
ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీస్ ఎంటర్‌ప్రైజ్ ట్రెస్‌విస్టా (TresVista) ఇంటర్నేషనల్ వుమెన్స్ డే 2022 సందర్భంగా మహిళా ఉద్యోగుల సాధికారతను మరింత బలోపేతం చేసేందుకు పలు చర్యలను తీసుకుంది. మహిళా ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికి, సాధికారత కల్పించడానికి గత ఐదు సంవత్సరాలుగా విజయవంతమైన WiT (ఉమెన్ ఇన్ ట్రెస్‌విస్టా) సెల్‌ను కంపెనీ నిర్వహిస్తోంది.
వీటి ద్వారా ఏడాది పొడవునా మహిళలకు షెనోమిక్స్, అనేక ఇతర టై-అప్‌ల కోసం ఆస్పైర్స్ భాగస్వామ్యంతో WiT వృత్తిపరమైన, వ్యక్తిగత వృద్ధికి మద్దతును అందిస్తూ మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ట్రెస్‌విస్టా పెట్టుకుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్యాలెండర్ సంవత్సరం ముగిసే నాటికి 2,000 మంది ఉద్యోగులతో టీమ్ పరిమాణాన్ని విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. వీటిలో 1,100 మంది ఉద్యోగులను కలిగి ఉండగా.. అందులో 42 శాతం మంది మహిళలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 500పైగా కంపెనీలకు ట్రెస్ విస్టా తన సేవలను అందిస్తోంది.