ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి గనుల వద్ద బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి గనుల వద్ద బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. శ్రీరాంపూర్‌కు చెందిన శ్రీకాంత్(26) సీహెచ్‌పీ ప్రాంతంలోని బంకర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా అది కూలటంతో శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్న మరో ఏడుగురు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శిథిలాల నుంచి శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. అతని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.
(శ్రీరాంపూర్)