సౌదీ అరేబియాలో మహిళల పట్ల ఎలాంటి ఆంక్షలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చోట ఇటీవల పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకు కారణం ఆ దేశ ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ అని చెప్పొచ్చు. ఇటీవల ఆయన హాయాంలోనే సంచలన నిర్ణయాలు ఎక్కువుగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సౌదీ దేశ చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. వాటన్నింటకంటే మునుపే ఓ మహిళ సౌదీ అతి పెద్ద స్థాక్ మార్కెట్‌కి చైర్మన్ అయ్యి సంచలనానికి తెరతీసింది. ఏకంగా యావత్తు ప్రపంచం ఆమె విజయాన్ని చూసి విస్తుపోయింది. ఇంతకీ ఎవరీమె అంటే..
44 ఏళ్ల సారా అల్-సుహైమి సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్‌గా అత్యున్నత పదవిని అలంకరించిన తొలి సౌదీ మహిళగా చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఆర్థిక ప్రపంచంలో రికార్డు సృష్టించింది. ఆమెను చూస్తే.. సౌదీ కార్యాలయాల్లో మహిళల పాత్రలు దినదినాభివృద్ధి చెందుతున్నాయోమో! అనిపిస్తుంది. ఇక ఆమె ఎడ్యుకేషన్ పరంగా..సౌద్ విశ్వవిద్యాలయంలో అకౌంటింగ్ ప్రోగ్రామ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. ఆమె బ్యాంకింగ్ కుటుంబానికి చెందినది. ఎందుకంటే ఆమె తండ్రి జమ్మాజ్ అల్ సుహైమి గల్ఫ్ బ్యాంక్, సౌదీ అరేబియా క్యాపిటల్ మార్కెట్స్ అథారిటీలో ఉన్నత పదవులును అలంకరించారు.
ఇక సారా కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడిచింది. అత్యున్నత మార్కులతో గ్రాడ్యుయేఏషన్ పూర్తి చేసి అద్భతమైన కెరీర్‌కు మార్గం సుగమం చేసుకుంది. సారా తొలుత ఎన్‌సీబీ క్యాపిటల్ చీప్ ఎగ్జిక్యూటివ్‌గా అయ్యినప్పుడే ఆమె కెరీర్ అంచెలంచెలుగా పెరగడం ప్రారంభించింది. ఇది సౌదీ అరేబియాలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా ఏర్పడటానికి సాంబాతో విలీనమయ్యింది. ఇక ప్రస్తుతం సారా సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌కే చైర్మన్ అయిన తొలి మహిళగా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
ఆమె విజయం ఒక్క సౌదీలోనే గాదు యావత్తు ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. అంతేగాదు ఆమె ఎన్‌సీబీ క్యాపిటల్ ఫైనాన్షియల్ ల్యాండ్‌స్కేప్‌లో కీలక పాత్ర పోషించింది. వినూత్న పెట్టుబడి వ్యూహాలను పరిచయం చేసింది. దీంతో అత్యధిక మంది క్లయింట్‌ల ఆకర్షించేలా మంచి ఫలితాలను అందుకుంది. అంతేగాదు సారా ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది.
On the occasion of #InternationalWomensDay, Sarah al-Suhaimi, the Arab world’s first female stock exchange head, rang the opening bell of Tadawul, the largest financial market in the region.https://t.co/fo6MckbJ2M pic.twitter.com/s22FYn8ZZe
— Al Arabiya English (@AlArabiya_Eng) March 8, 2019
(చదవండి: యూఎస్‌లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా 75 వేల కోట్లు..!)
Comments
Please login to add a commentAdd a comment