అన్న అభయహస్తం: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అక్షరాలా మహిళా పక్షపాతి. వారు మహరాణుల్లా జీవించాలని ఆయన అనునిత్యం తపించారు. మహిళా సాధికారత కోసం అహర్నిశలూ పాటుపడ్డారు. వారు తమ కాళ్లపై తాము నిలబడటమే గాక సమాజాన్ని కూడా నడిపించాలని వైఎస్ నిత్యం చెప్పేవారు. సామాజికంగానే గాక ఆర్థికంగా కూడా పురుషుల కంటే మెరుగ్గా, గౌరవప్రదంగా మహిళలు జీవనం కొనసాగించాలని అభిలషించేవారు. అందుకే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చివరిదాకా మహిళా పురోగతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ క్రమంలో దేశంలోనే మొదటిసారిగా పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు.
తద్వారా వారిపై వడ్డీ భారాన్ని తగ్గించడమేగాక రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలను లక్షాధికారులుగా మార్చారు. వారి జీవితాలతో పాటు వారి కుటుంబాల్లో కూడా వెలుగులు నింపారు. అలా తెలుగు మహిళల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్. అంతేనా...? జీవితపు మలి సంధ్యలో కూడా మహిళలకు ఎక్కడా తలొంచుకునే పరిస్థితి రాకుండా ‘అభయహస్తం’ అందించారు. ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో వారికి ఆర్థికంగా ఆసరా కల్పించారు. కానీ వైఎస్ తదనంతర పాలకులు మహిళల పట్ల అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు. వైఎస్ ప్రారంభించిన మిగతా అన్ని పథకాల మాదిరిగానే పావలా వడ్డీనీ, అభయ హస్తాన్నీ ని‘బంధనాల్లో’ ఇరికించి దాదాపుగా అటకెక్కించారు.
మహిళల కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క మహిళ తన భర్తతో సమానంగా సంపాదించగలిగినప్పుడే ఆమెకు మంచి గౌరవం లభిస్తుంది. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేసేవరకు నిద్రపోను నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు
- దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి
ఓటే సాధికారతకు బాట
నాకు ఈసారే ఓటు హక్కు వచ్చింది. తప్పకుండా ఓటేస్తాను. మహిళలు తవు హక్కులను పూర్తిగా సాధించుకోవాలంటే తవు సవుస్యలు తెలిసిన వారిని, వాటిని పరిష్కరించ గలవారినే ఎన్నుకోవాలి. అలా ఎన్నుకునేందుకు వున చేతిలో ఉన్న అతి శక్తివుంతమైన ఆయుుధం ఓటు. అందుకే దాన్ని ఆచితూచి, పూర్తి విచక్షణతో ఉపయోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకోవడం వునందరి బాధ్యత. వునం వేసే ఓటే వుహిళా సాధికారతకు బాటలు పరుస్తుందని గుర్తుంచుకోవాలి
- పి.వి.సింధు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
సమ ప్రాధాన్యం మా హక్కు
చట్టసభల్లో సమ ప్రాధాన్యం మహిళల ప్రజాస్వామిక హక్కు. వారికి అన్ని రంగాల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే. వుహిళా బిల్లుతో సంబంధం లేకుండా పార్టీలన్నీ వారికి వుూడో వంతు సీట్లు కేటారుుంచాలి.
- సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం
సాధించుకోవాలి
మహిళలు ఆదేశించే స్థారుుకి ఎదగాలి. రాజ్యాధికారంపై ఆసక్తి కనబరచాలి. ప్రవుుఖ అంతర్జాతీయు కంపెనీలకు సీఈవోలు వుహిళలే. బాధ్యతల నిర్వహణలో పురుషుల కంటే వుహిళలు ఏ వూత్రం తీసిపోరు.
- సౌదామిని, పారిశ్రామికవేత్త
పురుషాధిక్యత పోవాలి
చట్టసభలకు ఎన్నికవుతున్న వుహిళల సంఖ్యే పరిమితవుంటే, వారి పేరిట భర్తో ఇంకొకరో అధికారాన్ని చలారుుస్తుండటం వురింత బాధాకరం. రాజకీయూలు వుగవారికి వూత్రమేననే ధోరణి వుుందు పోవాలి.
- వేదవాణి, సీనియుర్ న్యాయువాది