యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) ఇండియా మిషన్ డైరెక్టర్ 'వీణా రెడ్డి' హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ క్వాల్‌కమ్ ఇండియాకు సంబంధించిన ఓఆర్ఏఎన్ రీసెర్చ్ ల్యాబ్‌లను సందర్శించారు. ఇక్కడ టెలికమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ముందుకు సాగుతుందో గమనించారు.
యూఎస్ఏఐడీ 5జీ అండ్ ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌లతో సహా కొత్త వైర్‌లెస్ టెక్నాలజీలను పరీక్షించడంలో భారతీయ టెలికమ్యూనికేషన్ కంపెనీలకు కొన్ని సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది టెలికమ్యూనికేషన్ హార్డ్‌వేర్ అమెరికన్ సరఫరాదారు అయిన 'క్వాల్‌కమ్ టెక్నాలజీ'.
క్వాల్కమ్ టెక్నాలజీ సహకారంతో.. భారతీయ టెలికామ్ రంగం కొత్త ఆవిష్కరణలకు పునాది వేస్తుంది, తద్వారా అనేక గ్లోబల్ అప్లికేషన్‌ల పరిష్కారాలు సాధ్యమవుతాయి. ఈ సందర్భంగా వీణా రెడ్డి మాట్లాడుతూ.. జీ20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా చెప్పినట్లుగానే యునైటెడ్ స్టేట్స్, భారతదేశంలో విశ్వసనీయ టెలికమ్యూనికేషన్స్ వృద్ధి చెందుతాయని అన్నారు.
డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక శ్రేయస్సును పెంచడమే ప్రధాన లక్ష్యం. భారతదేశంలో సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైర్‌లెస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు మెరుగుపరచడానికి మేము ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని వీణా రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment