కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ మధ్య స్నేహంపై రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చెల్సియా వాటికి తెరదించారు. స్టెఫెన్ కొల్బర్ట్ లెట్ షో లో మాట్లాడిన ఆమె తమ మధ్య స్నేహం ఎక్కువ కాలం కొనసాగలేదని స్పష్టం చేశారు. చెల్సియా తల్లి హిల్లరీ క్లింటన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పలు సందర్భాల్లో వీరి స్నేహం గురించి పలు రకాల కథనాలు వెలువడ్డాయి. చెల్సియా స్పందిస్తూ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావితం చేస్తాయని, వాటికి వైట్ హౌస్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
గత నెలలో తన తండ్రి ట్రంప్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల గురించి ఇవాంకని ప్రశ్నించినప్పుడు, ఆమె స్పందిస్తూ.. ఇది తనను అడగాల్సిన ప్రశ్న కాదని సూచించారు. ఒక కూతురిని తన తండ్రి గురించి ఇలాంటి ప్రశ్నలు అడగటం సరికాదన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మీరు ఇదే ప్రశ్ననే ఇతరుల కుమార్తెలను అడుగుతారని అనుకోవడం లేదన్నారు. ఇవాంకను ట్రంప్ సలహాదారుగా నియమించటం, ఇతర దేశాధినేతలతో సమావేశమైనప్పుడు అధిక ప్రధాన్యత ఇవ్వడాన్ని మీడియా విమర్శించింది. ఇప్పుడు చెల్సియా క్లింటన్ స్పందించిన తీరు చూస్తుంటే ఈ పరిణామాల మీదే ఆమె స్పందించినట్లు అర్థమవుతుంది. ఇవాంక మీడియాతో వ్యవహరించిన తీరుపైన చెల్సియా క్లింటన్ ఈ విధమైన వ్యాఖ్యాలు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment