
హైదరాబాద్: మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి కొండా సురేఖ. చారిత్రక నాయకురాలు రాణి రుద్రమదేవి నుంచి మొదలుకొని నేటి వ్యాపారవేత్తల వరకూ మహిళలు సమాజానికి వెన్నెముకగా ఉన్నారన్నారు. విమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిల్ ఆప్ ఎంట్రపెన్యూన్ అండ బీ2బీ ఎక్స్ పో 2025లో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ‘మహిళా సాధికారత సామాజిక పురోగతి మాత్రమే కాదని, ఆర్థిక వృద్ధికి కీలకం. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో లక్ష మంది మహిళా కోటీశ్వరులను తయారు చేయడానికి ప్రభుత్వ చేయూత. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు & నైపుణ్యాభివృద్ధి. వీ-హబ్: దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రం ఆధ్వర్యంలో మహిళా ఆంట్రప్రెన్యూర్‌ల కోసం తొలి ఇన్‌క్యూబేటర్. T-IDEA & మహిళల నేతృత్వంలోని వ్యాపారాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు. పాడి, వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్ వంటి రంగాలకు మద్దతు. ఐటీ, సౌరశక్తి, లాజిస్టిక్స్ వంటి రంగాలలో మహిళలను ప్రోత్సహించడం. దేశ వ్యాప్తంగా మహిళా ఆంట్రప్రెన్యూర్‌లకు COWE మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తుండడం అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను బలపరిచేందుకు, రాష్ట్ర ఆర్థిక పురోగతికి నాయకత్వం వహించేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది’ అని కొండా సురేఖ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment