అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా ప్రజలు రిపబ్లిక్ పార్టీ వైపు మొగ్గు చూపటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది. ఇక.. ట్రంప్ సాధించిన భారీ విజయంపై భారత ప్రధాని మోదీతో సహా పలు దేశాధినేతలు, దేశాలు స్పందిస్తూ.. ఆయన అభినందనలు తెలియజేస్తున్నాయి. తాజాగా చైనా సైతం డొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందించింది. అయితే.. ట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై డ్రాగన్ దేశం స్పందించింది.
‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజల ఎంపిక నిర్ణయాన్ని గౌరవిస్తాం. అధ్యక్ష ఎన్నికలు అమెరికా అంతర్గత వ్యవహారం. అయితే.. అమెరికా పట్ల చైనా విధానం స్థిరంగా ఉంది. పరస్పర గౌరవం, శాంతియుత జీవనం, సహకారం వంటి సూత్రాలకు అనుగుణంగా చైనా-యూఎస్ సంబంధాలను కొనసాగిస్తాం’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. మరోవైపు.. చైనాపై కఠినంగా వ్యహరిస్తారనే ముద్ర ఉన్న డొనాల్డ్ ట్రంప్.. రానున్ను రోజుల్లో డ్రాగన్ దేశంతో సంబంధాలు ఎలా కొనసాగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment