Sri Lanka Crisis: Sri Lanka Cricketer Sanath Jayasuriya Joins Protest - Sakshi
Sakshi News home page

Sanath Jayasuriya: లంకలో ఆందోళన.. నిరసనల్లో మాజీ క్రికెటర్‌ జయసూర్య

Published Sat, Jul 9 2022 5:18 PM | Last Updated on Sat, Jul 9 2022 5:46 PM

Sri Lanka cricketer Sanath Jayasuriya joins protest - Sakshi

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ హింసాత్మక ఘటనలు చోటుచేసకుంటున్నాయి. తాజాగా లంకేయులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటిని ముట్టడించారు. దీంతో ఆయన ఇంటి నుంచి విదేశీ ఓడలో పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉండగా.. వేల సంఖ్యలో నిరసనకారులు అధ్యక్ష భవనం వద్దకు వచ్చి.. లంక జాతీయ జెండాలతో నిరసనలు తెలిపారు. కాగా, ఈ నిరసనల్లో లంక మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య సైతం పాల్గొని నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. చేతిలో లంక జాతీయ జెండా పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జయసూర్య ట్విట్టర్‌ వేదికగా..‘ముట్టడి పరిసమాప్తమైంది. మీ కోట బురుజులు కుప్పకూలాయి. ఇకనైనా రాజీనామా చేసి గౌరవం నిలుపుకోండి’ అంటూ గొటబాయను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు.. నిరసనల్లో జయసూర్య కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులు చక్కబడే వరకు ఈ విప్లవం శాంతియుతంగా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. లంకలో త్వరలోనే విజయోత్సవాలు జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ఆందోళనల్లో భాగంగా జయసూర్యలో ఫొటోలు దిగేందుకు లంకేయులు పోటీపడ్డారు. 

ఇది కూడా చదవండి: లంక అధ్యక్షుడి ఇంట లంకేయుల రచ్చ.. షాకింగ్‌ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement