అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ నుంచి భారీ షాక్ తగిలింది. సుమారు 200 మంది రిపబ్లికన్లు, ఉపాధ్యక్షురాలు.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ఇస్తూ లేఖ రాశారు. వీళ్లంతా..
గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఆయనకు అనుకూలంగా పనిచేసినవాళ్లే కావడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.. అయితే ఇలా సొంత పార్టీ మద్దతు దారులే ట్రంప్‌ను వ్యతిరేకించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జార్జ్ డబ్ల్యు బుష్‌తో పాటు ఆయన మద్దతు దారులు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
తాజాగా మరోసారి ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్మానించారు. కమలా హారిస్‌కు మద్దతిస్తూ జార్జ్ డబ్ల్యూ బుష్ మద్దతు దారులు, రిపబ్లికన్ పార్టీ నేతలు రాసిన బహిరంగ లేఖలో..ట్రంప్ తిరిగి రెండోసారి ఎన్నుకుంటే దేశానికి విపత్తు అని తోటి రిపబ్లికన్‌లను హెచ్చరించారు. నిజమే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే ప్రజాస్వామ్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తారు ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు’అని లేఖలో పేర్కొన్నారు
అంతేకాదు రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు జార్జ్ హెచ్‌డబ్ల్యు బుష్ మద్దతుదాలందరం ఒక్కటవుతాం. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ ఓట్లు వేస్తున్నామని లేఖలో తెలిపారు.
కమలా హారిస్‌తో మాకు విధానపరమైన విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తూనే.. ఆమెకు ప్రత్యామ్నాయంగా, ఆ స్థాయిలో దేశానికి సేవ చేసే నేతలు లేరని స్పష్టం చేస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నేతలు.
Comments
Please login to add a commentAdd a comment