న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ సహా అణగారిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కావడంతో ‘‘సామాజిక న్యాయ పఖ్వాడా’’లో భాగంగా ఏప్రిల్ 6 నుంచి వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
అణగారిన వర్గాల కోసం కేంద్రం చేపట్టిన గృహనిర్మాణం, పౌష్టికాహారం, ఉచిత రేషన్ వంటి పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ప్రధానమంత్రులు చేసిన సేవల్ని గుర్తించింది కేవలం బీజేపీయేనని పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న మన దేశ మాజీ ప్రధానుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సంగ్రహాలయ మ్యూజియం ప్రారంభం కానుంది.
స్త్రీల పేరిట ఇళ్లతో మహిళా సాధికారత
ఇంటిపై యాజమాన్య హక్కులు మహిళలకు ఉంటే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, ఇంట్లో ఆర్థిక వ్యవహారాలపై వారి పట్టు పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం కింద 5.21 లక్షల పక్కా ఇళ్లను లబ్ధిదారులకు అందించే గృహప్రవేశం కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించారు.
(చదవండి: భూమి పుట్టుకపై కొత్త ఆధారం)
Comments
Please login to add a commentAdd a comment