రేయనా బర్నావీ సౌదీ అరేబియా ఫస్ట్ ఉమెన్ ఆస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించ నుంది. మహిళాసాధికారత విషయంలో సౌదీ మరో అడుగు ముందుకు వేసింది..
గత వైఖరికి భిన్నంగా సౌదీ అరేబియా మహిళా సాధికారత, హక్కులకు పెద్ద పీట వేస్తోంది. తనను తాను కొత్తగా నిర్వచించుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు... మేల్ గార్డియన్ లేకుండా మహిళలు డ్రైవింగ్ చేయకూడదు, విదేశాలకు వెళ్లకూడదు అనే ఆంక్షలు ఉన్న దేశంలో ఎంతో మార్పు వచ్చింది.
దీనికి బలమైన ఉదాహరణ... సౌదీ అరేబియా తొలిసారిగా రేయనా బర్నావీ అనే మహిళను స్పేస్ మిషన్ ఎఎక్స్–2కు ఎంపిక చేయడం. సౌదీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్‌ప్రోగ్రాం, ప్రైవెట్ స్పేస్ కంపెనీ ఆక్సియం స్పేస్ (యూఎస్) భాగస్వామ్యంతో చేపట్టిన స్పేస్ మిషన్‌లో 33 సంవత్సరాల బర్నావీ సౌదీ అరేబియా ఫస్ట్ ఉమెన్ ఆస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించబోతోంది.
న్యూజిలాండ్‌లోని ఒటాగో యూనివర్శిటీ నుంచి బయోమెడికల్ సైన్స్‌లో పట్టాపుచ్చుకున్న బర్నావీ రియాద్‌లోని అల్‌ఫైసల్ యూనివర్శిటీలో బయోమెడికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. క్యాన్సర్ స్టెమ్ సెల్ రిసెర్చ్‌లో తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది. కొన్ని నెలల్లో ్ర΄ారంభం కానున్న తమ స్పేస్‌మిషన్‌ను దృష్టిలో పెట్టుకొని సౌదీ స్పేస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఒక వీడియో విడుదల చేసింది. భావుకత నిండిన ఆ వీడియోలో కొన్ని వాక్యాలు ఇలా ఉంటాయి...
సగర్వంగా తల పైకెత్తి చూడు/ ఆకాశంలో అసంఖ్యాకమైన నక్షత్రాలు కనిపిస్తాయి వాటిని పలకరించాలి/ పరిచయం చేసుకోవాలి/ పేరు పెట్టాలి/ నక్షత్రాలు నీ స్నేహితులు కావాలి అంతరిక్షం అనేది నీ అపురూపమైన ఇష్టం కావాలి/ ఆకాశ మార్గంలో నీదైన దారి వెదుక్కో అధ్యయనం చేయాలి/పరిశోధించాలి/ కొత్త విషయాలను ఆవిష్కరించాలి/నీ తరానికి స్ఫూర్తిగా నిలవాలి నీ మార్గంలో నువ్వు ఒంటరివి కావు/ నీ పూర్వీకులెందరో ఆ బాటలో నడిచారు/ గొప్ప విజయాలు సాధించారు/ నీ కలను ఆవిష్కరించే సమయం వచ్చింది ఆ కలకు రెక్కలు ఇచ్చే సమయం వచ్చింది... లెట్ ఇట్ ఫ్లై! వీడియో తొలి దృశ్యంలో ఒక మహిళ కనిపించడం యాదృచ్ఛికం కాక΄ోవచ్చు. అంతరిక్ష విషయాల్లో, విజయాల్లో మహిళలు ముందుండబోతున్నారు అని ప్రతీకాత్మకంగా చెప్పడం కావచ్చు!
Comments
Please login to add a commentAdd a comment