అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. రంగంలోకి ఎలాన్‌ మస్క్‌ | Elon Musk Meets Iran's UN Ambassador | Sakshi
Sakshi News home page

అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. రంగంలోకి ఎలాన్‌ మస్క్‌

Published Fri, Nov 15 2024 11:12 AM | Last Updated on Fri, Nov 15 2024 12:06 PM

Elon Musk Meets Iran's UN Ambassador

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ వడివడిగా పావులు కదుపుతున్నారు. ఇందుకు అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ని ట్రంప్‌ రంగంలోకి దించారు. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఐక్యరాజ్యసమితికి టెహ్రాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరవానితో ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. 

సోమవారం ఓ రహస్య ప్రాంతంలో ట్రంప్‌,ఇరవానిల మధ్య భేటీ జరిగిందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం తెలిపింది. రెండు నుంచి మూడుగంటల పాటు జరిగిన ఈ భేటీ సానుకూలంగా జరిగినట్లు వెల్లడించింది. అయితే ఈ భేటీపై అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు ఎలాంటి  అధికారిక ప్రకటన చేయలేదు. 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 1న  ఇరాన్‌పై ఇజ్రాయెల్  సైన్యం ప్రతీకార దాడులకు దిగింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుందని ఇరాన్ తెలిపింది. ఈ దాడి జరిగిన కొన్ని గంటలకే ఇరాన్  సుప్రీంనేత ఆయాతుల్లా అలీ ఖమేనీ ఎక్స్‌ వేదికగా ఇజ్రాయెల్‌కు హెచ్చరించారు. తమని తక్కువ అంచనావేయొద్దని,తమకు జరిగిన నష్టానికి ఇజ్రాయెల్‌కు బదులిస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరికలు జారీ చేసింది.

రంగంలోని ఎలాన్‌ మస్క్‌
అయితే ఖమేనీ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ప్రతిదాడులకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అణు, చమురు క్షేత్రాలపై దాడి చేయకుండా ఇజ్రాయెల్‌ను నిరోధించామవి.., అలా కాదని ప్రతి దాడులు పాల్పడితే ఆ తర్వాత జరిగే పరవ్యసనాలను తాము బాధ్యులం కాదని తేల్చింది.

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల నడుమ ఎలాన్‌ మస్క్‌ ఐక్యరాజ్యసమితికి టెహ్రాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరవానితో భేటీ అవ్వడం ప్రపంచ దేశాల్లో ఆసక్తికరంగా మారింది. 

👉చదవండి : ఆలయంపై దాడి ఘటన.. కెనడాలో అమల్లోకి కొత్త చట్టాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement