ చికిత్స సమయంలో బాధల్నీ,తీవ్రమైన దుష్ప్రభావాలను నిరోధించినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ప్రయోగదశలో ఉన్న ఈ కృత్రిమ పరికరంద్వారా వ్యర్థ ఉత్పత్తులను, అదనపు నీరు, ఉప్పు లను సమర్ధవంతంగా తొలగించగలదని చెప్పారు. యూరియా, క్రియాటినిన్ మరియు భాస్వరం తదితర వ్యర్థాలను సాధారణం మూత్రపిండాల్లోలాగానే ఫిల్టర్ చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. లాస్ ఏంజిల్స్ లో సేడార్-సినై మెడికల్ సెంటర్ కు చెందిన విక్టర్ గురా దీన్ని ఆవిష్కరించారు. ధరించగలిగిన కృత్రిమ కిడ్నీ నమూనా పరికరాన్ని సీటెల్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్ లో రోగులపై విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగ ఫలితాలను జేసీఐ ఇన్సైట్స్ జర్నల్ లో ప్రచురించారు. ఈ తరహాలో వేరియబుల్ ఆర్టీఫిషియల్ కిడ్నీ ఆవిష్కరణ, దీని ప్రయోగ ఫలితాలు మరింత నూతన డయాలసిస్ టెక్నాలజీ అభివృద్ధికి తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.