ఒకటి కాదు రెండు ఏకంగా 150 మీటర్ల పొడవైన పాతకాలం నాటి బంకర్ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు వెలికి తీశారు. రాజ్ భవన్ పరిసరాల్లో ఓ భారీ బంకర్ ఉందని ఆయనకు కొందరు పూర్వీకులు సమాచారం ఇచ్చిన మేరకు దీనిని వెలుగులోకి తెప్పించారు. ఆయన ఉంటున్న మల్బార్ హిల్స్లోని రాజ్భవన్ కింద దీనిని గుర్తించారు. సాధారణంగా ఉండే బంకర్లకంటే ఇది భిన్నంగా ఉంది. అతి పొడవుగా ఉండి చిన్నచిన్న గదులతో ఉన్న ఈ బంకర్ ఆశ్యర్యం గొలిపేలా ఉంది. దీనిని రెండు వైపులా 20 అడుగుల ఎత్తయిన తలుపులు ఉన్నాయి.