అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైపోయింది. దీంతో రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కేందుకు ఆయన సిద్ధమయ్యారు.
అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చారిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించిన నా మిత్రుడు ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘మీ గత పదవీకాలంలో సాధించిన విజయాల మాదిరి.. ఈసారి కూడా భారత్, అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మా సహకారాన్ని పునరుద్దరించడానికి ఎదురుచూస్తున్నాను. ఇద్దరం కలిసి ఇరు దేశాల ప్రజల అభివృద్ధికి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి కృషి చేద్దాం’ అని పేర్కొన్నారు.
Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY
— Narendra Modi (@narendramodi) November 6, 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శుభాకాంక్షలు తెలిపారు.‘ గొప్ప పునరాగమనంతో చరిత్ర సృష్టించినందుకు ప్రియమైన డోనాల్డ్, మెలానియా ట్రంప్‌కు అభినందనలు. యూఎస్ వైట్ హౌస్‌కు మీరు తిరిగి రావడం అమెరికాకు కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ఇజ్రాయెల్-యూఎస్ మధ్య శాశ్వతమైన మైత్రిని పునరుద్ఘాటిస్తుంది. ఇది నిజమైన స్నేహానికి అందిన భారీ విజయం’ అని కొనియాడారు.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో డోనాల్డ్ ట్రంప్‌కు తన అభినందనలు చెప్పారు. యూఎస్‌తో కలిసి పనిచేసేందుకు, తమ సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు. రాబోయే నాలుగు సంవత్సరాలు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పరస్పర గౌరవం, ఆశయంతో ఇరు దేశాల శాంతి, శ్రేయస్సు కోసం కృషి చేసేందుకు ఎదురు చూస్తున్నా’ అని తెలిపారు.
A nome mio e del Governo italiano, le più sincere congratulazioni al Presidente eletto degli Stati Uniti, Donald #Trump.
Italia e Stati Uniti sono Nazioni “sorelle”, legate da un’alleanza incrollabile, valori comuni e una storica amicizia.
È un legame strategico, che sono certa…
— Giorgia Meloni (@GiorgiaMeloni) November 6, 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌ను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అభినందించారు. తన స్నేహితుడి గెలుపుతో టర్కీ-యూఎస్ సంబంధాలు బలపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ, ప్రపంచ సంక్షోభాలు, యుద్దాలు, ముఖ్యంగా పాలస్తీనా సమస్య, రాష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Amerika Birleşik Devletleri’nde yapılan başkanlık seçimini büyük bir mücadelenin ardından kazanarak yeniden ABD Başkanı seçilen dostum Donald Trump’ı tebrik ediyorum.
Amerikan halkının seçimiyle başlayacak olan bu yeni dönemde, Türkiye-ABD ilişkilerinin güçlenmesini, Filistin…
— Recep Tayyip Erdoğan (@RTErdogan) November 6, 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అభినందించారు. గత సెప్టెంబర్‌లో ట్రంప్‌ను కలుసుకున్న సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఉక్రెయిన్-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం, విజయ ప్రణాళిక,ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ముగింపు పలికే మార్గాల గురించి ఇద్దరూ చర్చించినట్లు తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌ను వ్యక్తిగతంగా అభినందించడానికి, యూఎస్‌తో ఉక్రెయిన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మార్గాలను చర్చించడానికి తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు.
Congratulations to @realDonaldTrump on his impressive election victory!
I recall our great meeting with President Trump back in September, when we discussed in detail the Ukraine-U.S. strategic partnership, the Victory Plan, and ways to put an end to Russian aggression against…
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) November 6, 2024
కాగా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజార్టీ మార్కు 270. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం అధికారాన్ని చేపట్టడానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్‌కు 266 ట్రంప్ అతి చేరువలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 224 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. ట్రంప్ విజయంతో ఓ వైపు రిపబ్లికన్లు సంబరాలు మొదలు పెట్టగా.. కమలాహారిస్ మాత్రం నేటి తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment