గువాహటి: దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం తపిస్తోందని, అణగారిన, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అస్సాం రాష్ట్రం బార్పేట జిల్లాలో శుక్రవారం ‘కృష్ణగురు ఎక్‌నామ్ అఖండ్ కీర్తన్’ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.
‘‘మహిళల ఆదాయం పెరిగితే సాధికారత సాధ్యం. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్‌తో వారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అనుసంధానం, అభివృద్ధి విషయంలో ఈశాన్య రాష్ట్రాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ ప్రాంతంపై ఎనిమిదేళ్లుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఈశాన్య ప్రజల సంప్రదాయ నైపుణ్యాలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. వారి ఉత్పత్తులను ప్రదర్శించుకోవడానికి యూనిటీ మాల్ ఏర్పాట్లు చేస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment