Womens development
-
వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యం
గువాహటి: దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం తపిస్తోందని, అణగారిన, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అస్సాం రాష్ట్రం బార్పేట జిల్లాలో శుక్రవారం ‘కృష్ణగురు ఎక్నామ్ అఖండ్ కీర్తన్’ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘మహిళల ఆదాయం పెరిగితే సాధికారత సాధ్యం. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్తో వారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అనుసంధానం, అభివృద్ధి విషయంలో ఈశాన్య రాష్ట్రాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ ప్రాంతంపై ఎనిమిదేళ్లుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఈశాన్య ప్రజల సంప్రదాయ నైపుణ్యాలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. వారి ఉత్పత్తులను ప్రదర్శించుకోవడానికి యూనిటీ మాల్ ఏర్పాట్లు చేస్తాం’’ అన్నారు. -
దేశానికి ఏపీ మార్గదర్శకం
తిరుపతి అర్బన్: దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోందని జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధి శ్రేయమంజుధా అన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం బుధవారం తిరుపతి డీఆర్డీఏ కార్యాలయంలో పొదుపు సహకార సంఘాలకు చెందిన ఎస్టీ మహిళలతో సమావేశమైంది. ఈ సందర్భంగా శ్రేయమంజుధా మాట్లాడుతూ.. తాము దేశంలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించామని, చాలాచోట్ల మహిళా సంఘాలు బ్యాంక్ రుణాలు తీసుకోవడంతోనే సంఘాల పని పూర్తయినట్లు భావిస్తున్నాయని చెప్పారు. ఏపీలో మహిళలకు బ్యాంక్ రుణాలతోపాటు వైఎస్సార్ బీమా, జగనన్న తోడు, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత వంటి పథకాలు వర్తింపచేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల ఆర్థికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. పొదుపు సంఘాల ద్వారా వచ్చే రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వచ్చే నగదుతో మహిళలు వ్యాపారులుగా మారడం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఏపీ మహిళాభివృద్ధికి, వారి జీవనోపాధికి తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి నివేదించి ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తే బాగుంటుందనే సూచనలు సైతం చేస్తామని చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధులు కరిమైనాన్, మాన్‌కే ధవే మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. డీఆర్డీఏ జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభావతి, డీఆర్డీఏ అధికారి ధనుంజయరెడ్డి ఉన్నారు. -
'మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే'
సాక్షి, తాడేపల్లి : పాదయాత్ర ద్వారా మహిళల కష్టాలు తెలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. తాడేపల్లిలో సుచరిత గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు వైఎస్సార్ చేయూత పథకంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. 23 లక్షల మంది మహిళకు వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ది చేకూరిందన్నారు. హోం మంత్రి మాట్లాడుతూ..' అమూల్, రిలియన్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్దికంగా స్థిరపడ వచ్చు. వైఎస్సార్ చేయూత పథకంపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం తగదు.మహిళను మోసం చేసిన ఘనత చంద్రబాబుది. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళను మోసం చేశారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో జగన్ మూడవ స్థానం సాధించడం రాష్ట్రానికి గౌరవ ప్రదంగా భావిస్తున్నాము.' అంటూ తెలిపారు. (చంద్రబాబు రహస్య ఎజెండాను హర్షకుమార్..) మహిళలు ఆర్దికంగా స్థిరపడ్డడం కోసం సీఎం వైఎస్ జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళకు సున్నా వడ్డీ పథకం అమలు చేశారు.డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. అమ్మఒడి, చేయుత ద్వారా మహిళకు ఎంతో మేలు జరుగుతుంది.మహిళ పక్షపాతిగా సీఎం జగన్.. నామినేషన్ పదవులు పనుల్లో 50 శాతం మహిళలకు కల్పించారు. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మహిళకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఉనికి కోల్పోతామే భయంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.టీడీపీ మహిళకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయింది. దళితుల పై దాడి జరిగిన వెంటనే మా ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంది. కానీ టీడీపీ మాత్రం కుల రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది' అంటూ సుచరిత విమర్శించారు. -
సమర్థ నేతలుగా ఎదగండి!
* సాంకేతికాంశాల్లో పట్టు సాధించండి * మహిళా ప్రజా ప్రతినిధులకు ప్రధాని పిలుపు న్యూఢిల్లీ: ‘మహిళాభివృద్ధి గురించి మాత్రమే కాదు.. అంతకుమించి మహిళల నేతృత్వంలో అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని ప్రధానిమోదీ ఉద్ఘాటించారు. చట్టసభల్లోని మహిళా ప్రతినిధుల జాతీయ సదస్సునుద్దేశించి ఆదివారం మోదీ ప్రసంగించారు. ‘మిమ్మల్ని మీరు సమర్ధవంతంగా తీర్చిదిద్దుకోండి. సాంకేతిక అంశాల్లో సాధికారత సాధించండి. అన్ని అంశాలపై పట్టు సాధించడం ద్వారా మీ నాయకత్వాన్ని పటిష్టం చేసుకోండి. మీ ప్రాంతంలో మీ నాయకత్వానికి సంబంధించి మీదైన ముద్ర వేయండి. మీ పనితీరు, ఆలోచన ప్రజల్లో స్థిరపడితే మీ ఆలోచనలను ప్రజలు ఆమోదించడం మొదలెడతారు.’ అంటూ మహిళా ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అయితే, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశంపై మాట్లాడలేదు. పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం కనీసం 12% కూడా లేకపోవడంపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్చంధంగా మహిళలకు అధిక సంఖ్యల సీట్లు కేటాయించాలని ఉపరాష్ట్రపతి సైతం రాజకీయ పార్టీలకు విజ్ఞప్తిచేశారు. ప్రధాని మోదీ మాత్రం మహిళలకు రిజర్వేషన్ల అంశం జోలికి పోకుండా.. వ్యక్తిత్వాన్ని, పనితీరును మార్చుకోవాలంటూ మహిళలకు సూచించడంపై దృష్టి పెట్టారు. ‘క్షమ, ఓపిక లాంటివి స్త్రీలకు సహజ లక్షణాలు. భర్త, పిల్లల కోసం వారెంతో త్యాగం చేస్తార’ని వ్యాఖ్యానించారు. వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయని, కేవలం వ్యవస్థలో వచ్చే మార్పు సరిపోదని పేర్కొన్నారు. ఈర్ష్య.. ఆత్మన్యూనత వద్దు కింది స్థాయి నుంచి మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, పోటీకి వస్తారేమోనన్న ఈర్ష్య భావనలను వదలుకోవాలని మహిళా ప్రతినిధులకు ప్రధాని హితవు చెప్పారు. ‘రాజకీయాలంటేనే పోటీ. ఈ పోటీలో అసూయ ఆధిపత్యం పెరిగితే మీరు అభివృద్ధి చెందలేరు. నా రంగంలోకి మరింత సమర్ధులైన వారు వస్తే నా పరిస్థితి ఏంటి? అనే ఆలోచన కానీ, నా ప్రాంతంలో మరొకరిని ఎదగనివ్వననే ఆలోచన కానీ వద్దు. అలా కాకుండా, ఇతర మహిళలనూ ప్రోత్సహిస్తే మరింత పైకి ఎదగగలమనే భావనను పెంపొందించుకోండి. దానిద్వారా పిరమిడ్ తరహా నాయకత్వ నిర్మాణం రూపొందుతుంది. మీరు మరింత పైకి ఎదుగుతారు’ అని వివరించారు. ఆత్మన్యూనత వల్ల ఏమీ సాధించలేరన్నారు. అవకాశం లభిస్తే.. పురుషుల కన్నా స్త్రీలే మెరుగైన పనితీరు చూపగలరన్నారు. ‘ఎంతోమంది విదేశాంగ మంత్రులుగా పనిచేశారు. వారి పేర్లు కూడా మనకు గుర్తులేవు. కానీ అత్యుత్తమ పనితీరుతో సుష్మాస్వరాజ్ విదేశాంగ మంత్రిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు’ అని తన మంత్రివర్గ సహచరురాలిని ప్రశంసించారు. ‘రువాండా పార్లమెంట్లో 65% మహిళలే, వారి నేతృత్వంలో ఆ దేశం గొప్పగా ముందుకు వెళ్తోంద’న్నారు. తన మంత్రివర్గంలోనూ మహిళలకు సముచిత ప్రాధాన్యతనిచ్చానన్నారు. పార్లమెంటు ఉభయసభల్లోని మహిళా ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఒక ఈ- వేదికను ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని సూచించారు. ‘మార్పులకు పురుషుల కన్నా మహిళలు త్వరగా అలవాటవుతారు. చదువుకోని మహిళలు కూడా వంటగదిలో కొత్త కొత్త సాంకేతికతలతో కూడిన వస్తువులను అలవోకగా ఉపయోగిస్తుంటారు. ఏకకాలంలో అనేక పనులు చేయగలగడం భారతీయ మహిళలకు కొట్టిన పిండి’ అని ప్రశంసల్లో ముంచెత్తారు. చట్టాల రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించాలని మహిళా ప్రజా ప్రతినిధులకు మోదీ పిలుపునిచ్చారు. ‘మహిళా సాధికారత అనే ఆలోచనే సరైంది కాదు. శక్తి లేనివారికి సాధికారత అవసరం. ఇప్పటికే శక్తిమంతమైన వారికి సాధికారత ఏంటి? మహిళలకు సాధికారత కల్పించేందుకు మగవాళ్లెవరు? సవాళ్లను ఎదుర్కొంటే తప్ప మన శక్తి మనకు తెలియదు’ అంటూ వారిలో స్ఫూర్తి నింపేందుకు ప్రధాని ప్రయత్నించారు. -
జగనన్నతోనే మహిళాభ్యున్నతి
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ‘మాట తప్పని.. మడమ తిప్పని’ వంశం నుంచి వచ్చిన వైఎస్. జగనమోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే మహిళాభ్యున్నతి జరుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పరిధిలోని పార్వతీపురం లెనిన్‌నగర్‌లో పార్టీ నాయకుడు మల్లం రవిచంద్రారెడ్డి, షాజు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. సాయంత్రం కొర్లగుంట మారుతీనగర్‌లో పార్టీ నాయకుడు పి. అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్‌కోసం మొదటి సంతకం చేశారన్నారు. ఆయన తనయుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సైతం అధికారంలోకి రాగానే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేటన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారని తెలిపారు. తొమ్మిదేళ్ల చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలు పడరాని కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీ బీజేపీ, నరహంతకుడు నరేంద్రమోడి అని అభివర్ణించిన చంద్రబాబు నేడు అధికారం కోసం ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుని తన దిగజారుడు రాజకీయాలు చాటుకున్నారన్నారు. అన్నదమ్ముల్లా కలసికట్టుగా ఉన్న తెలుగుజాతి ముక్కలు కావడానికి ముఖ్యకారకులు కిరణ్, చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గులు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగేందుకు సిగ్గుపడాలన్నారు. కేవలం జగనన్న అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలతో పాటు ముఖ్యంగా తాము అభివృద్ధి చెందుతామని మహిళలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. రాజన్న రాజ్యం తిరిగి జగనన్నతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే. బాబు, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, కట్టా జయరాంయాదవ్, పుల్లయ్య, జ్యోతిప్రకాష్, తాల్లూరి ప్రసాద్, దేవరాజులురెడ్డి, మోహన, భగీరథరెడ్డి, ముత్తువల్లి రసూల్, గోపాల్‌రెడ్డి, పీపీ చావడి రఫీ, బాల మునిరెడ్డి, నాగేంద్ర, పుణీత, శ్యామల, శాంతారెడ్డి, కృష్ణవేణమ్మ పాల్గొన్నారు. -
చెల్లెకు శ్రీరామ‘లక్ష’
