మహిళా ఆర్ధిక స్వావలంబన కోసం నాట్స్ ప్రయత్నం | Details About NATS Awareness webinar on Financial Literacy for Women | Sakshi
Sakshi News home page

మహిళా ఆర్ధిక స్వావలంబన కోసం నాట్స్ ప్రయత్నం

Feb 3 2022 2:22 PM | Updated on Feb 3 2022 2:30 PM

 Details About NATS Awareness webinar on Financial Literacy for Women  - Sakshi

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మహిళా సాధికారితపై దృష్టి సారించింది. మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించడం కుటుంబానికి ఎంతో కీలకమనే విషయాన్ని మహిళలకు వివరిస్తోంది. అందులో భాగంగా నారీమణుల్లో ఆర్థిక చైతన్యం తీసుకొచ్చేందుకు వరుస కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా ఈ అంశంపై 2022 జనవరి 29న ఆన్‌లైన్ వెబినార్ నిర్వహించారు.  ముఖ్యంగా వివాహితలు పెళ్లయిన దగ్గర నుంచే ఎలా ఆర్థిక అప్రమత్తత కలిగి ఉండాలి. ప్రమాదవశాత్తుఇంటి పెద్ద దిక్కును కోల్పోతే.. కుటుంబాన్ని ఆర్థికంగా ఎలా సురక్షితంగా ఉంచుకోవాలనే అంశాలపై చర్చించారు. ఆర్థికపరమైన అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. 

ఆర్థిక భద్రత గురించి  మహిళలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు పాటించాల్సిన పద్దతులపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్ అరుణ గంటి అన్నారు. మహిళలను ఆర్ధిక అంశాలపై చైతన్యపరిచేందుకు వరుస వెబినార్స్‌తో నాట్స్ తనవంతు కృషిచేస్తుందని ఆమె తెలిపారు. వందల మంది తెలుగు మహిళలు ఆన్‌లైన్ ద్వారా ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. ఆర్ధికఅంశాలపై తమకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకునేలా చేసినందుకు నాట్స్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాధవి దొడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించగా జయశ్రీ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహణలో కీలకంగా వ్యవహరించిన పెద్దిభొట్ల, లక్ష్మి బొజ్జ, జ్యోతి వనం, శృతి అక్కినేనిలను నాట్స్ అధ్యక్షుడు శేఖర్ అన్నే ప్రత్యేకంగా అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement