PC: Twitter
అక్షరాలు అంటే వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిలే కాదు... అగ్నిజ్వాలలు కూడా. ఆ వెలుగు ఎన్నో రకాల చీకట్లను పారదోలుతుంది. ‘షీ ఈజ్–ఉమెన్ ఇన్ స్టీమ్’ పుస్తకంలో ఎన్నో జీవితాలు ఉన్నాయి. ఎన్నో పోరాటాలు ఉన్నాయి. స్ఫూర్తినిచ్చే ఎన్నో విజయాలు ఉన్నాయి...
డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఎల్సా మేరి డిసిల్వా ‘షీ ఈజ్–ఉమెన్ ఇన్ స్టీమ్’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ‘స్టెమ్’(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మాథమెటిక్స్)కు విస్తరణ ఈ స్టీమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమేటిక్స్).
సైన్స్ నుంచి సమాజసేవ వరకు వివిధ రంగాలలో విశేష కృషి చేసిన డెబ్భై అయిదు మంది మహిళలను ఈ పుస్తకం ద్వారా పరిచయం చేశారు డిసిల్వా. పరిచయం అనడం కంటే వారి పర్సనల్, ప్రొఫెషన్ స్ట్రగుల్‌ను కళ్లకు కట్టారు అనడం సబబుగా ఉంటుంది.
ఈ పుస్తకంలో చోటు చేసుకున్న వివిధ రంగాల మహిళలు...
అదితి చతుర్వేది–టెక్నాలజీ పాలసీ
ఆనంది అయ్యర్–క్లైమెట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్
అంజలి మల్హోత్ర–ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ
అను ఆచార్య–హెల్త్ సైన్స్
అనుపమ్ కపూర్–హ్యూమన్ రిసోర్స్
అనుశ్రీ మాలిక్–ఎన్విరాన్‌మెంట్ సైన్స్
అపూర్వ బెడెకర్–మెడికల్ డివైజ్
అర్చన చుగ్–బయోలాజికల్ సైన్స్
ఆర్తి కశ్యప్–డిజైన్ అండ్ టెక్నాలజీ
అజ్రా ఇస్మాయిల్–డిజైన్ అండ్ టెక్నాలజీ
విజయలక్ష్మీ బిస్వాల్–హెల్త్ సైన్సెస్
బినేష్ పయట్టటి–ఎన్విరాన్‌మెంట్ సైన్స్
బిను వర్మ–ఎడ్యుకేషన్
బృంద సొమయ–ఆర్కిటెక్చర్చర్
చంద నిమ్‌బకర్–బయోలాజికల్ సైన్స్
చెర్లీ పెరైర–ఎన్జీవో
దీప్తి గుప్త–ఇంజనీరింగ్
దర్శన జోషి–ఫిజిక్స్
మనిషా ఆచార్య–ఇన్నోవేషన్
రాఖీ చతుర్వేది–బయోలాజికల్ సైన్స్
శుభాంగి వుమ్‌బర్కర్–కెమికల్ సైన్స్
అర్చన శర్మ–ఇంజనీరింగ్
భారతి సింఘల్–బయోలాజికల్ సైన్స్
కల్పన నాగ్‌పాల్–ఫార్మాస్యూటికల్ సైన్స్
ప్రీతి షరన్–ఇంజనీరింగ్
షమిత కుమార్–ఎన్విరాన్‌మెంట్ సైన్స్
దుర్బసేన్‌గుప్త– బయోకెమిస్త్రీ
ఏక్తా వివేక్ వర్మ–జెండర్ బేస్డ్ వాయిలెన్స్
గాయత్రి జోలి–డిజైన్ అండ్ టెక్నాలజీ
గీత మెహత–డిజైన్ అండ్ టెక్నాలజీ
గీతారాయ్–బయోలాజికల్ సైన్స్
జీవన్‌జ్యోతి పండ–బయోలాజికల్ సైన్స్
కైయిత్కి అగర్వాల్–ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ
కరణ్ శైవ–సస్టేనబుల్ డెవలప్‌మెంట్
కవితా గోంసాల్‌వేజ్–డిజైన్ అండ్ టెక్నాలజి
కిరణ్ బాలా–ఎన్విరాన్‌మెంట్ సైన్స్
కిరణ్ మన్రల్–ఆర్ట్స్ అండ్ కమ్యునికేషన్
లిజీ ఫిలిప్–సివిల్ ఇంజనీరింగ్
మాధవీలత గాలి–సివిల్ ఇంజనీరింగ్
మిథాలి నికోర్–ఎకనామిక్స్
మోనాలి హజ్ర–ఎన్విరాన్‌మెంట్ సైన్స్
మోనాలీసా ఛటర్జీ–ఫార్మాస్యూటికల్ సైన్స్
నమ్రత రాణా–క్లైమెట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్స్
నందితాదాస్ గుప్త–ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
నీలమ్–సోషల్ ఇంపాక్ట్
నిహారిక మల్హోత్ర–హెల్త్ సైన్స్
నిష్మ వాంగూ–నానోసైన్స్ అండ్ నానో టెక్నాలజీ
పద్మ పార్థసారథి–ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ
ప్రీతి అఘలయం–కెమికల్ ఇంజనీరింగ్
అర్పిత మోండల్–ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్
జైదీప్ మల్హోత్ర–హెల్త్ సైన్స్, రాధిక–హెల్త్ సైన్స్
రంజని విశ్వనాథ్–కెమికల్ సైన్స్
రష్మీ పుట్చ–డిజైన్ అండ్ టెక్నాలజీ
రీతూపర్ణ మండల్–సెమీ కండక్టర్స్
రుమ పాల్–హెల్త్ సైన్స్
సంఘమిత్ర బందోపాధ్యాయ–న్యూరోసైన్స్
షెలక గుప్త–కెమికల్ ఇంజనీరింగ్
శిలో శివ్–ఆర్ట్స్ అండ్ కమ్యునికేషన్
శిల్పి శర్మ–ఎన్విరాన్‌మెంట్ సైన్స్
షీతల్ కక్కర్ మెహ్ర–సోషల్ ఇంపాక్ట్
శ్రుతి పాండే–ఆర్కిటెక్చర్
శ్యామల రాజారామ్–ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజి
శిమ్మి దర్నిజ–ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజి
శ్రీదేవి ఉపాధ్యాయుల–కెమికల్ ఇంజనీరింగ్
సుసన్–బయోలాజికల్ సైన్స్
స్వర్ణలత జె– కమ్యూనిటి సర్వీస్
తృప్తిదాస్–ఎన్విరాన్‌మెంట్ సైన్స్
వందన ననల్–ఫిజిక్స్
వనమాల జైన్–డిజైన్ అండ్ టెక్నాలజీ
వర్ష సింగ్–సైకాలజి
విశాఖ చందేరె–క్లీన్ ఎనర్జీ
యమ దీక్షిత్– క్లైమేట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్స్
జైబున్నిసా మాలిక్ – కంప్యూటర్ సైన్స్.
‘ఎన్నో ఏళ్లుగా కార్పొరేట్, డెవలప్‌మెంట్ సెక్టర్‌లో పనిచేసిన నేను వివిధ రూపాల్లో ఉండే పురుషాధిక్యతను చూశాను. మహిళ అనే కారణంతో వారి ప్రతిభను పట్టించుకోని వారిని చూశాను. రకరకాల అనుభవాలు ఈ పుస్తకం తీసుకురావడానికి కారణం అయ్యాయి’ అంటోంది పుస్తక రచయిత్రి ఎల్సా మేరి డిసిల్వా. ‘షీ–ఈజ్’ బుక్‌సిరీస్‌లో ఇంకా ఎన్నో పుస్తకాలు రానున్నాయి. మహిళాశక్తిని ప్రపంచానికి చాటనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment