తరచూ బాంబు దాడులు జరిగే దేశాలలో భూగర్భ బంకర్లను నిర్మించడం తప్పనిసరి. ఇటువంటి దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి. ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలూ క్షిపణులను పరస్పరం ప్రయోగించుకుంటున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వారి ఇళ్లలోని బంకర్లలోనికి వెళ్లి తలదాచుకుంటున్నారు. యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బంకర్లలో తల దాచుకున్నవారు మాత్రం తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారు. బంకర్ ఎలా నిర్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
బంకర్ అంటే భూగర్భంలో నిర్మితమైన ఇల్లు. దీనిని భద్రతా ప్రయోజనాల కోసం నిర్మిస్తారు. ఈ బంకర్‌లు ఆర్మీ సైనికులు, అధికారులు, శివారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో అవసరం అవుతుంటాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో బంకర్లను సైనిక అధికారులు, సైనికులు తమ భద్రత కోసం ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతల నివాసాలలో బంకర్లు ఉన్నాయి.
బంకర్ అనేది సామాజిక, రసాయన, బాంబు, వైమానిక దాడుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ బంకర్లు సాధారణంగా ఉక్కు, కాంక్రీటు, కలపతో నిర్మిస్తారు. జాతీయ భద్రత కోసం పలు దేశాలు అణ్వాయుధాల నిల్వకు బంకర్లను నిర్మించాయి. ఈ బంకర్లు వేర్వేరు డిజైన్‌లను కలిగి ఉంటాయి.
ఇది కూడా చదవండి: సౌదీ స్మార్ట్ సిటీ ‘నియోమ్’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది?
Comments
Please login to add a commentAdd a comment