ట్రంప్‌ విజయంపై కమలా హారిస్‌, జోబైడెన్‌ తొలి స్పందన.. | Kamala Harris And Joe Biden Congratulate Donald Trump For Victory In US Presidential Elections 2024, See Details | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ విజయంపై కమలా హారిస్‌, జోబైడెన్‌ తొలి స్పందన..

Published Thu, Nov 7 2024 8:09 AM | Last Updated on Thu, Nov 7 2024 9:34 AM

Kamala Harris and Joe Biden Congratulates Donald Trump for Victory

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించారు.

డొనాల్డ్ ట్రంప్ గెలుపుపై ​​వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ప్రెసిడెంట్ జో బైడెన్‌ల తొలి ప్రకటనలు  మీడియాకు అందాయి. దానిలో కమలా హారిస్.. ఓటర్లు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితం మనం కోరుకున్నది కాదని అమె అన్నారు. మనం నిరంతరం పోరాడుతూనే ఉందాం. ఈ ఎన్నికల ఫలితాలను మనం అంగీకరించాల్సిందేనన్నారు. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను తాను కలుసుకుని, అభినందనలు తెలిపానని కమలా హారిస్‌  పేర్కొన్నారు.

అధికార మార్పిడిలో ట్రంప్‌కు, ఆయన బృందానికి సహకరిస్తామని, ఇదంతా శాంతియుతంగా జరిగేలా చూస్తామని కమలా హారిస్‌  పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఒక ప్రకటనలో కమలా హారిస్‌ చిత్తశుద్ధి మెచ్చుకోదగినదని అన్నారు. ఆమె అమెరికన్లకు ఛాంపియన్‌గా కొనసాగుతారన్నారు. జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. కాగా ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్.. బైడెన్‌ అభినందనలను అందుకున్నారని, త్వరలోనే బైడెన్‌ను కలుసుకోవాలని  అనుకుంటున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: USA Presidential Election Results 2024: మహిళలకు మళ్లీ మొండిచెయ్యే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement