న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా తాను ఎట్టిపరిస్థితుల్లో తప్పుకోబోనని మరోసారి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రెసిడెంట్ జో బైడెన్ తేల్చిచెప్పారు. అయితే జూన్ 27న జరిగిన అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్‌లో డిమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయారు.
ఆయన వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారని దేశాన్ని ట్రంప్ నుంచి కాపాడాలంటే అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలని సొంతపార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖానించటం గమనార్హం. అయితే తాజగా ఆయన మరోసారి స్పందిస్తూ ప్రెసిడెంట్ రేసు నుంచి వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు.
‘‘నేను 2024 నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడించే సమర్థమైన వ్యక్తిని. నేను ప్రెసిడెంట్ రేసులోనే ఉంటాను. ప్రత్యర్థి రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడతాను’’అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన డెమోక్రాట్లకు ఓ లేఖ విడుదల చేశారు.
జూన్ 27 నాటి తొలి డిబేట్‌లో జోబైడెన్ తూలటం, మాట్లాడుతూ తడబడటం, వృద్దాప్యంతో ఆలోచన సరళీ అదుపుతప్పటం స్పష్టంగా కనిపించింది. ఇక.. అప్పటి నుంచి ఆయన అధ్యక్ష రేసు నుంచి దూరంగా ఉంటే బాగుంటుందని పలువురు సూచించారు. కాగా, బైడెన్ తప్పుకుంటే ఉపాధ్యక్షురాల కమలా హారిస్ ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో దిగుతారని ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు.. జో బైడెన్ గత పదిరోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు, డెమోక్రటిక్ నేతల మద్దతూ కూడగట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment