మోడీ కోసం ఉంచిన అదనపు విమానంలో గ్రెనేడ్! | Defused grenade found on aircraft kept as standby for Modi | Sakshi
Sakshi News home page

మోడీ కోసం ఉంచిన అదనపు విమానంలో గ్రెనేడ్!

Published Sat, Oct 4 2014 11:18 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోడీ కోసం ఉంచిన అదనపు విమానంలో గ్రెనేడ్! - Sakshi

మోడీ కోసం ఉంచిన అదనపు విమానంలో గ్రెనేడ్!

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం ఉంచిన అదనపు విమానంలో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ఎయిర్ ఇండియా జంబో ఎయిర్ క్రాప్ట్లో నిర్వీర్యం చేసిన ఓ గ్రెనేడ్ను గతరాత్రి కనుగొన్నారు. బోయింగ్ 747-400 విమానంలో ఈ పేలుడు పదార్థాన్ని బిజినెస్ క్లాస్లో సిబ్బంది కనుగొన్నట్లు  ఎయిర్లైన్స్ అధికారులు శనివారం వెల్లడించారు.

 

ఇటీవల నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అందుకోసం స్టాండ్బైగా ఈ విమానాన్ని సిద్ధంగా ఉంచారు.  ముంబయి-హైదరాబాద్-జెడ్దా మధ్య నడిచే ఈ విమానం ప్రస్తుతం జడ్దాలో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది. మరోవైపు ప్రధాని మోడీకి భద్రతను కట్టుదిట్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement