Defused grenade
-
బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం?
తరచూ బాంబు దాడులు జరిగే దేశాలలో భూగర్భ బంకర్లను నిర్మించడం తప్పనిసరి. ఇటువంటి దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి. ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలూ క్షిపణులను పరస్పరం ప్రయోగించుకుంటున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వారి ఇళ్లలోని బంకర్లలోనికి వెళ్లి తలదాచుకుంటున్నారు. యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బంకర్లలో తల దాచుకున్నవారు మాత్రం తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారు. బంకర్ ఎలా నిర్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. బంకర్ అంటే భూగర్భంలో నిర్మితమైన ఇల్లు. దీనిని భద్రతా ప్రయోజనాల కోసం నిర్మిస్తారు. ఈ బంకర్లు ఆర్మీ సైనికులు, అధికారులు, శివారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో అవసరం అవుతుంటాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో బంకర్లను సైనిక అధికారులు, సైనికులు తమ భద్రత కోసం ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతల నివాసాలలో బంకర్లు ఉన్నాయి. బంకర్ అనేది సామాజిక, రసాయన, బాంబు, వైమానిక దాడుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ బంకర్లు సాధారణంగా ఉక్కు, కాంక్రీటు, కలపతో నిర్మిస్తారు. జాతీయ భద్రత కోసం పలు దేశాలు అణ్వాయుధాల నిల్వకు బంకర్లను నిర్మించాయి. ఈ బంకర్లు వేర్వేరు డిజైన్లను కలిగి ఉంటాయి. ఇది కూడా చదవండి: సౌదీ స్మార్ట్ సిటీ ‘నియోమ్’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది? -
కింజల్‌ను తొలిసారి ప్రయోగించిన రష్యా.. ఆందోళనలో ఉక్రెయిన్
కీవ్: బాంబుల మోతలు, క్షిపణుల దాడులతో ఉక్రెయిన్ వణికిపోతోంది. యుద్ధం మొదలై 25 రోజులు గడుస్తున్నా ఫలితం కనిపించకపోవడంతో రష్యా మరింత రెచ్చిపోతోంది. అంతర్జాతీయ ఆంక్షలు ఓవైపు, స్వదేశంలో కూడా నిరసన గళాలు మరోవైపు వెరసి అధ్యక్షుడు పుతిన్‌కు చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో సైనిక స్థావరాలే కాకుండా సామాన్య ప్రజలను టార్గెట్ రష్యా చేసింది. ఈక్రమంలో భారీ ఎత్తున బాంబులు ప్రయోగిస్తోంది. తొలిసారి కింజల్ ప్రయోగం తాజాగా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణి ‘కింజల్’ను కూడా ప్రయోగించింది. ఉక్రెయిన్ సైనిక ఆయుధాగారంపై శుక్రవారం అర్ధరాత్రి కింజల్ విరుచుకుపడింది. పశ్చిమ ఉక్రెయిన్‌లో రొమేనియా సరిహద్దు సమీపంలోని ఇవనో–ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో క్షిపణులు, వైమానిక ఆయుధాలను నిల్వ చేసే భారీ భూగర్భ ఆయుధాగారాన్ని కింజల్ పూర్తిగా ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ప్రకటించారు. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో ప్రయోగించడం ఇదే తొలిసారి. దీంతో రష్యా అణు బాంబు ప్రయోగించే సాహసం చేస్తుందా అన్న అంశంపై రకరకాల విశ్లేషణలు విన్పిస్తున్నాయి. అంచనాకు కూడా అందడం లేదు రష్యా ప్రయోగిస్తున్న బాంబులు, క్షిపణుల్లో పేలనివాటిని, తమ సైన్యం అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేసేందుకు ఎన్నేళ్లు పడుతుందో అంచనాకు కూడా అందడం లేదని ఉక్రెయిన్ ఆందోళన వెలిబుచ్చింది. యుద్ధం ముగిశాక అమెరికా, యూరప్ దేశాలు ఇందుకు సాయం చేయాలని కోరింది. వాటిని నిర్వీర్యం చేసే సామగ్రి మారియుపోల్‌లో నాశనమైపోయిందని చెప్పింది. (చదవండి: ప్రత్యర్థుల గుండెల్లో ‘పిడిబాకు’.. కింజల్ ప్రత్యేకతలివే!) -
మోడీ కోసం ఉంచిన అదనపు విమానంలో గ్రెనేడ్!
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం ఉంచిన అదనపు విమానంలో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ఎయిర్ ఇండియా జంబో ఎయిర్ క్రాప్ట్‌లో నిర్వీర్యం చేసిన ఓ గ్రెనేడ్‌ను గతరాత్రి కనుగొన్నారు. బోయింగ్ 747-400 విమానంలో ఈ పేలుడు పదార్థాన్ని బిజినెస్ క్లాస్‌లో సిబ్బంది కనుగొన్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు శనివారం వెల్లడించారు. ఇటీవల నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అందుకోసం స్టాండ్‌బైగా ఈ విమానాన్ని సిద్ధంగా ఉంచారు. ముంబయి-హైదరాబాద్-జెడ్దా మధ్య నడిచే ఈ విమానం ప్రస్తుతం జడ్దాలో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది. మరోవైపు ప్రధాని మోడీకి భద్రతను కట్టుదిట్టం చేశారు.