
సాక్షి, హైదరాబాద్: తాను జన్మించిన ఆంధ్రప్రదేశ్ సాధించిన అభివృద్ధి తనకెంతో సంతృప్తినిస్తోందని యూఎస్ ఎయిడ్ మిషన్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్) డైరెక్టర్ వీణారెడ్డి అన్నారు. ఏపీ మరింత అభివృద్ధి సాధించేందుకు తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో జరిగిన ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశంలో వీణారెడ్డి పాల్గొన్నారు.
చదవండి: ‘క్రిస్ సిటీ’ తొలి దశకు టెండర్లు
కాగా, మంగళవారం విశాఖలో ‘అమెరికన్ కార్నర్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరవుతారు. ఇందులో అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మ్యాన్, తదితరులు పాల్గొంటారు. గాల్లోని తేమను నీరుగా మార్చే యంత్రం ‘వాటర్ ఫ్రమ్ ఎయిర్’ కియోస్క్‌ను సందర్శిస్తారు.