అన్న అభయహస్తం: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అక్షరాలా మహిళా పక్షపాతి. వారు మహరాణుల్లా జీవించాలని ఆయన అనునిత్యం తపించారు. మహిళా సాధికారత కోసం అహర్నిశలూ పాటుపడ్డారు. వారు తమ కాళ్లపై తాము నిలబడటమే గాక సమాజాన్ని కూడా నడిపించాలని వైఎస్ నిత్యం చెప్పేవారు. సామాజికంగానే గాక ఆర్థికంగా కూడా పురుషుల కంటే మెరుగ్గా, గౌరవప్రదంగా మహిళలు జీవనం కొనసాగించాలని అభిలషించేవారు. అందుకే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చివరిదాకా మహిళా పురోగతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ క్రమంలో దేశంలోనే మొదటిసారిగా పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. తద్వారా వారిపై వడ్డీ భారాన్ని తగ్గించడమేగాక రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలను లక్షాధికారులుగా మార్చారు. వారి జీవితాలతో పాటు వారి కుటుంబాల్లో కూడా వెలుగులు నింపారు. అలా తెలుగు మహిళల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్. అంతేనా...? జీవితపు మలి సంధ్యలో కూడా మహిళలకు ఎక్కడా తలొంచుకునే పరిస్థితి రాకుండా ‘అభయహస్తం’ అందించారు. ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో వారికి ఆర్థికంగా ఆసరా కల్పించారు. కానీ వైఎస్ తదనంతర పాలకులు మహిళల పట్ల అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు. వైఎస్ ప్రారంభించిన మిగతా అన్ని పథకాల మాదిరిగానే పావలా వడ్డీనీ, అభయ హస్తాన్నీ ని‘బంధనాల్లో’ ఇరికించి దాదాపుగా అటకెక్కించారు. మహిళల కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క మహిళ తన భర్తతో సమానంగా సంపాదించగలిగినప్పుడే ఆమెకు మంచి గౌరవం లభిస్తుంది. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేసేవరకు నిద్రపోను నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు - దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఓటే సాధికారతకు బాట నాకు ఈసారే ఓటు హక్కు వచ్చింది. తప్పకుండా ఓటేస్తాను. మహిళలు తవు హక్కులను పూర్తిగా సాధించుకోవాలంటే తవు సవుస్యలు తెలిసిన వారిని, వాటిని పరిష్కరించ గలవారినే ఎన్నుకోవాలి. అలా ఎన్నుకునేందుకు వున చేతిలో ఉన్న అతి శక్తివుంతమైన ఆయుుధం ఓటు. అందుకే దాన్ని ఆచితూచి, పూర్తి విచక్షణతో ఉపయోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకోవడం వునందరి బాధ్యత. వునం వేసే ఓటే వుహిళా సాధికారతకు బాటలు పరుస్తుందని గుర్తుంచుకోవాలి - పి.వి.సింధు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సమ ప్రాధాన్యం మా హక్కు చట్టసభల్లో సమ ప్రాధాన్యం మహిళల ప్రజాస్వామిక హక్కు. వారికి అన్ని రంగాల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే. వుహిళా బిల్లుతో సంబంధం లేకుండా పార్టీలన్నీ వారికి వుూడో వంతు సీట్లు కేటారుుంచాలి. - సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం సాధించుకోవాలి మహిళలు ఆదేశించే స్థారుుకి ఎదగాలి. రాజ్యాధికారంపై ఆసక్తి కనబరచాలి. ప్రవుుఖ అంతర్జాతీయు కంపెనీలకు సీఈవోలు వుహిళలే. బాధ్యతల నిర్వహణలో పురుషుల కంటే వుహిళలు ఏ వూత్రం తీసిపోరు. - సౌదామిని, పారిశ్రామికవేత్త పురుషాధిక్యత పోవాలి చట్టసభలకు ఎన్నికవుతున్న వుహిళల సంఖ్యే పరిమితవుంటే, వారి పేరిట భర్తో ఇంకొకరో అధికారాన్ని చలారుుస్తుండటం వురింత బాధాకరం. రాజకీయూలు వుగవారికి వూత్రమేననే ధోరణి వుుందు పోవాలి. - వేదవాణి, సీనియుర్ న్యాయువాది